- Home
- Entertainment
- చిరు, బాలయ్య వల్ల కాలేదు.. వెంకటేష్ పేరుమీదే ఆ మూడు రికార్డులు, ఇప్పటికీ ఆయనే తోపు
చిరు, బాలయ్య వల్ల కాలేదు.. వెంకటేష్ పేరుమీదే ఆ మూడు రికార్డులు, ఇప్పటికీ ఆయనే తోపు
వెంకటేష్ `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాతో దుమ్ములేపుతున్నాయి. ఈ సందర్భంగా సీనియర్ హీరోల్లో వెంకీకి సంబంధించిన పలు అరుదైన రికార్డుల బయటకు వచ్చాయి. అవేంటో చూద్దాం.

విక్టరీ వెంకటేష్ ఇప్పుడు `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాతో కలెక్షన్ల దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన పేరుమీదే మూడు రికార్డులున్నాయి. సీనియర్లలో ఆయనే అరుదైన రికార్డులు క్రియేట్ చేశారు. చిరంజీవి, బాలయ్య, నాగార్జున చేయలేనివి వెంకటేష్ చేశారు. ఇప్పుడు మరో రికార్డు క్రియేట్ చేశారు. మరి ఆ కథేంటో చూద్దాం.
విక్టరీ వెంకటేష్ బాక్సాఫీసు వద్ద తన స్టామినా చూపించి చాలా ఏళ్లు అవుతుంది. ఇటీవల కాలంలో ఆయన సినిమాలు ఏదో ఆడుతున్నాయి, తప్ప కచ్చితంగా బ్లాక్ బస్టర్ అని చెప్పే సినిమాలు లేవు. చాలా వరకు నిరాశనే ఎదురవుతుంది. దీంతో వెంకీ డౌన్ అయ్యే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఇన్నాళ్లకి వెంకీ పవర్ ఏంటో చూపించాడు. బాక్సాఫీసు వద్ద తన రేంజ్ ఏంటో చూపించాడు.
వెంకటేష్ ఇప్పుడు `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. ఇప్పటికీ థియేటర్లలో రచ్చ చేస్తుంది. ఈ మూవీ ఇప్పటి వరకు సుమారు రూ.260కోట్లు దాటింది. ఇప్పటికీ అదే జోరు చూపిస్తుంది. చూడబోతుంటే ఇది 300 కోట్ల క్లబ్‌లో చేరేలా ఉంది. సీనియర్ హీరోల్లో ఇంతటి కలెక్షన్లు సాధించిన హీరోగా వెంకీ సరికొత్త రికార్డు సృష్టించారు.
ఇదే కాదు, వెంకీ పేరుతో మరో రెండు రికార్డులు ఉన్నాయి. టాలీవుడ్‌లో ఫస్ట్ పదికోట్లు వసూలు చేసిన మూవీ వెంకీదే కావడం విశేషం. 1992 జనవరిలో వచ్చిన `చంటి`సినిమా పది కోట్ల కలెక్షన్లు సాధించిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది. ఇది సుమారు రూ.18కోట్లు కలెక్ట్ చేసింది.
అయితే ఆ రికార్డుని అదే ఏడాది చిరు బ్రేక్ చేశాడు. `ఘరానా మొగుడు`(ఏప్రిల్‌లో) మూవీ ఏకంగా పది కోట్ల షేర్ సాధించింది. కానీ తొలి పది కోట్ల మూవీ మాత్రం వెంకీదే కావడం విశేషం.
ఆ తర్వాత 2000లో `కలిసుందాం రా` సినిమాతో మరో రికార్డు సృష్టించారు వెంకీ. టాలీవుడ్‌లో 25కోట్ల కలెక్షన్లు సాధించిన హీరోగా నిలిచారు. ఈ మూవీ 26కోట్లు వసూలు చేసింది. అప్పట్లో ఇది ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్. అప్పటి వరకు చిరు, బాలయ్య సినిమాలు కూడా ఇంతటి కలెక్షన్లు సాధించలేదు. ఆ తర్వాతనే వారి సినిమాలకు సాధ్యమైంది.
ఇక ఇప్పుడు సీనియర్ హీరోల్లో,అలాగే నాన్ పాన్ ఇండియా మూవీస్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా `సంక్రాంతికి వస్తున్నాం` నిలిచింది. ఇది ఇప్పటి వరకు రూ.260కోట్లు రాబట్టింది. ఈ విషయంలో సీనియర్లు, జూనియర్ ఎవరూ వెంకీతో పోటీలో లేదు. అన్ని రికార్డులు బ్రేక్ చేశారు. కేవలం ఒకే లాంగ్వేజ్‌లో విడుదలై ఇంతటి కలెక్షన్లు సాధించడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
Sankranthi, Box Office Winners, Venkatesh, Sankranthiki Vasthunnam
అనిల్ రావిపూడి రూపొందించిన `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రంలో వెంకటేష్‌కి జోడీగా ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటించారు. తాళికట్టిన భార్య, ప్రేమించిన మాజీ ప్రియురాలి మధ్య నలిగిపోయే మొగుడి కథతో రూపొందిన ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు.
చాలా కాలం తర్వాత తెలుగులో ప్రాపర్ ఫ్యామిలీ, కామెడీ ఎంటర్ టైనర్ రావడంతో, పైగా సంక్రాంతి సీజన్‌కి రావడంతో సినిమాకి ఫ్యామిలీ ఆడియెన్స్ బ్రహ్మారథం పడుతున్నారు. అందుకే మూవీ భారీ వసూళ్లని రాబడుతుంది. మున్ముందు మూడు వందలకోట్లు వసూలు చేసినా ఆశ్చర్యం లేదు
read more: చిరుతో కాదు, ప్రభాస్‌తో కాదు.. అమితాబ్ బచ్చన్ తెలుగులో నటించిన ఫస్ట్ మూవీ ఏదో తెలుసా?
also read: `పుష్ప` ఫ్లాప్, సుకుమార్‌కి ముందే చెప్పిన అల్లు అర్జున్, ఇంతటి సంచలనం వెనుక ఏం జరిగిందంటే?