- Home
- Entertainment
- నందమూరి హరికృష్ణ తీరని కోరిక అదేనా.. ఫ్యాన్స్ లో సజీవంగా ఉన్న ఆశ, కనీసం ఎన్టీఆర్ అయినా..
నందమూరి హరికృష్ణ తీరని కోరిక అదేనా.. ఫ్యాన్స్ లో సజీవంగా ఉన్న ఆశ, కనీసం ఎన్టీఆర్ అయినా..
ఎన్టీఆర్ వారసుడిగా అటు రాజకీయాల్లో, సినిమాల్లో హరికృష్ణ తనదైన ముద్ర వేశారు. 2018 ఆగష్టు 29న హరికృష్ణ కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ వారసుడిగా అటు రాజకీయాల్లో, సినిమాల్లో హరికృష్ణ తనదైన ముద్ర వేశారు. 2018 ఆగష్టు 29న హరికృష్ణ కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ముక్కుసూటిగా వ్యవహరించే హరికృష్ణ మనసు చాలా మంచిది అని సన్నహితులు చెబుతుంటారు. సెప్టెంబర్ 2న హరికృష్ణ 66వ జయంతి వేడుకలు జరిగాయి.
ఈ సందర్భంగా మరోసారి నందమూరి ఫ్యామిలీ, అభిమానులు హరికృష్ణని గుర్తు చేసుకున్నారు. హరికృష్ణ పాత జ్ఞాపకాలని నెమరు వేసుకున్నారు. హరికృష్ణ తన కుమారుల విషయంలో తీరని కోరికతోనే మరణించారని చెబుతుంటారు. హరికృష్ణకి ముగ్గురు కుమారులు సంతానం. జానకి రామ్, కళ్యాణ్ రామ్ మొదటి భార్య సంతానం కాగా.. ఎన్టీఆర్ రెండవ భార్య షాలినికి జన్మించాడు. జానకిరామ్ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారు.
గతంలో ఎన్టీఆర్ కి నందమూరి ఫ్యామిలీతో కాస్త అనుబంధం తక్కువే అని చెప్పాలి. కానీ ఇప్పుడు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. తన సోదరుడి సినిమాలని తారక్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇటీవల విడుదలైన బింబిసార చిత్రమే అందుకు ఉదాహరణ.
ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ కలసి ఒక చిత్రంలో నటించాలని, ఆ మూవీలో తాను కూడా ఉండాలని హరికృష్ణ కోరుకునేవారట. కానీ ఆ కోరిక తీరకుండానే హరికృష్ణ మరణించారు. కానీ హరికృష్ణ తీరని కోరికపై అభిమానుల్లో ఇంకా అసలు సజీవంగానే ఉన్నాయి. కనీసం ఎన్టీఆర్ అయినా పూనుకుని తన సోదరుడితో కలసి నటించాలని కోరుకుంటున్నారు.
కానీ ఆ సుముహూర్తం ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పలేం. ఇటీవలే కళ్యాణ్ రామ్ బింబిసార చిత్రంతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. వరుస ఫ్లాపులకు బింబిసార చిత్రం చెక్ పెట్టింది. ఇక ఎన్టీఆర్ కొరటాల శివ చిత్రంలో నటించాల్సి ఉంది. ఆ తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక చిత్రానికి కమిటై ఉన్నాడు.
వీలైనంత త్వరగా నందమూరి సోదరులు ఇద్దరూ ఒక చిత్రంలో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఫోకస్ మొత్తం బింబిసార 2 పైనే ఉంది.