- Home
- Entertainment
- 'కూలీ' మూవీ 2 రోజుల కలెక్షన్లు.. రజినీకాంత్ సినిమాకి రెండో రోజు వసూళ్లు పెరిగాయా? తగ్గాయా?
'కూలీ' మూవీ 2 రోజుల కలెక్షన్లు.. రజినీకాంత్ సినిమాకి రెండో రోజు వసూళ్లు పెరిగాయా? తగ్గాయా?
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

భారీ కాస్టింగ్‌తో రూపొందిన `కూలీ`
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన సినిమా `కూలీ`. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఇందులో రజినీకాంత్ తోపాటు సత్యరాజ్, శృతిహాసన్, ఉపేంద్ర, నాగార్జున, సౌబిన్ షాహిర్ వంటి నటీనటులు నటించారు. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూడా ఈ సినిమాలో అతిధి పాత్రలో నటించారు. `కూలీ` చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ఇది ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది.
KNOW
`కూలీ`ని దెబ్బకొట్టిన ఓవర్ హైప్
ఓవర్ హైప్ తో విడుదలైన `కూలీ` సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోలేకపోయింది. ఓ రకంగా ఈ ఓవర్ హైపే సినిమాని ముంచిందని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఓటమి ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్ కనకరాజ్ కి మొదటి ఫ్లాప్ సినిమాగా `కూలీ` నిలిచిందని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా కథలో చాలా లాజిక్ లేకపోవడంతో నెగటివ్ టాక్ వస్తోంది. సాధారణంగా రజినీ సినిమా అంటే కుటుంబ ప్రేక్షకులు ఇష్టంగా చూస్తారు. కానీ ఈ సినిమాకు 'ఎ' సర్టిఫికెట్ ఇవ్వడంతో కుటుంబ ప్రేక్షకులు పిల్లలతో చూడలేకపోతున్నారు.
`కూలీ` మొదటి రోజు కలెక్షన్లు.. `లియో` రికార్డ్ బ్రేక్
` కూలీ` సినిమా ముందస్తు బుకింగ్స్ తోనే మొదటి రోజు భారీ వసూళ్లు సాధిస్తుందని అంచనా వేశారు. అనుకున్నట్టుగానే మొదటి రోజు రూ.151 కోట్లు వసూలు చేసిందని సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా `కూలీ` నిలిచింది. విజయ్ నటించిన `లియో` సినిమా రూ.148 కోట్లు వసూలు చేసింది. ఈ రెండు సినిమాలను లోకేష్ కనకరాజే దర్శకత్వం వహించడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ సినిమా రెండో రోజు కలెక్షన్ల డిటెయిల్స్ వచ్చాయి.
`కూలీ` రెండో రోజు కలెక్షన్లు
`కూలీ` సినిమా రెండో రోజు వసూళ్లలో భారీగా వెనుకబడిపోయింది. మొదటి రోజు రూ.151 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు కేవలం రూ.80 కోట్లు మాత్రమే వసూలు చేసింది. నిన్న స్వాతంత్య్ర దినోత్సవం సెలవు దినం అయినప్పటికీ ఈ సినిమా వసూళ్లలో వెనుకబడిపోయింది. ఇందులో భారతదేశంలో మాత్రమే రూ.53 కోట్లు వసూలు చేసిందట. మొదటి రోజు భారతదేశంలో రూ.65 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రెండు రోజుల్లో భారతదేశంలో మాత్రమే రూ.118 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.230 కోట్లు వసూలు చేసిందని చెబుతున్నారు. ఈ రోజు(శనివారం), రేపు(ఆదివారం) కూడా సెలవు దినాలు అయినప్పటికీ ఈ సినిమా వసూళ్లు ఇంకా తగ్గే అవకాశం ఉందని సమాచారం. ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
వెయ్యి కోట్లు కోలీవుడ్ కి కలేనా?
`కూలీ` సినిమాని దెబ్బకొట్టిన వాటిలో ఓవర్ హైప్ ప్రధాన భూమిక పోషిస్తుంది. అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేకపోవడంతో ఫ్యాన్స్ తోపాటు జనరల్ ఆడియెన్స్ కూడా డిజప్పాయింట్ అవుతున్నారు. ఇంకోవైపు కథలో బలం లేదు. దర్శకుడు లోకేష్ చెప్పింది ఒకటి, తెరపై తెరకెక్కించింది మరోటి అన్నట్టుగా మారింది. దీనికితోడు స్లోగా కథనం సాగడం, ఎంతసేపు అక్కడక్కడే తిరిగినట్టుగా ఉండటం, కథకు సంబంధం లేని పాత్రలు రావడం, హడావుడి చేయడం వంటివి నెగటివ్‌గా చెప్పొచ్చు. అదే సమయంలో భారీగా స్టార్ కాస్ట్ ఉన్నా వారిని సరిగా వాడుకోలేకపోయారు. కంటెంట్‌లో స్టఫ్ లేకపోవడంతో స్టార్ వ్యాల్యూ కూడా తేలిపోయిందని చెప్పొచ్చు. ఈ వీకెండ్ వరకు మూవీ బాగానే వసూళు చేసే అవకాశం ఉంది. కానీ ఆ తర్వాత కలెక్షన్లని బట్టి మూవీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. క్రిటిక్స్, ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు `కూలీ` వెయ్యి కోట్లు వసూలు చేస్తుందా అనేది సస్పెన్స్ గా మారింది.