MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ ఫిల్మ్, '1969 గోల్డెన్ ట్రైయాంగిల్' మేటర్ అదేనా?

ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ ఫిల్మ్, '1969 గోల్డెన్ ట్రైయాంగిల్' మేటర్ అదేనా?

ఆ పోస్టర్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కథ కు సంభందించిన కొన్ని క్లూలు  పోస్టర్ లోనే చెప్పేశారు అని అర్థమవుతుంది. ఏమిటా క్లూలు..

2 Min read
Surya Prakash
Published : Aug 09 2024, 05:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
NTR Prasanth Neel

NTR-Prasanth Neel


ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న క్షణాలు వచ్చేసాయి. స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel), హీరో ఎన్టీఆర్‌ల సినిమా (NTR31) మొదలైంది. ఈరోజు శుక్రవారం పూజా కార్యక్రమాలతో దీన్ని ప్రారంభించారు. రామానాయుడు స్టూడియోస్‌లో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్   కుటుంబసభ్యులు దీనికి హాజరయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను అభిమానులు షేర్‌ చేస్తున్నారు.

27
NTR-Prasanth Neel

NTR-Prasanth Neel


 ఇక ఈ చిత్రం ప్రారంభం సందర్భంగా సోషల్ మీడియాలో ‘#NTRNeel’ హ్యష్‌ట్యాగ్‌ వైరల్‌గా మారింది. 2026 జనవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు చిత్ర టీమ్ తెలిపింది.   అయితే అదే సమయంలో ఈ చిత్రం గురించి కొన్ని ఫొటోలు,పోస్టర్ రిలీజ్ చేసారు.   ఆ పోస్టర్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కథ కు సంభందించిన కొన్ని క్లూలు  పోస్టర్ లోనే చెప్పేశారు అని అర్థమవుతుంది. ఏమిటా క్లూలు..

37
NTR-Prasanth Neel

NTR-Prasanth Neel


నీల్- ఎన్టీఆర్ మూవీ పోస్టర్ ని గమనిస్తే వెనుక వరల్డ్ మ్యాప్ ఉంది. దానిలో ఒకవైపునకు 1969 అని రాసుంది. దానికి ఆపోజిట్ లో గోల్డెన్ ట్రయాంగిల్ అని ఉంది. టాప్ లెఫ్ట్ కార్నర్లో చైనా, భూటాన్, బెంగాల్- కోల్ కతా అని రాసుంది. ఇవన్నీ చూస్తుంటే.. 1969 ఓపియం మాఫియాకి రిలేట్ చేస్తోంది.  దాంతో ఈ ఓపియం డ్రగ్ మాఫియాలో ఎన్టీఆర్ డ్రగ్ లార్డ్ అయ్యే అవకాశాలు ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. 

47
NTR-Prasanth Neel

NTR-Prasanth Neel


అలాగే ఇప్పటికే ఎన్టీఆర్ ని 70 ఏళ్ల వృద్ధుడిగా కూడా చూపించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అంటే అతను ఈ ఓపీయం మార్కెట్ లో కింగ్ పిన్ అయ్యే అవకాసం ఉంది. ఆ తర్వాత యంగ్ ఎన్టీఆర్ కూడా ఈ మాఫియాలో కీలక పాత్రధారి కావచ్చు అని  వినిపిస్తోంది. 1969 రోజుల్లో కలకత్తా పోర్ట్ గోల్డెన్ ట్రయాంగిల్ కి దగ్గరగా ఉండటంతో.. ఓపియం స్మగ్లింగ్ కి అడ్డాగా ఉండేదంట. ఆ పోర్టు నుంచే స్మగ్లింగ్ ఎక్కువగా జరిగేది.

57
NTR-Prasanth Neel

NTR-Prasanth Neel


వాస్తవానికి అప్పట్లో చైనా ఓపియం మాఫియా సభ్యులు కోల్ కతాలో కూడా యాక్టివ్ గా ఉండేవారు. కలకత్తాలో ఉండే లోకల్ సిండికేట్స్ తో కలిసి ఓపియం స్మగ్లింగ్ చేసేవి. కలకత్తా వీధుల్లో ఓపియం విచ్చలవిడిగా దొరికేదని చెబుతారు. అలా ఈ ఓపియం నేపథ్యంలో గ్యాంగులు ఏర్పడటం.. వాటి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ లింకులు సౌత్ ఈస్ట్ ఆసియాకే కాకుండా.. యూరప్ దాకా విస్తరించాయి అంటారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ మూవీ ఈ పాయింట్ మీదే వస్తుంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 
 

67
NTR-Prasanth Neel

NTR-Prasanth Neel

 
‘కేజీఎఫ్‌’, ‘సలార్‌’ సినిమాలతో జోష్ మీదున్న ప్రశాంత్‌ నీల్‌.. ఎన్టీఆర్‌ను ఎలా చూపిస్తారా అని ఆయన ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం కథ గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్‌ నీల్‌ మాట్లాడుతూ..  ‘‘దీన్ని అందరూ ఓ యాక్షన్‌ సినిమాలా భావిస్తారని నాకు తెలుసు. కానీ, నేను నా జానర్‌లోకి వెళ్లాలనుకోవట్లేదు. నిజానికిది భిన్నమైన భావోద్వేగాలతో కూడిన వైవిధ్యభరిత చిత్రంగా ఉంటుంది. ఇది నాకు చాలా కొత్త కథ అని చెప్పగలను’’ అని వెల్లడించారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

77
NTR-Prasanth Neel

NTR-Prasanth Neel


ఇటీవల ఈ సినిమా టైటిల్‌ కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ‘ఎన్టీఆర్‌31’ (NTR31) వర్కింగ్‌ టైటిల్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ‘డ్రాగన్‌’ (Dragon) పేరు ఖరారు చేసినట్లు వార్తలు వినిపించాయి. ఈ పేరుతో కొన్ని పోస్టర్లు ఎక్స్‌లో దర్శనమిచ్చాయి. ప్రశాంత్‌ నీల్‌ ఈ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కించాలని భావిస్తున్నట్లు సమాచారం.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmi Gautam: కోరుకున్నవాడితోనే రష్మి పెళ్లి.. ఎట్టకేలకు కన్ఫమ్‌ చేసిన జబర్దస్త్ యాంకర్‌
Recommended image2
Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?
Recommended image3
Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved