- Home
- Entertainment
- నిహారిక, సమంత, మనోజ్, పవన్, నాగ్, సునీత.. విడాకులు తీసుకున్న టాలీవుడ్ స్టార్స్ వీరే.. లిస్ట్ పెద్దదే!
నిహారిక, సమంత, మనోజ్, పవన్, నాగ్, సునీత.. విడాకులు తీసుకున్న టాలీవుడ్ స్టార్స్ వీరే.. లిస్ట్ పెద్దదే!
అందరు ఊహించినట్టే మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకున్నారు. చైతన్య జొన్నలగడ్డతో ఆమె విడిపోయారు. కోర్ట్ సైతం అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టాలీవుడ్‌లో విడాకులు తీసుకున్న స్టార్స్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. మరి ఆ తారలు ఎవరెవరు అనేది చూస్తే..

మెగా డాటర్, నాగబాబు కూతురు నిహారిక, ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు కుమారు చైతన్య జొన్నలగడ్డతో వివాహం మూడేళ్ల క్రితం చాలా గ్రాండ్‌గా జరిగింది. 2020 డిసెంబర్ 9న జైపూర్ ప్యాలెస్‌లో వీరి వివాహం జరగ్గా.. మెగా ఫ్యామిలీ అంతా హాజరయ్యింది. అందుకోసం ప్రత్యేకంగా తమ జెట్ విమానాల్లో వెళ్లారు మెగా హీరోలు. అయితే పెళ్లై రెండేళ్లు దాటింది. అప్పుడే ఈ ఇద్దరు విడిపోయారు. వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ పరస్పరం అంగీకారంతో విడిపోతున్నట్టు నిహారిక ఓ నోట్‌ని కూడా పంచుకుంది.
Niharika Konidela
నిహారిక.. హీరోయిన్‌గా, యాంకర్‌గా, నిర్మాతగా రాణించిన విషయం తెలిసిందే. యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన నిహారిక.. ఆ తర్వాత హీరోయిన్‌గా మారింది. `ఒకమనసు`, `హ్యాపీ వెడ్డింగ్`, `సూర్యకాంతం`తోపాటు తమిళంలో ఓ సినిమా చేసింది. హీరోయిన్‌గా ఆకట్టుకున్నా, సినిమాలు ఆడలేదు. చిరుతో `సైరా`లోనూ నటించింది. మరోవైపు నిర్మాతగా వెబ్ సిరీస్ చేస్తుంది. ఇటీవల `డెడ్ ఫిక్సెల్`ని నిర్మించడంతోపాటు అందులోనూ నటించింది.
వీరికంటే ముందు టాలీవుడ్‌లో విడాకులు తీసుకున్న స్టార్స్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో సెర్చింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో గతంలో విడాకులు తీసుకున్న తారలు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే.. రెండేళ్ల క్రితం సమంత, నాగచైతన్య కూడా ఇలానే విడాకులు ప్రకటించారు. వీరిద్దరు విడిపోవడానికి ముందు ఓ ఆరు నెలల ముందు నుంచే విడాకుల రూమర్స్ ఊపందుకున్నాయి. ఎట్టకేలకు 2021 అక్టోబర్ 2న సమంత, చైతూ ఇద్దరూ తమ విడాకుల ప్రకటన చేశారు. 2017 అక్టోబర్ 6, 7 తేదీల్లో హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం గ్రాండ్‌గా వీరి వివాహం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి ఒంటరిగానే ఉంటున్నారు. అయితే చైతూ.. శోభితా దూళిపాళ్లతో డేటింగ్‌లో ఉన్నట్టు సమాచారం.
అంతకు ముందు మంచు మనోజ్ కూడా విడాకులు తీసుకున్నారు. ఆయన ముందుగా 2015లో ప్రణీతా రెడ్డిని వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లపాటు బాగానే ఉన్నారు. కానీ ఇద్దరి మధ్య చోటు చేసుకున్న భేదాభిప్రాయాల నేపథ్యంలో విడిపోయారు. 2019లో మనోజ్ విడాకులు ప్రకటించారు. ఆ తర్వాత భూమా మౌనికా రెడ్డిని ఈ ఏడాది మార్చి 3న రెండో పెళ్లి చేసుకున్నారు.
సింగర్ సునీతకి ఎప్పుడో చిన్నప్పుడు పెళ్లి అయ్యింది. ఆమెకి మొదట కిరణ్‌తో వివాహం జరిగింది. వీరికి శ్రేయ, ఆకాష్ పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత భర్తతో వచ్చిన విభేదాలు, గొడవల కారణంగా విడిపోయారు. చాలా కాలం ఒంటరిగా ఉన్న సునీత పిల్లల ఒత్తిడి మేరకు 2021లో మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల మ్యాటర్ రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అవుతుంది. పవన్ మొదట 1997లో నందిని వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ కుదరక.. విడిపోయారు. ఆ తర్వాత 2009లో ప్రేమించి హీరోయిన్ రేణు దేశాయ్‌ని పెళ్లి చేసుకున్నాడు పవన్. 2012లో ఆమెతో కూడా విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్య ఉన్నారు. 2013లో రష్యా నటి అన్నా లెజినోవాని వివాహం చేసుకున్నాడు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు.
అంతకు ముందు అక్కినేని హీరో సుమంత్.. `తొలిప్రేమ` హీరోయిన్ కీర్తిరెడ్డిని 2004లో పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లకే ఈ ఇద్దరు విడిపోయారు. కీర్తి రెడ్డి మళ్లీ పెళ్లి చేసుకుని సింగపూర్‌లో సెటిల్ కాగా, సుమంత్ మాత్రం అప్పట్నుంచి ఒంటరిగానే ఉంటున్నారు. రెండో పెళ్లికి సుముఖంగా లేరు.
కమల్ హాసన్.. మొదట 1978లో డాన్సర్ వాణి గణపతిని వివాహం జరిగింది. పదేళ్ల తర్వాత ఈ ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత నటి సారికని పెళ్లి చేసుకున్నాడు కమల్. వీరికి శృతి హాసన్, అక్షర హాసన్ జన్మించారు. 2002లో ఆమెతో కూడా విడిపోయాడు. ఆ తర్వాత నటి గౌతమితో సహజీవనం చేశారు. 2016లో ఆమె కూడా దూరమయ్యింది. ఇద్దరూ సింగిల్‌గానే ఉంటున్నారు.
నాగార్జున.. 1984లో నిర్మాత రామానాయుడి కుమార్తె లక్ష్మి దగ్గుబాటిని పెళ్లి చేసుకున్నారు. కానీ ఇద్దరికి సెట్ కాలేదు. దీంతో 1990లో విడిపోయారు. వీరికి నాగచైతన్య జన్మించారు. ఆ తర్వాత ప్రేమించి హీరోయిన్ అమలని పెళ్లి చేసుకున్నారు నాగార్జున. వీరికి అఖిల్ జన్మించాడు.
సీనియర్ నటుడు నరేష్.. మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో ఆయన పెళ్లిళ్లు కూడా పెద్ద హాట్ టాపిక్ అవుతుంటాయి. ఇటీవల మరీ అది పీక్‌లోకి వెళ్లింది. ఇక మొదట నరేష్.. డాన్సు సీనియర్ మాస్టర్ శ్రీను కూతురిని వివాహం చేసుకున్నారు. వీరికి నవీన్ విజయ్ కృష్ణ జన్మించారు. ఆ తర్వాత ఆమెకి విడాకులిచ్చి రేఖ సుప్రియాని వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లకే విడిపోయారు. అనంతరం అనంతర రమ్య రఘుపతిని పెళ్లి చేసుకున్నారు. ఆమెతో కూడా విడిపోయారు. ఇప్పుడు మరో నటి పవిత్ర లోకేష్‌తో సహజీవనం చేస్తున్నాడు నరేష్. ఇలా వీరితోపాటు శరత్ బాబు- రమా ప్రభ, రాధిక-ప్రతాప్ పోతన్ వంటి చాలా జంటలు పెళ్లిళ్లు చేసుకుని విడిపోయారు.