రాజమౌళి విషయంలో మాట మార్చిన ఎన్టీఆర్.. అప్పుడలా, ఇప్పుడిలా? కారణం ఏంటంటే?
ఎన్టీఆర్.. కూడా రాజమౌళిపై ఒకప్పుడు సంచలన కామెంట్స్ చేశాడు. కానీ ఇప్పుడు మాట మార్చాడు. అప్పుడలా, ఇప్పుడిలా.. కారణం ఏంటంటే?
ఎన్టీఆర్ ప్రస్తుతం `దేవర` సినిమాతో సందడి చేస్తున్నాడు. ఈ మూవీ థియేటర్లలో రచ్చ చేస్తుంది. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ మూవీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. `ఆర్‌ఆర్‌ఆర్` తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తోన్న సినిమా రావడంతో ఆ మూవీ క్రియేట్ చేసిన మార్కెట్ ఇప్పుడు `దేవర`కి కలిసి వస్తుంది. సినిమా హిట్ నుంచి సూపర్‌హిట్ దిశగా వెళ్తుంది. `దేవర` తొమ్మిది రోజుల్లో భారీగానే వసూలు చేసింది. నాలుగు వందల కోట్ల కలెక్షన్ల దిశగా వెళ్తుంది.
బిగ్ బాస్ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
మొత్తంగా ఎన్టీఆర్‌కి హిట్ పడిందనే చెప్పాలి. రాజమౌళితో ఆయన `ఆర్‌ఆర్‌ఆర్` సినిమా చేశారు. అది విశేష ఆదరణ పొందింది. ఆ తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా కావడంతో ఇది డిజాస్టర్ అవుతుందని, ఆడియెన్స్ ని ఆకట్టుకోవడం కష్టమనే వార్తలు వచ్చాయి. రాజమౌళి సెంటిమెంట్‌ని తెరపైకి తీసుకొచ్చారు.
చాలా వరకు ఈ సినిమా ఫ్లాపే అనే కామెంట్లు చేశారు. కానీ సినిమా అనూహ్యంగా పుంజుకుంది. మొదటి రోజు డివైడ్ టాక్ ఉన్నా, నెమ్మదిగా పుంజుకుంటుంది. సౌత్‌లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. కానీ నార్త్ లో నెమ్మదిగా సత్తా చాటుతుంది. ఓవర్సీస్‌లోనూ దుమ్మురేపుతుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కి మరో హిట్ పడిందనే దాంట్లోకి వచ్చేశారు సినీ వర్గాలు. టీమ్ సైతం సక్సెస్ మీట్‌ని కూడా పెట్టింది. ప్రమోషన్స్ కూడా మళ్ళీ షురూ చేశారు.
ఈ నేపథ్యంలో సినిమా హిట్‌పై ఎన్టీఆర్ స్పందించారు. అదే సమయంలో రాజమౌళి సెంటిమెంట్‌పై కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఫ్లాప్‌లు వస్తాయని, ఆయనతో చేసిన ప్రతి హీరో విషయంలోనూ ఇదే జరిగిందనే కామెంట్ ఉన్న విషయం తెలిసిందే. ఇదొక పెద్ద సెంటిమెంట్‌గానూ ప్రచారం జరగుతుంది. వాళ్లు కూడా దీన్ని ఒప్పుకునే పరిస్థితికి వచ్చింది. ఈ నిందని రాజమౌళి సైలెంట్‌గా మోస్తూనే ఉన్నాడు. తారక్ సైతం గతంలోనూ ఇలాంటి కామెంట్లు చేశాడు.
`సింహాద్రి` సినిమా తర్వాత తను వరుసగా పరాజయాలు చవిచూశాడు. దీంతో ఆ సినిమా తన కెరీర్‌కి ఎంత హెల్ప్అయ్యిందో, హీరోగా మరో స్థాయికి వెళ్లడానికి ఎంతగా దోహదపడిందో, అంతే స్థాయిలో కిందకి పడేసిందని ఎన్టీఆర్ తన పాత ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పటికీ అది నడుస్తూనే ఉంది. వైరల్ అవుతూనే ఉంది. తారక్ చెప్పినట్టుగానే రాజమౌళి తో సినిమాలు చేసిన హీరోలు ఆ తర్వాత మూవీస్‌తో ఫ్లాప్‌లు మూటగట్టుకున్నారు. దీంతో అంతా ఈ విషయాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా దీనిపై స్పందించారు తారక్. `దేవర` సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కాకపోతే రాజమౌళి సెంటిమెంట్‌ని ఆయన కొట్టిపడేశాడు. ఆ సెంటిమెంట్‌ని బ్రేక్ చేశామని చెబుతున్నాడు. `మనం కరెక్ట్ గా సినిమాలు చేసుకోలేక, పాపం రాజమౌళి హిట్ ఇచ్చాడు, కాబట్టి పోయిందని, రాజమౌళి మీద తోసేశాం కానీ, మనకి చేత కాక క్రియేట్ చేసుకున్న మిత్(నింద) అది. మిత్ అంటే రియాలిటీ లేనట్టే కదా. కానీ బాగుంది.
`మిత్ బ్రేక్` అనేది కొంచెం బాగుంది. అది నిజం కాకపోయినా` అని వెల్లడించారు తారక్. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. యాంకర్ సుమతో చేసిన చిట్ చాట్‌లో ఈ విషయం చెప్పారు తారక్. దీనిపై కూడా ట్రోల్ నడుస్తుంది. అప్పుడు చెప్పింది మీరే, ఆ మిత్‌కి బలాన్ని ఇచ్చేలా మాట్లాడింది మీరే, ఇప్పుడు హిట్ రావడంతో మాట మార్చేశారా? అని ప్రశ్నిస్తున్నారు. తారక్‌ని నెట్టింట ఆడుకుంటున్నారు. దీంతో ఇది కొత్తగా రచ్చ లేపుతుంది.
`దేవర` సినిమాకి ప్రారంభంలో నెగటివ్ టాకే వచ్చింది. సినిమా కష్టమనే మాటలే వినిపించాయి. కానీ అనూహ్యంగా సినిమా పుంజుకుంది. ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. దసరా సెలవులు సినిమాకి కలిసొస్తుంది. పోటీగా పెద్ద సినిమాలు కూడా లేకపోవడంతో `దేవర` మంచి కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. ఇది మున్ముందు నాలుగు వందల కోట్లు దాటి, ఐదు వందల కోట్ల దిశగా వెళ్లే అవకాశం కూడా ఉంది.
మరి ఇది ఎంత వరకు వెళ్తుందో చూడాలి. ఇక కొరటాల శివ దర్శకత్వం వహించిన `దేవర` సినిమాలో తారక్ ద్విపాత్రాభినయం చేశారు. జాన్వీ కపూర్, శృతి మరాఠే ఆయనకు జోడీగా నటించారు. సైఫ్ అలీ ఖాన్ నెగటివ్ రోల్ చేశారు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, గెటప్ శ్రీను ముఖ్య పాత్రల్లో మెరిశారు. కళ్యాణ్ రామ్, సుధాకర మిక్కిలినేని, హరికృష్ణ నిర్మాతలు. సెప్టెంబర్ 7న ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే.