MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `అల్లూరి సీతారామరాజు` సినిమా చేయోద్దంటూ కృష్ణతో ఎన్టీఆర్‌ గొడవ.. పోటీగా చేసేందుకు ప్లాన్‌.. చివరికి ఏమైందంటే?

`అల్లూరి సీతారామరాజు` సినిమా చేయోద్దంటూ కృష్ణతో ఎన్టీఆర్‌ గొడవ.. పోటీగా చేసేందుకు ప్లాన్‌.. చివరికి ఏమైందంటే?

`అల్లూరి సీతారామరాజు` సినిమా విషయంలో ఎన్టీఆర్‌, కృష్ణకి మధ్య విభేదాలు. పోటీగా మూవీ చేసేందుకు రంగంలోకి దిగిన రామారావు. చివరికి ఏం జరిగిందంటే? 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 19 2024, 06:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సూపర్‌స్టార్ కృష్ణ నటించిన చిత్రాల్లో `అల్లూరి సీతారామరాజు` టాప్‌లో ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్‌ చిత్రాల్లో అది ఒకటి. స్వాతంత్ర్య సమరయోధుడు, మన్నెం దొర అల్లూరి సీతారామరాజు ఎవరు అంటూ కృష్ణనే గుర్తొచ్చేంతగా ఆ సినిమాలో, సీతారామరాజు పాత్రలో నటించి రక్తికట్టించాడు కృష్ణ. ఆ పాత్రలో ఆయనలా మరెవ్వరూ నటించలేరు అనేంతగా చేసి మెప్పించాడు. సినిమా చరిత్రలో నిలిచిపోయారు. 
 

27

ఈ సినిమా చేసే సమయంలో ఎన్టీ రామారావుకి కృష్ణకి మధ్య గొడవ జరిగిందట. ఆ విషయాన్ని బయటపెట్టాడు సూపర్‌ స్టార్‌ కృష్ణ. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం తెలిపారు. మొదట ఈ సినిమా తాను చేస్తున్నానని తెలియగానే రామారావు వద్దు అని చెప్పారట. ఆ సినిమా నువ్వు చేయోద్దు అన్నాడట. అంతేకాదు తాను చేశాక పోటీగా అదే సబ్జెక్ట్ ని తాను చేయాలని పదేళ్లపాటు తిరిగాడట ఎన్టీఆర్‌. మరి ఇంతకి ఏం జరిగింది, ఎన్టీఆర్‌ ఎందుకు వద్దన్నారనేది చూస్తే. 
 

37

అల్లూరి సీతారామరాజు సబ్జెక్ట్ తో దర్శక, నిర్మాతలు కృష్ణ వద్దకు వచ్చారు. స్క్రిప్ట్ బాగా వచ్చింది. సినిమా చేయడానికి చర్చలు నడుస్తున్నాయి.ఈ విషయం ఎన్టీఆర్‌కి తెలిసింది. దీంతో కృష్ణతో మాట్లాడుతూ ఈ సినిమా చేయోద్దు బ్రదర్‌ అన్నాడట. మీరు చేస్తానంటే నేను చేయను, మీరు చేయండి అని ఎన్టీఆర్‌కి చెప్పాడట కృష్ణ.

47

నేను చేయను, మీరు చేయోద్దు, ఇది చాలా డ్రై సబ్జెక్ట్, సినిమా ఆడదు, జనాలు చూడరు అని చెప్పారట. దానికి సరే అండి మా డైరెక్టర్‌, ప్రొడ్యూసర్లతో చెబుతానని చెప్పాడట. వీళ్లేమో స్క్రిప్ట్ బాగా వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లోనూ చేసి తీరాల్సిందే అన్నారట. దీంతో బలవంతంగానే `అల్లూరి సీతారామరాజు` చేయక తప్పలేదు కృష్ణ. 

57

ఆ సినిమా విడుదలైంది. ప్రారంభంలో యావరేజ్‌గానే ఆడినా, ఆ తర్వాత పుంజుకుందట. సంచలన విజయం సాధించిందట. దీంతో ఎన్టీఆర్‌కి, కృష్ణకి మధ్య మాటల్లేవు. చాలా కాలంపాటు మాట్లాడుకోలేదట. ఈ సినిమా హిట్‌ అయ్యిందని తెలిసి ఎన్టీఆర్‌.. తాను కూడా `అల్లూరి సీతారామరాజు` చేయాలని పదేళ్లపాటు తిరిగాడట. రైటర్స్ ని పిలిపించి మంచి కథ రెడీ చేయండి, తానే డైరెక్ట్ చేస్తానని చెప్పాడట. అయినా స్క్రిప్ట్ రాలేదు. 
 

67

ఆ సమయంలోనే పరుచూరి బ్రదర్స్ బాగా పేరుతెచ్చుకున్నారు. రైటర్స్ గా మంచి ఫామ్‌లోకి వచ్చారు. ఇండస్ట్రీలో వీరి పేరు బాగా వినిపిస్తుంది. దీంతో వారిని పిలిపించి ఎన్టీఆర్‌.. అల్లూరి సీతారామరాజు స్టోరీ రెడీ చేయమన్నారు. దీనికి వాళ్లు `మీరు ఏమనుకోకపోతే ఓ విషయం చెబుతాము.. ఒకసారి మీరు కృష్ణ గారు చేసిన `అల్లూరి సీతారామరాజు` చూడండి.ఆ సినిమా చూశాక సినిమా చేయాలనిపిస్తే మేం రాస్తాము` అన్నారట. ఆ సమయంలో ఓ రోజు షూటింగ్‌ సమయంలో ఇద్దరు తారస పడ్డారు. ఆ సమయంలో `ఏం బ్రదర్‌.. మీ అల్లూరి సీతారామరాజు సినిమా చూడాలి, నాకు మీరు పక్కన ఉండి చూపించాలి అన్నాడట ఎన్టీఆర్‌. 

77

దీంతో చెన్నైలో సినిమా ప్రింట్లు తెప్పించి మద్రాస్‌లో ఉన్న తమ విజయకృష్ణ థియేటర్లో ప్రదర్శించారట. సగం సినిమా అయ్యాక మూవీ బాగా చేశారని మెచ్చుకున్నారట. సినిమా మొత్తం చూశాక.. ఇంతకంటే ఎవరూ ఏమీ చేయలేరు ఈ సినిమా. చాలా బాగా చేశారు. ఇక ఈ సినిమాని మేం తీయాల్సిన పనిలేదు అని చెప్పి కౌగిలించుకున్నారట. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన గ్యాప్‌ కి పుల్ స్టాప్ పడిందట. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక కంటే ముందు కలసి నటించి పెళ్లి చేసుకున్న 6 జంటలు వీళ్ళే.. క్రేజీ ఫోటోస్
Recommended image2
Beach Club: ముంబైలో శిల్పా శెట్టి ఫస్ట్ బీచ్ క్లబ్.. 6 అద్భుతమైన ఫోటోలు
Recommended image3
వెంకటేష్ తో చేతులు కలిపిన నందమూరి హీరో.. క్రేజీ మల్టీస్టారర్ ప్రకటించిన అనిల్ రావిపూడి, రిలీజ్ డేట్ ఫిక్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved