- Home
- Entertainment
- క్రేజీ న్యూస్... ఎన్టీఆర్ తో శంకర్ సినిమా..? తారక్ ను ఒప్పించే పనిలో స్టార్ ప్రొడ్యూసర్, ముహూర్తం ఎప్పుడంటే..?
క్రేజీ న్యూస్... ఎన్టీఆర్ తో శంకర్ సినిమా..? తారక్ ను ఒప్పించే పనిలో స్టార్ ప్రొడ్యూసర్, ముహూర్తం ఎప్పుడంటే..?
ఆ మధ్య వరకూ ఎంత పెద్ద సినిమా చేసినా.. తమిళ హీరోలతోనే చేసేవాడు స్టార్ డైరెక్టర్ శంకర్. ఇక ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ తో వరుస సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడట. ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న ఈ స్టార్ డైరెక్టర్ ఎన్టీఆర్ తో కూడా సినిమా ప్లాన్ చేస్తున్నాడట.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ .. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తో ఫస్ట్ టైమ్ తెలుగులో.. పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. చెర్రీ కెరీర్ లో ఇది 15వ సినిమాగా తెరకెక్కుతోంది. .. దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో 50వ సినిమాగా రూపొందుతుంది ఈసినిమా. ఇక ఈసినిమాపై మెగా ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఆచార్య సినిమా ప్లాప్ అవ్వడంతో.. శంకర్ సినిమా అంతకుమించి హిట్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమాకి ఇదివరకు విశ్వంభర , సర్కారోడు అనే టైటిల్స్ ప్రచారంలోకి రాగా.. తాజాగా అధికారి అనే మరో టైటిల్ వినిపిస్తోంది.
ఈ సినిమా ద్వారా కూడా శంకర్ మరోసారి మరో మెసేజ్ ఇవ్వబోతున్నారు. అందుకే ఈసినిమాలో రామ్‌చరణ్ ఎన్నికల కమీషనర్‌గా, ఐఎయస్ అధికారిగా కనిపిస్తాడని వార్తలొచ్చాయి. అయితే అతడి పాత్ర ఏంటనేది ఇప్పటివరకూ అధికారికంగా తెలియలేదు. అలాగే. ఇందులో చెర్రీ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడని కూడా రూమర్స్ చక్కెర్లు కొడుతున్నాయి.
ఇదిలా ఉంటే.. రామ్ చరణ్‌తో సినిమా పూర్తయిన వెంటనే.. శంకర్ మరోసారి టాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నట్టు సమాచారం. చరణ్ తో సినిమా పూర్తి అయిన తరువాత యంగ్ టైగర్ యన్టీఆర్ తో కూడా శంకర్ ఓ సినిమా చేస్తాడని వార్తలొస్తున్నాయి.
ఇందులో మరో విశేషం ఏంటీ అంటే... ఈ సినిమాని కూడా దిల్ రాజే నిర్మించబోతున్నట్టు టాలీవుడ్ టాక్. శంకర్ తో ఓ సినిమా తీయాలని దిల్ రాజు ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. భారతీయుడు 2 కి ఒకదశలో ఆయనే నిర్మాత అని వార్తలు వచ్చాయి. కానీ ఎందుకనో అది కుదరలేదు. అప్పుడిచ్చిన అడ్వాన్సులతోనే చెర్రీ హీరోగా శంకర్ దర్శకత్వంలోని సినిమాను సెట్ చేశాడు దిల్ రాజు.
ఇక ఈ సినిమా కథ డిస్కషన్ సమయంలోనే దిల్ రాజుకు శంకర్ మరో అదిరిపోయే కథ వినిపించాడట. అది దిల్ రాజు కు బాగా నచ్చిందని , ఆ కథతోనే యన్టీఆర్ హీరోగా ఓ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. శంకర్ దర్శకత్వం అంటే యన్టీఆర్ నో చెప్పే అవకాశమే లేదు. అందుకే ఈ కాంబో ఖచ్చితంగా సెట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
చరణ్ తో సినిమాను సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నాడు శంకర్. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మూవీ టీమ్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇక చరణ్ తో సినిమా తర్వాత వెంటనే యన్టీఆర్ సినిమా సెట్స్ పైకి వెళుతుందట. అయితే ఇంత వరకూ ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేదు
త్వరలో ఈ మూవీపై ప్రకటన వస్తుందని సమాచారం. మరి దీంట్లో నిజమెంత ఉందో తెలియాలి అంటే.. అనౌన్స్ మెంట్ వరకూ ఆగాల్సిందే. రామ్ చరణ్ తో శంకర్ సినిమా హిట్ కొడితే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. మరి కొరటాలతో, ప్రశాంత్ నీల్ తో సినిమా కమిట్ అయి ఉన్న ఎన్టీఆర్ శంకర్ తో సినిమాను ఒప్పుకుండా లేదా చూడాలి.