MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • పౌరాణికాల్లో ఎన్టీఆర్ ఆ ఒక్క పాత్రకి ఎందుకు ఒప్పుకోలేదు.. దాసరి ఎంత బతిమాలినా నో, ఏం జరిగింది

పౌరాణికాల్లో ఎన్టీఆర్ ఆ ఒక్క పాత్రకి ఎందుకు ఒప్పుకోలేదు.. దాసరి ఎంత బతిమాలినా నో, ఏం జరిగింది

స్వర్గీయ నందమూరి తారక రామారావు పురాణాల్లో ఆయన పోషించని పాత్ర అంటూ లేదు. తెలుగు ప్రేక్షకుల్లో కృష్ణుడిగా, రాముడిగా గుర్తుండిపోయారు. అంతే కాదు వెంకటేశ్వర స్వామిగా, శివుడిగా, రావణుడిగా, భీష్ముడిగా ఇలా ఎన్టీఆర్ అనేక పాత్రల్లో నటించారు.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Oct 10 2024, 02:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

స్వర్గీయ నందమూరి తారక రామారావు పురాణాల్లో ఆయన పోషించని పాత్ర అంటూ లేదు. తెలుగు ప్రేక్షకుల్లో కృష్ణుడిగా, రాముడిగా గుర్తుండిపోయారు. అంతే కాదు వెంకటేశ్వర స్వామిగా, శివుడిగా, రావణుడిగా, భీష్ముడిగా ఇలా ఎన్టీఆర్ అనేక పాత్రల్లో నటించారు. పౌరాణిక చిత్రాలు అంటే ఎన్టీఆర్ మాత్రమే చేయాలి అన్నట్లుగా పరిస్థితి ఉండేది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

పౌరాణిక చిత్రాలు చేసే సమయంలో ఎన్టీఆర్ భక్తి శ్రద్దలతో నిష్ఠగా ఉండేవారట. ఆహార నియమాలు కట్టుబాట్లు పాటించేవారట. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి తగ్గట్లుగా తమ చిత్రాలతో ఇమేజ్ పెంచిన దర్శకుల్లో దాసరి ఒకరు. దాసరి నారాయణ రావు, ఎన్టీఆర్ కాంబినేషన్ లో అనేక సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు లాంటి చిత్రాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు. 

35

దాసరి ఎన్టీఆర్ తో యాక్షన్ ఎమోషన్ తో సోషల్ డ్రామాలు చేశారు. కానీ ఎన్టీఆర్ తో ఎప్పటికైనా పౌరాణిక చిత్రం చేయాలనేది దాసరి చిరకాల కోరిక. కానీ దాసరి కోరిక కలగానే మిగిలిపోయింది. ఎన్టీఆర్ కోసం కథ సిద్ధం చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. మహాభారతంలో ఎన్టీఆర్ కృష్ణుడిగా, అర్జునుడిగా, భీముడుగా కనిపించారు. భీముడు, దుర్యోధనుడు, కీచకుడు, జరాసంధుడు, బకాసురుడు ఒకే నక్షత్రంలో జన్మించిన సింహబలులు. వీరిలో ఎన్టీఆర్ భీమ దుర్యోధన కీచక పాత్రల్లో నటించారు. 

Also Read: మీ నాన్న నిర్మాత కాబట్టే అవకాశాలు, స్టార్ హీరోని డైరెక్ట్ గా అడిగేసిన యాంకర్..ఎలా సమాధానం ఇచ్చాడో తెలుసా

45

ఎన్టీఆర్ తో జరాసంధుడు పాత్ర ఆధారంగా ఒక చిత్రం చేయాలనీ దాసరి భావించారు. ఎన్టీఆర్ జరాసంధుడి పాత్రలో కథ సిద్ధం చేసుకున్నారు. ఈ విషయం ఎన్టీఆర్ కి దాసరి చెప్పారు. ఆ పాత్రలో నటించాలని ఎన్టీఆర్ కి కూడా ఆసక్తి ఉండేదట. కానీ అప్పటికే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయ్యారు. దీనితో ఇకపై పౌరాణిక చిత్రాల్లో నటించనని ప్రకటించారు. 

55

దాసరి ఎంత రిక్వస్ట్ చేసినా ఆ చిత్రానికి ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. ఆ విధంగా దాసరి కల కలగానే మిగిలిపోయింది. ఎన్టీఆర్, దాసరి కాంబినేషన్ లో వచ్చిన బొబ్బిలి పులి చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి ముందు కూడా దాసరి సెన్సార్ సమస్యలతో సతమతమయ్యారు. చివరికి ఈ చిత్రం విడుదలై అఖండ విజయం సాధించింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నందమూరి తారక రామారావు

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved