ఎన్టీఆర్ చేసే ఫైట్ కమల్ హాసన్‌తోనా?.. ప్రశాంత్ నీల్ మామూలోడు కాదు.. మాస్‌కే పూనకాలు!
లోక నాయకుడు కమల్ హాసన్‌కి సంబంధించిన పలు ఆసక్తికర వార్తలు ఇప్పుడు సౌత్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఓవైపు మహేష్ రాజమౌళి సినిమాలో అని, మరోవైపు ఎన్టీఆర్ సినిమాలోనూ నటించబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.
కమల్ హాసన్(Kamal Haasan) ప్రస్తుతం `విక్రమ్`(Vikram) చిత్రంతో రాబోతున్నారు. జూన్ 3న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ముఖ్యంగా తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. చాలా కాలం తర్వాత కమల్ చేస్తున్న కమర్షియల్ మూవీ ఇది. యాక్షన్ పప్రధానంగా సాగబోతుంది. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. `ఖైదీ`, `మాస్టర్` ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి.
ఆ తర్వాత కమల్ నటించబోయే సినిమా ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే ఆయన రెండు తెలుగు సినిమాల్లో నటించబోతున్నారనే టాక్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది. మహేష్-రాజమౌళి చిత్రంలో కీలక పాత్రలో ఆయన పేరు వినిపిస్తుంది. మరోవైపు తాజాగా మరో పాన్ ఇండియా చిత్రంలో కమల్ పేరు ప్రధానంగా చక్కర్లు కొడుతుంది. అదే ఎన్టీఆర్(NTR) సినిమాలో కమల్ హాసన్ నటించబోతున్నారట.
ఎన్టీఆర్(Jr Ntr)- ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది. `NTR31`గా ఈ సినిమా రూపొందబోతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవల ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చారు. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. బ్లాక్ టోన్‌లో `కేజీఎఫ్`, `సలార్` చిత్రాల స్టయిల్‌లో ఎన్టీఆర్ సగమే ఆగ్రవేశాలతో చూస్తున్న లుక్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. సినిమా పాన్ ఇండియాని మించి ఉండబోతుందనే సాంకేతాలనిస్తుంది యూనిట్.
NTR-Prashanth Neel Movieలో విలన్ పాత్ర కోసం కమల్ హాసన్‌ని సంప్రదిస్తున్నారట ప్రశాంత్ నీల్. `కేజీఎఫ్2`లో విలన్ పాత్ర ఎంత బలంగా ఉంటుందో చూడొచ్చు. ఎన్టీఆర్ సినిమాలో అంతకు మించిన విలనిజం ఉండబోతుందట. అలాంటి పవర్‌ఫుల్ రోల్‌లో కమల్‌ని చూపించాలని భావిస్తున్నారట ప్రశాంత్ నీల్. అయితే నటనకు స్కోప్ ఉన్న పాత్రలను, విలక్షణ పాత్రలను చేయడంలో కమల్ ముందే ఉంటారు. దీంతో ఈ సినిమాకి ఆయన ఓకే చెప్పొచ్చనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే కమల్ హాసన్ `ఈనాడు` వంటి చాలా చిత్రాల్లో విలన్‌గా చేశాడు. అంతకు ముందు కూడా రజనీకాంత్‌తోపాటు ఇతర హీరోలతోనూ కలిసి సినిమాలు చేశారు. `దశావతారం`లోనూ ఆయనే హీరో, ఆయనే విలన్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చిత్రాలున్నాయి. అయితే కమల్ హాసన్ విలన్‌గా నటించినా, మనకు మాత్రం ఆయన హీరోలాగే కనిపిస్తారు. అది ఆయన పాత్రల ప్రత్యేకత. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమాలోనూ అ తరహా పాత్రలో కమల్ కనిపించే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఒకవేళ ఎన్టీఆర్, కమల్ హాసన్ కలిసి నటిస్తే సౌత్ ఇండియన్ సినిమా షేక్ అయిపోవడం ఖాయం. అంతేకాదు ఇద్దరు అద్భుతమైన నటుల మధ్య పోటీని చూసేందుకు రెండు కళ్లు చాలవు. కళ్లతోనే నటించగల గొప్పనటులిద్దరు. ఆ నటన చూస్తే వెండితెర పులకరించిపోవడం ఖాయం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇదే జరిగితే అదొక అద్బుతం అని చెప్పడంలో, అదొక అద్భుతమైన దృశ్య కావ్యం కాబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇక పూనకాలే.
ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో `ఎన్టీఆర్30` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇటీవల చేసిన సినిమా థీమ్ వీడియో గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉంది. సినిమాపై భారీ అంచనాలను పెంచింది. అనంతరం ప్రశాంత్ నీల్ చిత్రంలో ఎన్టీఆర్ నటించబోతున్నారు. ఇది ఈ ఏడాది ఎండింగ్‌లో ప్రారంభం కాబోతుందని టాక్.