MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ‘దేవర’ చూసేవరకైనా బతికించండి ..ప్లీజ్

‘దేవర’ చూసేవరకైనా బతికించండి ..ప్లీజ్

‘దేవర’ చూసేవరకు తనను బతికించాలని ఓ క్యాన్సర్‌ పేషెంట్‌ చివరి కోరిక కోరుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కౌశిక్‌ 

2 Min read
Author : Surya Prakash
Published : Sep 12 2024, 12:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Junior NTR Devara upcoming film update out

Junior NTR Devara upcoming film update out

 ఎన్టీఆర్‌ (NTR) హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ‘దేవర’ (Devara) త్వరలో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. దేవర చిత్రం పార్ట్‌ 1 ఈ నెల 27న విడుదల కానుంది. ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన సినిమా కావడంతో ముందు నుంచీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

విజువల్స్‌ అద్భుతంగా ఉంటాయని, చివరి 40 నిమిషాలు సినిమాలో హైలైట్‌ అంటూ ముంబయిలో జరిగిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ అంచనాలు రెట్టింపు చేశారు. ఈ సినిమాతో జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌లోకి వస్తున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాపై అభిమానులు ఎంత తీవ్రమైన కోరిక పెట్టుకున్నారంటే....

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25


‘దేవర’ చూసేవరకు తనను బతికించాలని ఓ క్యాన్సర్‌ పేషెంట్‌ చివరి కోరిక కోరుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కౌశిక్‌ (19) కొంతకాలంగా బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అతడు జూనియర్ ఎన్టీఆర్‌ వీరాభిమాని కావడంతో చనిపోయేలోపు ‘దేవర’ (Devara) చూడాలని కోరుకుంటున్నట్లు అతని తల్లిదండ్రులు తెలిపారు. ఈ మేరకు తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో వారు మీడియా సమావేశం నిర్వహించారు.

35


‘నా కుమారుడికి చిన్నప్పటినుంచి జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటే చాలా ఇష్టం (NTR Fan Request). ఇప్పుడు కూడా చివరి కోరికగా ‘దేవర’ చూడాలని అడుగుతున్నాడు. సెప్టెంబర్‌ 27 వరకు తనను బతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు. అది ఒక్కటే అతని ఆఖరి కోరిక’ అంటూ కౌశిక్‌ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు.

తన కుమారుడి వైద్యానికి రూ.60లక్షలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం, దాతలు సాయం చేయాలని ఆమె కోరారు. ఈ వీడియోను  షేర్‌ చేస్తున్న తారక్‌ అభిమానులు ఆయన్ని ట్యాగ్‌ చేస్తున్నారు.
 

45


కుర్రాడి  తండ్రి శ్రీనివాసులు టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బెంగుళూరులోని కిడ్‌వై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కౌశిక్ విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

 తమ కొడుకు చివరి కోరిక తీర్చాలని తాము ప్రయత్నిస్తున్నామని.. తమకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమకు సాయం చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే స్నేహితులు, సన్నిహుతుల ద్వారా కొంత డబ్బు సమకూరినా ఇంకా డబ్బు కావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోేసం ఇక్కడ క్లిక్ చేయండి.
 

55
Devara Trailer

Devara Trailer

ఇప్పటికే దేవర చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. (Devara Movie RunTime) నిడివి: 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు. ఇటీవల బాక్సాఫీసు ముందుకొచ్చిన పలు చిత్రాల నిడివి దాదాపు 3 గంటలు ఉండటం గమనార్హం. కంటెంట్‌ బాగుంటే రన్‌టైమ్‌ ఎంతున్నా ప్రేక్షకుల ఆదరణ దక్కుతుందనే విషయాన్ని ‘కల్కి’ (180.56 నిమిషాలు), ‘సరిపోదా శనివారం’ (2: 50 గంటలు)లాంటి చిత్రాలు మరోసారి నిరూపించాయి. 

 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Shooting Deaths: షూటింగ్ స్పాట్‌లోనే ప్రాణాలు వదిలారు! కెమెరా ముందు జరిగిన 8 విషాదాలు
Recommended image2
Ajay Ghosh: సుకుమార్ పుణ్యమా అని అజయ్ ఘోష్ ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా? ఇద్దరు కొడుకులు ఏం చేస్తున్నారంటే?
Recommended image3
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved