ఎన్టీఆర్, ఏఎన్నార్ తో నటించిన హీరోయిన్స్ కి కూడా క్యాస్టింగ్ కౌచ్ తప్పులేదా, స్టార్ హీరోయిన్ బయటపెట్టిన నిజాలు
క్యాస్టింగ్ కౌచ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతిపెద్ద సమస్యగా ఉంది. లైంగిక వాంఛలు తీరిస్తేనే సినిమా ఆఫర్ అనే పద్ధతి కొనసాగుతోంది. మరి ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో కూడా ఈ కమిట్మెంట్ కల్చర్ ఉందా?
సినిమా ఆఫర్ కావాలంటే బెడ్ షేర్ చేసుకోవాల్సిందే. మాకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని పలువురు హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ ఓపెన్ గానే చెప్పారు. హీరోయిన్ గా ఒక స్థాయికి వెళ్లే వరకు ఈ వేధింపుల తీవ్రత మరింతగా ఉంటుంది. అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే అమ్మాయిలంటే అందరికీ చులకనే.
దశాబ్దాలుగా ప్రతి సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. క్యాస్టింగ్ కౌచ్ కి వ్యతిరేకంగా హాలీవుడ్ లో మొదలైన మీటూ ఉద్యమం సంచలనం రేపింది. అమెరికన్ హీరోయిన్స్, ఆర్టిస్ట్స్ తమకు ఎదురైన లైంగిక వేధింపులు బయటపెట్టారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన ప్రముఖులు జైలు పాలయ్యారు.
ఇండియాలో తనుశ్రీ దత్తా, శ్రీరెడ్డి, చిన్మయి శ్రీపాదతో పాటు మరికొందరు క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. ఇటీవల కేరళ చిత్ర పరిశ్రమను జస్టిస్ హేమ రిపోర్ట్ కుదిపేసింది. మాలీవుడ్ లో జరుగుతున్న లైంగిక వేధింపులపై సదరు కమిటీ అధ్యయనం చేసింది. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీ దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించింది. దేశంలో మరే చిత్ర పరిశ్రమలో లేని విధంగా మహిళలు లైంగిక వేధింపులకు గురి అవుతున్నారని ఆ కమిటీ తేల్చింది.
Ntr-Anr
కాగా ఎన్టీఆర్, ఏఎన్నార్ ల కాలంలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందా? అవకాశాల కోసం హీరోయిన్స్ కమిట్మెంట్స్ ఇచ్చేవారా?... ఈ ప్రశ్నలకు ఆ తరం హీరోయిన్ షావుకారు జానకి సమాధానం ఇచ్చారు. అప్పటి పరిస్థితులపై స్పష్టత ఇచ్చారు. ఆ రోజుల్లో క్యాస్టింగ్ కౌచ్ లేదని ఆమె కుండబద్దలు కొట్టారు.
sowcar janaki
సినిమా వాళ్లు అంటే అప్పట్లో జనాలు వెలివేసేవారు. అయితే ఇండస్ట్రీలో చాలా రెస్పెక్ట్ ఉండేది. హీరోయిన్స్ ని అందరూ గౌరవించేవారు. మనం ఒక జాబ్ చేసి సాయంత్రం ఇంటికి వెళుతున్నాం అన్నట్లే ఉండేది. విశ్వనాథ్ గారు, బిఎన్ రెడ్డి గారు క్యాస్టింగ్ కౌచ్ తో హీరోయిన్స్ ని ఎంపిక చేసినట్లు ఏమైనా సమాచారం ఉందా?
sowcar janaki
క్యాస్టింగ్ కౌచ్ మా తరంలో లేదు. దర్శకుడు, నిర్మాత కలిసి మాట్లాడుకునేవారు. వారు సినిమాకు తగిన నటులను ఎంపిక చేసుకునేవారు. ప్రస్తుతం సినిమా పరిశ్రమ ఎలా ఉందో నాకు తెలియదు. నేను పెద్దగా టచ్ లో లేను. అయితే ఈ కల్చర్ బాగా పెరిగిపోయిందని మాత్రం అర్థం అవుతుంది.. అన్నారు.
చిరంజీవి, బాలయ్యల జనరేషన్లో ఉందని మాత్రం తెలుస్తుంది. ఈ హీరోలకు తల్లి పాత్రలు చేసిన అన్నపూర్ణ ఓ సందర్భంలో క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడారు. అవుట్ డోర్ షూటింగ్ కి వెళితే అర్ధరాత్రి గది తలుపులు తట్టేవారు. ఎయిడ్స్ రోగం రావడం మంచిది అయ్యింది. తెలియని వారితో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి భయపడి కొందరు ఈ వేధింపులు తగ్గించారు.
నేను వయసులోనే తల్లి పాత్రలు చేయడం మొదలుపెట్టాను. పెళ్లి చేసుకున్నాను. దాని వలన వేధింపులు తగ్గాయని ఆమె వెల్లడించారు.