MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Balakrishna: పనిగట్టుకొని బాలయ్యతో ఫ్లాప్‌ మూవీ తీసిన ఎన్టీఆర్‌.. ఎన్బీకే రియాక్షన్‌కి డైరెక్టర్‌ ఫ్యూజుల్ ఔట్

Balakrishna: పనిగట్టుకొని బాలయ్యతో ఫ్లాప్‌ మూవీ తీసిన ఎన్టీఆర్‌.. ఎన్బీకే రియాక్షన్‌కి డైరెక్టర్‌ ఫ్యూజుల్ ఔట్

బాలకృష్ణతో పనిగట్టుకొని ఫ్లాప్‌ సినిమా తీశాడు ఎన్టీఆర్. దర్శకుడు కోదండరామిరెడ్డి చెప్పినా వినలేదు. దీంతో షూటింగ్‌లో బాలయ్య రియాక్షన్‌కి డైరెక్టర్‌కి ఫ్యూజులు ఎగిరిపోయాయట.

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 22 2026, 11:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఎన్టీఆర్‌ వారసత్వాన్ని కొనసాగిస్తున్న బాలకృష్ణ
Image Credit : our own

ఎన్టీఆర్‌ వారసత్వాన్ని కొనసాగిస్తున్న బాలకృష్ణ

నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్‌) నట వారసుడిగా రాణిస్తున్నారు బాలకృష్ణ. ఆయన వారసుల్లో బాలయ్య ఒక్కరే సక్సెస్‌ అయ్యారు. ఇంత కాలం నటుడిగా రాణిస్తున్నారు. ఆ తర్వాత జూ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే కెరీర్‌ ప్రారంభంలో బాలయ్య సినిమాల ఎంపిక మొత్తం ఎన్టీఆర్‌ చేతుల్లోనే ఉండేది. ఆయన సీఎం అయ్యాక కూడా కొడుకు సినిమాలను తనే ఎంపిక చేసేవారు. అయితే ఈ క్రమంలో బాలయ్యకి పనిగట్టుకొని ఫ్లాప్‌ మూవీ తీశారు ఎన్టీఆర్‌.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎన్టీఆర్‌ మొహం మీదే నచ్చలేదని చెప్పిన దర్శకుడు
Image Credit : Asianet News

ఎన్టీఆర్‌ మొహం మీదే నచ్చలేదని చెప్పిన దర్శకుడు

ఎన్టీఆర్‌ 1983లో సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత కూడా సినిమాలు చేశారు. వీలు చూసుకొని షూటింగ్‌లు చేసేవారు. అప్పట్లో చాలా వరకు సెట్ లు, స్టూడియోలోనే షూటింగ్‌లు ఉండటంతో ఈజీ అయ్యింది. రెండింటిని బ్యాలెన్స్ చేశారు. ఈ క్రమంలో పరుచూరి బ్రదర్స్.. అప్పట్లో ఓ కథని తీసుకొని ఎన్టీఆర్‌ వద్దకు వెళ్లారట. వారితోపాటు దర్శకుడు కోదండరామిరెడ్డి కూడా వెళ్లారు. ఉదయం నాలుగున్నరకి వెళ్లి రామారావుకి కథ చెప్పారు. మీకు ఎలా అనిపించిందని కోదండరామిరెడ్డిని ఎన్టీఆర్‌ అడగ్గా నచ్చలేదని చెప్పారు. దీంతో ఈ సినిమా వద్దని వెళ్లిపోయారట. మరో కథతో కలుద్దామని రామారావు కూడా చెప్పారు.

34
బాలయ్యతో బలవంతంగా సినిమా చేయించిన ఎన్టీఆర్‌
Image Credit : X/Balakrishna

బాలయ్యతో బలవంతంగా సినిమా చేయించిన ఎన్టీఆర్‌

ఆ తర్వాత కొన్ని రోజులకు ఎన్టీఆరే ఫోన్‌ చేసి, బ్రదర్‌ ఎందుకో ఆ కథ బాగుంటుందనిపిస్తుంది, సినిమా చేద్దామని చెప్పారట. పెద్దాయన చెప్పడంతో కోదండరామిరెడ్డి కూడా కాదనలేకపోయారట. బాలకృష్ణకి చెబితే ఆయన కూడా నచ్చలేదన్నాడట. కానీ నీకేం తెలుసు, సినిమా చేయమని ఎన్టీఆర్‌ గట్టిగా చెప్పడంతో దాన్ని మొదలు పెట్టారు. షూటింగ్‌ చేశారు. ఇందులో బాలయ్య పోలీస్‌ పాత్రలో కనిపిస్తారు. ఓ షాట్‌ సరిగా రాలేదు. ఆ సీన్‌ మళ్లీ చేయాలని దర్శకుడు కోరగా, ఫ్లాప్‌ మూవీకి మరో షాట్‌ ఎందుకు అదే పెట్టేయండి అన్నాడట బాలయ్య. దెబ్బకి కోదండరామిరెడ్డికి ఫ్యూజులు ఎగిరిపోయాయట. బాలయ్య కూడా అప్పటికే ఫిక్స్ అయ్యారు ఆ సినిమా పోతుందని.

44
బాలయ్య కెరీర్‌లో డిజాస్టర్‌గా నిలిచిన తిరగబడ్డ తెలుగుబిడ్డ
Image Credit : Youtube/ETV

బాలయ్య కెరీర్‌లో డిజాస్టర్‌గా నిలిచిన తిరగబడ్డ తెలుగుబిడ్డ

అన్నట్టుగానే సినిమాని కంప్లీట్‌ చేసి రిలీజ్‌ చేశారట. 1988 మే 11న ఈ చిత్రం రిలీజ్‌ అయ్యింది. అనుకున్నట్టుగానే డిజాస్టర్‌గా నిలిచింది. మరి ఇంతకి ఆ సినిమా ఏంటంటే `తిరగబడ్డ తెలుగుబిడ్డ`. నందమూరి హరికృష్ణ నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీలో భానుప్రియ హీరోయిన్‌గా నటించింది. సినిమా దారుణమైన పరాజయం చెందిందట. ఈ విషయాన్ని దర్శకుడు కోదండరామిరెడ్డి.. అలీతో సరదాగా షోలో వెల్లడించడం విశేషం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నందమూరి తారక రామారావు
నందమూరి బాలకృష్ణ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image2
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Recommended image3
P N Ramachandra Rao: సీనియర్ దర్శకుడికి అరుదైన పురస్కారం.. గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం
Related Stories
Recommended image1
Lenin Team Remunerations: లెనిన్‌ మూవీకి అఖిల్‌ పారితోషికం ఎంతో తెలుసా? కెరీర్ లోనే హైయ్యెస్ట్.. టీమ్ ఫీజు వివరాలు
Recommended image2
Maa Inti Bangaram Collections: మా ఇంటి బంగారం ఫైనల్‌ కలెక్షన్లు, ఇంకా ఆ మార్క్‌ దాటలేదా? సమంత పంటపండింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved