- Home
- Entertainment
- అల్లు అర్జున్ తో అనుకున్న సినిమాను కొరటాల శివ ఎన్టీఆర్ తో చేస్తున్నాడా..? పోస్టర్ చెపుతున్న నిజం..?
అల్లు అర్జున్ తో అనుకున్న సినిమాను కొరటాల శివ ఎన్టీఆర్ తో చేస్తున్నాడా..? పోస్టర్ చెపుతున్న నిజం..?
అల్లు అర్జున్ తో చేయాలి అనున్న సినిమాను కొరటాల శివ ఎన్టీఆర్ తో చేస్తున్నాడా..? ఎన్టీఆర్ 30 పోస్టర్ చెపుతున్న సీక్రేట్ఏంటీ..? కొరటాల శివ ఎక్కడ దొరికిపోయాడు..?

NTR 30 Update
ఎన్టీఆర్ 30 ని చాలా ప్రెస్టేజియస్ గా స్టార్ట్ చేశాడు కొరటాల శివ. ఆచార్య సినిమా వల్ల కెరీర్ లో ఫస్ట్ పెయిల్యూర్ తన ఖాతాలో వేసుకున్న కొరటాల.. ఎన్టీఆర్ సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఈసినిమాకు సబంధించి.. చిన్న వీడియోతో కూడిన అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు మేకర్స్. టైటిల్ మాత్రం చేయలేదు.
రక్తం ఏరులైపారగా.. కెరటాలు ఎరుపెక్కాయి అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్ తో... ఒళ్లు జలజరించే విజువల్స్ లో మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మోషన్ పోస్టర్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్..దిల్ ఖుష్ అయ్యారు. ఎన్టీఆర్ పవర్ ఫుల్ లుక్ చూసి మెస్మరైజ్ అయ్యారు అభిమానులు.
అయితే ఈ మోషన్ పోస్టర్ కు సంబంధించి ఆడియన్స్ లో రకరకాల అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. ఎన్టీఆర్ తో ఈసినిమా గతంలో అల్లు అర్జున్ కోసం కొరటాల తయారు చేసుకున్న కథతో చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం మోషన్ పోస్టర్ ను చూసిన వారకి అనుమానం కలిగించేలా ఉంది.
గతంలో అల్లు అర్జున్ కొరటాలతో సినిమా అనౌన్స్ చేశాడు. అయితే అనివార్య కారణాల వల్ల ఈమూవీ సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఎవరికి వారు వేరే సినిమాలు చేసుకుంటూ ఉండిపోయారు. అయితే ఇప్పుడు అదే కథతో కొరటాల ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఎన్టీఆర్ 30మోషన్ పోస్టర్.. గతంలో అల్లు అర్జున్ కోసం డిజైన్ చేసిన పోస్టర్ ఒకేలా ఉండటంతో ఇది పక్కాగా అల్లు అర్జున్ కోసం కొరటాల రాసుకున్న కదే అని ఫిక్స్ అవుతున్నారుజనాలు. పైగా బన్నీ సినిమాను.. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాను యువసుధ ఆర్ట్స్ వారే ప్రొడ్యూసర్స్ గా అనౌన్స్ చేసే సరికి.. ఈ విషయంలో ఆడియన్స్ ఫిక్స్ అవుతున్నారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఎన్టీఆర్30 ను నిర్మిస్తున్నారు. మరో రెండు నెలల్లో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఎన్టీఆర్ 30 (NTR 30) హీరోయిన్ ఫైనల్ కాలేదు. అలియా భట్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న నేపథ్యంలో మరో హీరోయిన్ ని ఎంపిక చేసే పనిలో ఉన్నారు.