ఎన్టీఆర్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న `ఆచార్య` రిజల్ట్.. అదే నిజమైతే కొరటాలకి డబుల్ బోనాంజా ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లో టెన్షన్ మొదలైంది. అసలే `ఆర్‌ఆర్‌ఆర్` విషయంలో జరిగిన అన్యాయం జరిగిందనే అసంతృప్తితో ఉన్న అభిమానుల్లో కొత్త టెన్షన్ పట్టుకుంది. `ఆచార్య` రిజల్ట్ చూశాక నెక్ట్స్ సినిమా విషయంలో ఆందోళన చెందుతున్నారు.
ఎన్టీఆర్(NTR) నాలుగేండ్ల తర్వాత భారీ మల్టీస్టారర్ `ఆర్‌ఆర్‌ఆర్`(RRR)తో మెరిశారు. ఇందులో కొమురం భీమ్ పాత్రలో నట విశ్వరూపం చూపించారు. పులితో ఫైట్, అడవి జంతువులతో యాక్షన్ ఎపిసోడ్, `కొమురం భీముడో` పాటలో అదరగొట్టేశాడు. ఆడియెన్స్ హృదయాలను పిండేశాడు. ఎక్స్ ప్రెషన్స్ తోనూ రక్తికట్టించాడు. ఈ సినిమాతో తారక్‌కి పాన్ ఇండియా స్థాయి గుర్తింపు వచ్చింది.
నెక్ట్స్ ఎన్టీఆర్ వరుసగా సినిమాలు చేయబోతున్నారు. ఆయన ఇమ్మిడియెట్‌గా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయాల్సి ఉంది. `ఆచార్య` నేడు రిలీజ్ అయిన నేపథ్యంలో కాస్త వెకేషన్ పూర్తి చేసుకున్నాక ఎన్టీఆర్ సినిమాపై కొరటాల ఫోకస్ పెట్టబోతున్నారు. ఎన్టీఆర్ 30 పేరు(వర్కింగ్ టైటిల్)తో ఈ చిత్రం రూపొందుతుంది. వచ్చే నెలలో ప్రారంభం కాబోతుంది. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మే 20న సినిమాని లాంఛ్ చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తుంది.
అయితే ఇప్పుడు ఎన్టీఆర్‌కి కొత్త టెన్షన్ పట్టుకుందట. ఆయన రాజమౌళి(Rajamouli) విషయంలో టెన్షన్ పడుతున్నారని తెలుస్తుంది. రాజమౌళితో సినిమాలు చేసిన హీరోల తదుపరి చిత్రాలు పరాజయం చెందుతాయనే సెంటిమెంట్ చాలా కాలంగా వినిపిస్తుంది. ఆయనతో పనిచేసిన హీరోల సినిమాల తదుపరి చిత్రాల ఫలితాలే అందుకు నిదర్శనమంటున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ విషయంలో స్వయంగా అలా జరిగింది. ప్రత్యక్షంగా `రాజమౌళి సెంటిమెంట్`(Rajamouli Sentiment)ని తారక్ చవిచూశాడు.
రాజమౌళిని దర్శకుడిగా పరిచయం చేసిందే ఎన్టీఆర్. `స్టూడెంట్ నెం. 1` చిత్రంతో వీరి జర్నీ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన `సుబ్బు` పరాజయం చెందింది. ఆ తర్వాత `సింహాద్రి`తో స్టార్ ఇమేజ్‌ని అందుకున్న తారక్.. పూరితో కలిసి `ఆంధ్రావాలా` చేసి పరాజయం చవిచూశాడు. మరోవైపు జక్కన్నతో `యమదొంగ` చేసి హిట్ అందుకున్న ఆయన ఆ నెక్ట్స్ `కంత్రి`తో డిజాస్టర్‌ని మూటగట్టుకున్నాడు. ఇప్పుడు `ఆర్‌ఆర్‌ఆర్`తో బ్లాక్ బస్టర్‌ని అందుకున్న ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. కానీ నెక్ట్స్ సినిమా విషయంలోనే ఆయన టెన్షన్ పడుతున్నారట.
`ఆర్‌ఆర్‌ఆర్`లో తనతోపాటు కలిసి నటించిన రామ్ చరణ్ విషయంలోనూ అదే జరిగింది. `మగధీర` తర్వాత `ఆరేంజ్` సినిమా పరాజయం చెందింది. అదీ కాదని, ఇప్పుడు `ఆచార్య` సైతం డివైడ్ టాక్‌ని తెచ్చుకుంటోంది. ఎన్టీఆర్ స్వతహాగా తాను చూడటంతోపాటు, ఇప్పుడు `ఆచార్య` విషయంలోనూ అదే జరగడంతో తారక్ ఫ్యాన్స్ లో టెన్షన్ పట్టుకుందట. `రాజమౌళి సెంటిమెంట్`కి బలికాక తప్పదా? అనే ఆలోచనలో పడ్డారని టాక్.
`ఆర్‌ఆర్‌ఆర్` తర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ కొరటాలతోనే చేస్తున్నారు. రాజమౌళి సెంటిమెంట్ నిజమైతే కొరటాల(Koaratala Siva) చిత్రం పరిస్థితేంటనే ప్రశ్న తొలుస్తుంది. అదే ఇప్పుడు తారక్‌ని ఆయన అభిమానులను భయపెడుతుంది. అయితే ఇదే నిజమైతే కొరటాలకి డబుల్ డిజాస్టర్ బోనాంజా అంటున్నారు నెటిజన్లు. ఇప్పటికే `ఆచార్య`(Acharya)తో ఒకటి ఫేస్ చేస్తున్నారు. మళ్లీ ఎన్టీఆర్ ద్వారా మరో ఫ్లాఫ్ ఆయన మూటగట్టుకోబోతున్నారని అంటున్నారు. కానీ అలాంటిదేమీ జరగదని, ఎన్టీఆర్ 30 పక్కా బ్లాక్ బస్టర్ అని ధైర్యాన్నిస్తున్నారు ఫ్యాన్స్. చెత్త సెంటిమెంట్లని పట్టించుకోవద్దంటున్నారు.
అయితే ఎన్టీఆర్ 30(Ntr30) చిత్రాన్ని హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రంగా, చాలా బలమైన కథతో, చాలా స్పాన్ ఉన్న సినిమాగా కొరటాల ప్లాన్ చేస్తున్నారు. తన అసలైన కమర్షియలిటీని ఇందులో చూపించబోతున్నానని తెలిపారు. భారీ బడ్జెట్‌తో లార్జ్ స్కేల్‌లో పాన్ ఇండియా చిత్రంగా తీయబోతున్నారు. మరి ఈ మూవీ రాజమౌళి సెంటిమెంట్‌ని, ఆ నమ్మకాన్ని బ్రేక్ చేసి బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టిస్తుందా? జక్కన్న సెంటిమెంట్‌కి బలవుతుందా అనేది చూడాలి. `రాజమౌళి సెంటిమెంట్`ని బ్రేక్ చేయాలని, తారక్‌ని మరింత పెద్ద హీరోని చేయాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.