MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గుర్తు పట్టడం కూడా కష్టమే... మహేష్, ఎన్టీఆర్ లతో జతకట్టిన స్టార్ హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి..!

గుర్తు పట్టడం కూడా కష్టమే... మహేష్, ఎన్టీఆర్ లతో జతకట్టిన స్టార్ హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి..!

ఎన్టీఆర్, చిరంజీవి, మహేష్ వంటి టాప్ స్టార్స్ తో జతకట్టిన రక్షిత లేటెస్ట్ లుక్ చూసి ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. అసలు ఆమె ఈమేనా అన్నంతగా రక్షిత మారిపోగా ఇలా అయిపోయిందేంటని అవాక్కవుతున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 03 2022, 07:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Rakshitha

Rakshitha

ఈ జనరేషన్ యూత్ కి రక్షిత అంటే పెద్దగా తెలియకపోవచ్చు. 2000లలో యువతకు రక్షిత పరిచయం అక్కర్లేని పేరు. స్టార్స్ తో జతకట్టిన రక్షిత హీరోయిన్ గా ముప్పైకి పైగా చిత్రాలు చేశారు. వాటిలో కొన్ని సూపర్ హిట్స్ ఉన్నాయి. 
 

29
Rakshitha

Rakshitha

కన్నడ అమ్మాయి అయిన రక్షిత మోడల్ గా కెరీర్ ప్రారంభించారు. దర్శకుడు పూరి జగన్నాధ్ రక్షితకు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. రాజ్ కుమార్ వారసుడిగా పునీత్ కుమార్ వెండితెర అరంగేట్రం చేసిన అప్పు మూవీకి రక్షితను హీరోయిన్ గా తీసుకున్నాడు. అప్పు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 
 

39
Rakshitha

Rakshitha

అప్పు చిత్రాన్ని తెలుగులో ఇడియట్ గా రవితేజతో రీమేక్ చేశారు. తెలుగులో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రీమేక్ లో సైతం రక్షిత హీరోయిన్ గా నటించారు. దీంతో ఆమెకు ఆఫర్స్ పెరిగాయి. ముఖ్యంగా పూరి తన చిత్రాల్లో ఆమెకు ఛాన్సులు ఇచ్చాడు. 
 

49
Rakshitha

Rakshitha


సింహాద్రి తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఎన్టీఆర్ మంచి ఫార్మ్ లో ఉన్న పూరి జగన్నాధ్ ఆంధ్రావాలా మూవీ చేశారు. అప్పట్లో ఈ సినిమాకు వచ్చిన హైప్ మరే సినిమాకు రాలేదు. ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కావడం ఖాయం అనుకున్నారు. అనూహ్యంగా ఆంధ్రావాలా పరాజయం పొందింది. ఈ మూవీలో రక్షిత హీరోయిన్ గా నటించారు. 

59
Rakshitha

Rakshitha

పూరి డైరెక్షన్ లో వచ్చిన హిట్ మూవీ శివమణిలో రక్షిత సెకండ్ హీరోయిన్ గా నటించారు. మహేష్ తో నిజం, చిరంజీవికి జంటగా అందరివాడు చిత్రాల్లో రక్షిత నటించారు. బొద్దుగా ఉండే రక్షిత తక్కువ ఏజ్ లోనే బరువెక్కారు. అందరివాడు సినిమా నాటికి రక్షిత షేప్ అవుట్ అయ్యారు. 
 

69
Rakshitha

Rakshitha

మంచి ఆరంభం లభించినా రక్షిత ఉపయోగించుకోలేకపోయారు. ఆమె కెరీర్ త్వరగా డౌన్ అయ్యింది. స్టార్స్ తో చేసిన ఆంధ్రావాలా, నిజం, అందరివాడు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. నిజం మూవీ పర్వాలేదు అనిపించినా మహేష్ ఇమేజ్ కి సెట్ కాలేదు. అలా టాలీవుడ్ లో ఆమెకు ఆఫర్స్ తగ్గాయి. 
 

79
Rakshitha

Rakshitha

2005లో విడుదలైన జగపతి తెలుగులో రక్షితకు చివరి చిత్రం. తర్వాత ఆమె కన్నడలో వరుసగా చిత్రాలు చేశారు. పెళ్లి చేసుకునే వరకు రక్షిత కన్నడ పరిశ్రమకే పరిమితమయ్యారు.

89
Rakshitha

Rakshitha

2007లో దర్శకుడు ప్రేమ్ ని ప్రేమించి వివాహం చేసుకున్నారు. నటనకు గుడ్ బై చెప్పిన రక్షిత నిర్మాతగా మారారు. పెళ్లయ్యాక రక్షిత మరింత లావుగా మారారు. ఒక బిడ్డకు జన్మనిచ్చిన రక్షిత ప్రస్తుతం గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. 
 

99
Rakshitha

Rakshitha

38ఏళ్ల రక్షితను ఇప్పుడు చూస్తే ఆమె ఈమేనా అనిపించక మానదు. అంతలా రక్షిత మారిపోయారు. శరీరతత్త్వంతో పాటు శ్రద్ధ తీసుకోకపోవడంతో ఆమె విపరీతంగా బరువు పెరిగారు. ఒకప్పటి అందాల భామ, గ్లామరస్ హీరోయిన్ ని ఇలా చూసి ఆమె అభిమానులు ఒకింత విచారం వ్యక్తం చేస్తున్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఆయన్ని నమ్మి వచ్చిన హీరోయిన్, చిరంజీవి సినిమాతో ఘోర అవమానం..సెట్ లో అందరి ముందు అసభ్యంగా..
Recommended image2
సంజూ శాంసన్ vs కీర్తి సురేష్ .. వీరిలో నెంబర్ 1 ఎవరో తెలుసా..?
Recommended image3
Maheshbabu కోసం కదిలి వచ్చిన పవన్ కళ్యాణ్‌, వెంకటేష్‌, నాగార్జున.. కట్‌ చేస్తే సినిమా ఫ్లాప్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved