- Home
- Entertainment
- `వార్ 2`కి నెగటివ్ టాక్.. ఆగిపోయిన ఎన్టీఆర్ కొత్త సినిమా ?, అదే దారిలో మరో మూవీ?
`వార్ 2`కి నెగటివ్ టాక్.. ఆగిపోయిన ఎన్టీఆర్ కొత్త సినిమా ?, అదే దారిలో మరో మూవీ?
ఎన్టీఆర్ నటించిన బాలీవుడ్ మూవీ `వార్ 2`కి మిశ్రమ స్పందన లభిస్తోంది. కలెక్షన్ల పరంగానూ ఇది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ ఫలితం కారణంగా తారక్ కొత్త సినిమా ఆగిపోయిందట.

`వార్ 2` మూవీకి మిశ్రమ స్పందన
ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి `వార్ 2` చిత్రంలో నటించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి వచ్చిన స్పై యాక్షన్ మూవీ ఇది. హృతిక్ రోషన్ మరో హీరోగా నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ బాలీవుడ్ మూవీ ఈ గురువారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే మిశ్రమ స్పందన రాబట్టుకుంది. బాలీవుడ్ స్పై మూవీస్ నార్త్ ఆడియెన్స్ ని బాగానే ఆకట్టుకుంటాయి. కానీ ఈ చిత్రానికి నార్త్ ఆడియెన్స్ నుంచి కూడా నెగటివ్ టాక్ రావడం గమనార్హం.
KNOW
`వార్ 2` రెండు రోజుల కలెక్షన్లు
ఇక ఎన్టీఆర్ ఉండటంతో తెలుగులో ఓపెనింగ్స్ భారీగానే రాబట్టింది. `వార్ 2` మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.80కోట్లు రాబట్టింది. రెండో రోజు కూడా సుమారు రూ.80కోట్లు వసూళు చేసినట్టు సమాచారం. హిందీలో రూ.75కోట్లు, తెలుగులో రూ.40కోట్లు రాబట్టిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే రెండో రోజు కూడా ఈ రేంజ్‌లో కలెక్షన్లు ఉన్నాయంటే మామూలు విషయం కాదు. కానీ మూడు, నాలుగో రోజు వసూళ్లు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ వీకెండ్ వరకు ఉన్నంతలో బెటర్‌గానే కలెక్షన్లు ఉంటాయి. కానీ ఓవరాల్‌గా ఈ మూవీ పరిస్థితి ఏంటనేది క్లారిటీ రావాల్సి ఉంది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రం హిట్ ఖాతాలో పడటం డౌటే అని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా హిట్ కావాలంటే సుమారు రూ.700కోట్ల గ్రాస్ రావాలి.
ఎన్టీఆర్ చేయాల్సిన సినిమాలు
`వార్ 2` చిత్రానికి మేజర్‌గా నెగటివ్ టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ ఫ్యాన్సే డిజప్పాయింట్ అయినట్టుగా తెలుస్తోంది. చాలా మంది ఓపెన్‌గానే పెదవి విరుస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఎన్టీఆర్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తన కొత్త సినిమాని పక్కన పెట్టారట. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. దీనికి `డ్రాగన్` అనే పేరు వినిపిస్తోంది. ఆ తర్వాత `దేవర 2` చేయాల్సి ఉంది. మరోవైపు ఇటీవలే హిందీలోనే యష్ రాజ్ ఫిల్మ్స్ లో మరో స్పై మూవీ చేయబోతున్నట్టు హింట్ ఇచ్చాడు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది తారక్.
`దేవర 2` ఆగిపోయిందా?
ఈ క్రమంలో ఇప్పుడు `దేవర 2` మూవీని పక్కన పెట్టారట ఎన్టీఆర్. `దేవర` సినిమాకే అప్పుడు మిశ్రమ స్పందన లభించింది. ఇది నార్త్ లోనే బాగా ఆడింది. దీంతో హిట్ ఖాతాలో పడింది. కానీ `వార్ 2` రిజల్ట్ చూశాక ఎన్టీఆర్ `దేవర 2` వద్దు అనుకున్నారట. దర్శకుడు కొరటాలతో ఈ మూవీకి సంబంధించిన చర్చలు కూడా జరిగాయని, ప్రాజెక్ట్ ని క్యాన్సల్ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అదే సమయంలో యష్ రాజ్ ఫిల్మ్స్ లో మరో స్పై యాక్షన్ మూవీ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని కూడా పక్కన పెట్టినట్టు సమాచారం. మొత్తంగా `వార్ 2` రిజల్ట్ రెండు సినిమాలను ప్రశ్నార్థకంగా మార్చేసిందని చెప్పొచ్చు.
`డ్రాగన్` తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా
ఇక ప్రస్తుతం తారక్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న `డ్రాగన్` మూవీ చిత్రీకరణ దశలో ఉంది. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ బెంగాల్ బ్యాక్ డ్రాప్‌లో మాఫియా నేపథ్యంలో సాగుతుందని, ఇందులో తారక్ గ్యాంగ్ స్టర్‌గా కనిపిస్తారని సమాచారం. అనంతరం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో ఎన్టీఆర్ నటించనున్నారు. ఇది మైథలాజికల్ కథాంశంతో రూపొందుతుందని టాక్.

