- Home
- Entertainment
- తల్లీ,కూతురుతో జంటగా నటించిన ఏకైక హీరో ఎన్టీ రామారావు, సీనియర్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసిన ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు?
తల్లీ,కూతురుతో జంటగా నటించిన ఏకైక హీరో ఎన్టీ రామారావు, సీనియర్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసిన ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు?
తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో విశేషాలు, వినూత్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. అటువంటి అరుదైన ఘట్టాల్లో ఒకటి ఉంది. ఒకే హీరోతో తల్లీ–కూతురు హీరోయిన్లుగా నటించడం. ఈ అరుదైన రికార్డు దివంగత నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) కు మాత్రమే సాధ్యం అయ్యింది.
- FB
- TW
- Linkdin
Follow Us

సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే హీరోయిన్‌తో తండ్రి–కొడుకులు హీరోలుగా నటించిన అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకు చిరంజీవి–రామ్ చరణ్, బాలకృష్ణ–జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున–నాగ చైతన్య వంటి తండ్రీ కొడుకులు ఒకే హీరోయిన్‌తో నటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ తల్లీ–కూతురు ఇద్దరూ ఒకే హీరో సరసన నటించిన సందర్భం మాత్రం ఇప్పటిదాకా ఒక్కసారి మాత్రమే జరిగింది.
ఆ ఘనత సాధించిన ఏకైక హీరో ఎవరో కాదు... తెలుగు చలనచిత్ర రంగాన్ని శాసించిన మహానటుడు దివంగత నందమూర తారకరామారవు. ఈ అరుదైన కాంబినేషన్ కు కారణమైన హీరోయిన్లు ఎవరో కాదు తల్లి జయశ్రీ అలియాస్ అమ్మాజీ ఆమె కుమార్తె జయచిత్ర. 1959లో విడుదలైన దైవబలం సినిమాలో జయశ్రీ, ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం పొన్నలూరు వసంత కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ద్వారా జయశ్రీకు మంచి గుర్తింపు వచ్చింది.
అంతకుముందు కాలంలో ఆమెను జయశ్రీగా పిలిచేవారు. తరువాత ఆమె కుమార్తె జయచిత్ర కూడా సినిమాల్లోకి ప్రవేశించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 1976లో విడుదలైన మా దైవం అనే సినిమాలో జయచిత్ర ఎన్టీఆర్ సరసన నటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక జైలర్ పాత్రలో కనిపించగా, నేరస్థులను మారుస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపే కథాంశంతో సినిమా రూపొందింది.
ఈ విధంగా తల్లి–కూతురు ఇద్దరితోనూ హీరోగా నటించిన ఏకైక నటుడు సీనియర్ ఎన్టీఆర్ కావడం విశేషం. ఈ అరుదైన సంఘటన తరువాత కానీ, ముందు కానీ ఇండియన్ సినిమా చరిత్రలో మరొకసారి జరుగలేదు. ఇవే కాకుండా శృతీహాసన్–సారిక, జాన్వీ కపూర్–శ్రీదేవి వంటి తల్లీ కూతుళ్లు సినిమాల్లో నటించినా, వారు ఒకే హీరోతో నటించే అవకాశం రాలేదు.
తెలుగు సినిమాల్లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన ఎన్టీఆర్ ఈ అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. నటుడిగా మాత్రమే కాదు, నాయకుడిగా, ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోయారు. ఎన్టీఆర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చేసిన ప్రయోగాలు, సీఎంగా ఆయన చేసిన సంక్షేమ పథకాలు చరిత్రలోనే ఎవరు చేయలేదని చెప్పాలి. అందుకే తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోరయారు ఎన్టీఆర్.