MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ‘దేవర’ప్రమోషన్స్ లో అల్లు అర్జున్ , ఇంకా ఆ హీరోలు కూడా?

‘దేవర’ప్రమోషన్స్ లో అల్లు అర్జున్ , ఇంకా ఆ హీరోలు కూడా?

 ట్రయిలర్ ను ముంబాయిలో మీడియా ముందు విడుదల చేసి ఒక్కసారిగా నార్త్ బెల్ట్ దృష్టి తమ సినిమాపై పడేలా చేసారు ఎన్టీఆర్ . దేవర సినిమాతో ఎన్టీఆర్ హిందీ మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నారనేది నిజం.  

2 Min read
Author : Surya Prakash
Published : Sep 11 2024, 08:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
junior ntr movie devara

junior ntr movie devara


సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామా  ‘దేవర’. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. సెప్టెంబర్‌ 27న మొదటి భాగం రానుంది. జాన్వీ కపూర్‌ ఈ మూవీతోనే తెలుగు తెరకు పరిచయమవుతుండగా, సైఫ్ అలీఖాన్‌ విలన్ గా నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దేవర’ (Devara) ప్రమోషన్స్ తో ఎన్టీఆర్‌ (NTR) ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఈ నేపధ్యంలో ఎవరితో ఇంటర్వూలు ప్లాన్ చేసారో చూద్దాం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Devara Trailer

Devara Trailer


దేవర’ (Devara)  చిత్రం ‘మంగళవారం ముంబైలో నిర్వహించిన ట్రైలర్‌ లాంచ్‌ ఘనంగా జరిగింది.  ట్రయిలర్ ను ముంబాయిలో మీడియా ముందు విడుదల చేసి ఒక్కసారిగా నార్త్ బెల్ట్ దృష్టి తమ సినిమాపై పడేలా చేసారు ఎన్టీఆర్ . దేవర సినిమాతో ఎన్టీఆర్ హిందీ మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నారనేది నిజం. అందుకోసమే మొదటి నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

జాన్వి కపూర్ ను హీరోయిన్ గా తీసుకున్నా, సైఫ్ ని విలన్ గా తీసుకున్న ఎన్టీఆర్ ఆలోచన అదే. నార్త్ లో మార్కెట్ కోసం ఎన్టీఆర్ మొదట అడుగు వేసారు. అక్కడ మీడియా కూడా బాగా కవరేజ్ ఇచ్చింది. ట్రైలర్ లాంచ్ కన్నా ముందే ఎన్టీఆర్ ముంబై వెళ్లారు ప్రమోషన్స్ కోసం. అక్కడ పేరు పొందిన మీడియా హౌస్ లతో ఇంటరాక్ట్ అయ్యారు. తమ దేవర చిత్రం రీచ్ భారీగా ఉండాలనే రీతిలో అక్కడ ప్రమోషన్స్ కు ఎన్టీఆర్ తెర తీసారు. 

36


ఈ ప్రమోషన్స్ లో భాగంగా జాహ్నవి కపూర్, సైఫ్ అలీ ఖాన్ తో కలిసి కపిల్ శర్మ పాపులర్ షో ‘The Great Indian Kapil Show’ లో పాల్గొన్నారు. త్వరలోనే ఈ ఎపిసోడ్ ఎయిర్ లోకి రానుంది.  అలాగే ప్రముఖ దర్శక,నిర్మాత కరణ్ జోహార్ తో స్పెషల్ చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ విషయం అలియా భట్ కూడా ఈ చిట్ చాట్ లో కొద్దిసేపు ఉండనుందని తెలుస్తోంది. 
 

46


అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్టీఆర్..తన వార్ 2 కోలిగ్ హృతిక్ రోషన్ తో కలిసి దేవరను హిందీ బెల్ట్ లో ప్రమోట్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే యానిమల్ దర్శకుడు సందీప్ వంగా తో కూడా ఇంటర్వూ రానుంది. వీటితో పాటు సిద్దు జొన్నలగడ్డ, అల్లు అర్జున్ కూడా దేవర ప్రమోషన్స్ లో పాల్గొన బోతున్నట్లు సమాచారం. అంటే పుష్ప వచ్చి దేవర గురించి చెప్తారన్నమాట. 

బిగ్ బాస్ హౌజ్ నుంచి రెండో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

56


 గత  కొన్ని రోజుల నుంచి ఎన్టీఆర్‌ (#NTR) పేరు వరుసగా సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ముఖ్యంగా ‘దేవర’లోని పాట విడుదలైన దగ్గర నుంచి రోజూ  ఎన్టీఆర్ పేరు టాప్‌లో కొనసాగుతూ వస్తోంది. తాజాగా ‘దేవర’ ట్రైలర్‌ రిలీజ్‌ అప్‌డేట్ షేర్ చేయటం, ఎన్టీఆర్‌ ప్రమోషన్స్‌ కోసం ముంబయి వెళ్లడం, దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాను కలవడం.. ఇలాంటి విశేషాలతో నేడు యంగ్‌ టైగర్‌ (NTR) పేరు మీద పోస్ట్‌లు తెగ షేర్‌ అవుతున్నాయి.  


 

66


అలాగే దర్శకుడు సందీప్ వంగా హీరో ఎన్టీఆర్ ను ఇంటర్వూ చేయబోతున్నారు. ఇది కచ్చితంగా వైరల్ అవుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే సందీప్ వంగా కు వున్న క్రేజ్‌ అలాంటిది.ఇంకా చెప్పాలంటే  దేవర ఒక తెలుగు సినిమా అయినా పాన్ ఇండియా  లెవెల్లో  రిలీజ్ అవుతూండటంతో ఈ ప్రమోషన్స్ తప్పవు. ఖచ్చితంగా చేయాల్సిందే.  దేవర  టాలీవుడ్ సినిమా కాబట్టి.. ఇక్కడ మనవాళ్ళందరి అటెన్షన్ ఎలాగో ఉంటుంది.  

 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
అల్లు అర్జున్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ajay Ghosh: సుకుమార్ పుణ్యమా అని అజయ్ ఘోష్ ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా? ఇద్దరు కొడుకులు ఏం చేస్తున్నారంటే?
Recommended image2
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Recommended image3
Jr NTR: గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్, డ్రాగన్ షూటింగ్‌పై కీలక అప్‌డేట్, సెట్స్‌పైకి ఎప్పుడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved