MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • నయనతారకు మరో షాకిచ్చిన ధనుష్. శింబుకి ఫ్రీ, లేడీ సూపర్ స్టార్ కు మాత్రం 10 కోట్ల ఫైన్

నయనతారకు మరో షాకిచ్చిన ధనుష్. శింబుకి ఫ్రీ, లేడీ సూపర్ స్టార్ కు మాత్రం 10 కోట్ల ఫైన్

నయనతారకు మరోసారి పెద్ద షాక్ ఇచ్చాడు స్టార్ హీరో ధనుష్. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య జరుగుతున్న ఫైట్ గురించి అందరికి తెలిసిందే. ఈ విషయంలోనే ధనుష్ నయనతారకు కోపం వచ్చేలా ఓ పనిచేశారు. ఇంతకీ ఏం చేశాడంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 01 2025, 06:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Youtube/Shreyas Media

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు ధనుష్. హీరోగా మాత్రమే కాదు దర్శకుడు, నిర్మాత, గాయకుడు, గేయ రచయితగా మల్టీ టాలెంట్ చూపిస్తూ.. ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్ తో కొనసాగుతున్నారు. అంతే కాదు ధనుష్ తనతో పాటు ఎంతో మందికి ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చాడు. 

తన సినిమాల ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్, హీరో శివ కార్తికేయన్ వంటి ఎంతో మంది టాలెంట్ ఉన్నవారిని పరిచయం చేశారు ధనుష్. ఇక ప్రొడ్యూసర్ గా కూడా ధనుష్ ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించారు. ఆ జాబితాలో నానుమ్ రౌడీ ధాన్ కూడా ఒకటి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : Instagram

విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ధనుష్ నిర్మించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార జంటగా నటించారు. ఈ మూవీకి ముందు స్నేహితులుగా ఉన్న ధనుష్, నయనతార, ఈ చిత్రం తర్వాత విడిపోయారు. దానికి కారణం ఆ చిత్ర షూటింగ్ సమయంలో ఏర్పడిన మనస్పర్థలే. ఇచ్చిన బడ్జెట్ కంటే 10 కోట్లు ఎక్కువ ఖర్చు చేసినందుకు నయనతారపై ధనుష్ అసంతృప్తిగా ఉన్నారు. ఈ ఖర్చు వల్ల ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయినా ధనుష్ కు పెద్దగా లాభం రాలేదు.

35
Image Credit : our own

ఇంతలో నటి నయనతార తన డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీ ధాన్ పాటలను ఉపయోగించుకోవడానికి ధనుష్ ను అనుమతి కోరారు. ఎందుకంటే నానుమ్ రౌడీ ధాన్ చిత్రంలో నటించినప్పుడే విగ్నేష్ శివన్ - నయనతార మధ్య ప్రేమ చిగురించింది. ఆ చిత్రంలోని పాటలను నయనతారను దృష్టిలో పెట్టుకుని విగ్నేష్ శివన్ రాశారు. అందుకే ఆ పాటలను తన డాక్యుమెంటరీలో ఉపయోగించుకోవడానికి అనుమతి కోరారు నయన్. కానీ నటుడు ధనుష్ అనుమతి ఇవ్వలేదు.

45
Image Credit : our own

దీంతో ఆ పాటలు లేకుండానే డాక్యుమెంటరీని విడుదల చేయాలని నిర్ణయించుకున్న నయనతార, నానుమ్ రౌడీ ధాన్ షూటింగ్ సెట్ లో తీసిన 3 సెకన్ల వీడియోను ఆ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. దాంతో ఈ వీడియోను తొలగించాలని నోటీసు పంపిన ధనుష్, తొలగించకపోతే తనకు 10 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని హెచ్చరించారు. దీంతో వారిద్దరి మధ్య వివాదం ముదిరింది. దీంతో కోర్టును ఆశ్రయించిన ధనుష్, నయనతారపై కేసు వేశారు. ఆ కేసు విచారణలో ఉంది.

55
Image Credit : Instagram

ఇలా నయనతారను 3 సెకన్ల వీడియో కోసం 10 కోట్లు అడిగిన ధనుష్, మరోసారి నయనతారకు బిగ్ షాక్ ఇచ్చాడు. రీసెంట్ గా వెట్రిమారన్ దర్శకత్వంలో వడ చెన్నై కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం కోసం నటుడు సింబుకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా దానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చారు. దీన్ని చూసిన నెటిజన్లు నయనతారను ట్యాగ్ చేసి మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. 

ధనుష్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీ డియాలో ఓ ఆట ఆడేసుకుంటున్నారు. స్నేహితుల కోసం ధనుష్ ఏదైనా చేస్తారని అభిమానులు అంటున్నారు. ఈ NOC వివాదంలో ధనుష్, సింబు, నయనతారలను ఉద్దేశించి నెటిజన్లు పోస్ట్ చేస్తున్న మీమ్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నయనతార
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
నాగార్జున మొదటి భార్య లక్ష్మి రెండో పెళ్లి చేసుకుంది ఎవరినో తెలుసా? నాగచైతన్య తల్లి ఇప్పుడు ఎక్కడున్నారు
Recommended image2
ఎన్టీఆర్ తో సినిమాను మూడు సార్లు రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved