MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ స్టార్‌ హీరోయిన్‌ అంటే జూ. ఎన్టీఆర్‌కి పిచ్చ క్రష్‌.. పాపం ఆ డ్రీమ్‌ నెరవేరకుండానే.. కానీ కూతురితో మాత్రం

ఆ స్టార్‌ హీరోయిన్‌ అంటే జూ. ఎన్టీఆర్‌కి పిచ్చ క్రష్‌.. పాపం ఆ డ్రీమ్‌ నెరవేరకుండానే.. కానీ కూతురితో మాత్రం

జూ ఎన్టీఆర్‌ తనకు ఓ తీరని కోరిక ఉండిపోయింది. ఓ సీనియర్‌ హీరోయిన్‌పై ఆయన క్రష్‌ ఏర్పర్చుకున్నాడు. ఆ డ్రీమ్ విషయాలను బయటపెట్టారు తారక్‌.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : May 21 2024, 07:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

జూ ఎన్టీఆర్‌ సోమవారం తన పుట్టిన రోజుని సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఆయన ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో వెకేషన్‌లో సెలబ్రేట్‌ చేసుకున్నారు. అయితే ఈ సందర్బంగా తారక్‌కి సంబంధించిన చాలా అరుదైన విషయాలు, ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. అందులో యంగ్‌ టైగర్‌ ఫేవరేట్‌ హీరోయిన్‌ ఎవరో తెలిసిపోయింది. 

26

ఎన్టీఆర్‌ తనతో పనిచేసిన హీరోయిన్లలో ఒకరిని బాగా ప్రేమించాడు తారక్‌. అది బ్రేక్‌ అయ్యింది. కానీ వీరందరు కాదు, ఓ హీరోయిన్‌ అంటే ఆయనకు క్రష్‌ అట. ఆమె సీనియర్‌ హీరోయిన్‌ కావడం విశేషం. ఆ సీనియర్‌ హీరోయిన్‌పై తనకు బాగా క్రష్‌ అని చెప్పాడు. ఆమెతో కలిసి సినిమా చేయాలని, వయసులో పెద్దది కావడంతో తాత పాత్రలో అయినా ఆమెకి జోడీగా చేయాలని డ్రీమ్‌ అని చెప్పాడు. 

36

కొన్నేళ్ల క్రితం ఎన్టీఆర్‌.. జయప్రద నిర్వహించిన టాక్‌ షోకి వెళ్లాడు. ఇందులో అనేక విషయాలు చెప్పిన ఆయన మీరు నటించిన సినిమాల్లోని హీరోయిన్లలో మీకి ఇష్టమైన, ఫేవరేట్‌ హీరోయిన్‌ ఎవరు అని ఆమె అడగ్గా.. తనతో నటించిన హీరోయిన్లు కాదుగానీ, శ్రీదేవి అంటే తనకు పిచ్చి అని చెప్పాడు. బాగా క్రష్‌, అది ఎంత అంటే కుదిరితే, ఎప్పటికైనా ఆమెతో కలిసి సినిమా చేయాలని ఉందన్నాడు. 
 

46

అయితే శ్రీదేవి.. ఎన్టీఆర్‌ తాత రామారావుకి జోడీగా చేసింది. అంటే తారక్‌ తాత పాత్ర వేస్తేగానీ ఆమెతో జోడీ కట్టలేదు. దీంతో తాత పాత్రలు వేయడానికైనా రెడీ కానీ ఆమెకి జోడీగా చేయాలని ఉందన్నారు. ఈ ఇంటర్వ్యూ జరిగే నాటికి అతిలోక సుందరి శ్రీదేవి బతికే ఉంది. దీంతో ఈ ఇంటర్వ్యూ ఆమె చూడాలి, తన కోరిక నెరవేర్చాలని కోరుకుంటున్నట్టు తారక్‌ తెలిపారు. కానీ అది జరగలేదు. 
 

56
NTR

NTR

ఆరేళ్ల క్రితం శ్రీదేవి దుబాయ్‌లో ఓ స్టార్‌ హోటల్లో బాత్‌రూమ్‌లో జారి పడి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె ఆ అందమైన రూపం నుంచి ఈ లోకాలు విడిచి వెళ్లింది. ఆడియెన్స్ హృదయాల్లో అతిలోక సుందరిగానే నిలిచిపోయింది. ఇలా జూ ఎన్టీఆర్‌కి శ్రీదేవితో కలిసి నటించే అవకాశం రాలేదు, ఆయన డ్రీమ్‌ అలానే ఉండిపోయింది. కానీ మరో రూపంలో అది తీరే అవకాశం ఉంది. 
 

66

ప్రస్తుతం ఎన్టీఆర్‌ `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా చేస్తుంది. సో ఇలా అమ్మ శ్రీదేవితో ఛాన్స్ లేదు, దీంతో ఆమె కూతురు జాన్వీతో నటిస్తున్న నేపథ్యంలో తారక్‌ కోరిక `దేవర` రూపంలో ఎంతో కొంత తీరుతుందని చెప్పొచ్చు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ దసరాకి విడుదల కానుంది. ఇటీవల ఫియర్‌ సాంగ్‌ విడుదలై మెప్పించింది. ప్రస్తుతం తారక్‌ హిందీలోకి ఎంట్రీ ఇస్తూ `వార్‌ 2`లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
జాన్వీ కపూర్
Latest Videos
Recommended Stories
Recommended image1
Rithu Chowdary: అంతా నా కర్మ, మోసం చేసి మరో అమ్మాయితో వెళ్ళిపోయాడు.. కెరీర్ కోసమే నవ్వుతూ బతుకుతున్నా
Recommended image2
Parthiban Controversy:చిక్కుల్లో పడ్డ ఉస్తాద్ విలన్.. పవన్ కళ్యాణ్ ముందే అలాంటి వ్యాఖ్యలు, వైరల్
Recommended image3
సూపర్ హిట్ కావాల్సిన ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలు అట్టర్ ఫ్లాప్..కృష్ణంరాజు సెంటిమెంట్ వల్లే కొంప మునిగిందా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved