తగ్గేదేలే: ‘పుష్ప’ కోసం రెండు కోట్లు గ్లామర్ బండి
డ్యాన్సర్, మోడల్, సింగర్, నటి, రియలిటీ షోకు జడ్జిగా.. ఇలా అన్ని రంగాల్లో ఇప్పటికే తనదైన ముద్ర వేసుకుంది. ఆమెకు దేశ వ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన అందచందాలతో పాటు, ఎలాంటి డ్యాన్స్ మూమెంట్స్‌నా క్షణాల్లో చేయటంలో ఎక్సపర్ట్.
नोरा फतेही (Nora Fatehi)
ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి’ సినిమాలో ‘మనోహరి’ పాటలో ఆడిపాడిన కెనడా ముద్దుగుమ్మ నోరా ఫతేహి. చురకత్తులాంటి ఆమె చూపులకు తెలుగు కుర్రాళ్లు మనసు పారేసుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్న నోరా ఫతేహి మళ్లీ తెలుగులో మరోసారి దుమ్ము రేపనుంది.
नोरा फतेही
సినీ లవర్స్ కు డ్యాన్స్ అంటే ఇష్టపడేవారికి ఇంట్రడక్షన్ అక్కర్లేని పేరు ఆమెది. డ్యాన్సర్, మోడల్, సింగర్, నటి, రియలిటీ షోకు జడ్జిగా.. ఇలా అన్ని రంగాల్లో ఇప్పటికే తనదైన ముద్ర వేసుకుంది. ఆమెకు దేశ వ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన అందచందాలతో పాటు, ఎలాంటి డ్యాన్స్ మూమెంట్స్‌నా క్షణాల్లో చేయటంలో ఎక్సపర్ట్.
नोरा फतेही
ప్రత్యేకమైన పాటలను తన సైల్లో అవలీలగా చేస్తూ కుర్రకారును మతిపోగోడుతుంటుంది. బాలీవుడ్‌లో సత్తా చాటిన ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. టెంపర్, కిక్2, లోఫర్, ఊపిరి చిత్రాల్లో ఆడిపాడిన నోరా.. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ మెప్పించింది.
ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న పుష్ప లోనూ ఆమె ఆడిపాడనుందని సమాచారం. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు నిర్మాతలు ఆమెను ఓ ఐటం నెంబర్ కోసం ఎప్రోచ్ అయ్యారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఓ అదిరిపోయే సాంగ్ ని ఆమెపై చిత్రీకరించనున్నారు.
అయితే ఆమె ఇంకా సైన్ చేయలేదు. రెమ్యునేషన్ విషయంలో బేరసారాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఆమె అడిగిన రేటు ఇస్తారని అంటున్నారు. ఆమె చేస్తే వచ్చే క్రేజ్ వేరు అని టీమ్ భావిస్తోంది. ఆమెకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. హిందీ రిలీజ్ కు ఈ పాట వల్ల బెనిఫిట్ ఉండే అవకాసం ఉంది.అయితే ఈ సాంగ్ కోసం ఆమె రెండు కోట్లు కోట్ చేసినట్లు సమాచారం.
Nora Fatehi
నోరా రిలీజ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో క్షణాల్లోనే ట్రెండింగా మారుతాయంటే ఆమెకున్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఆ హాట్ బ్యూటీ ఎప్పటికప్పుడు డాన్స్ వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూంటుంది. వాటికి మంచి ఫాలోయింగ్ ఉంది.
ఆ మధ్యన వన్ డ్యాన్స్ అనే మ్యుజిషియన్ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ స్టెప్పులతో ఇరగదీసింది. పింక్ టాప్, బ్లూ కలర్ డెనిమ్ జీన్స్ ధరించిన నోరా.. తన బాడీని మెలికలుగా తిప్పుతూ వయ్యారాల పోయింది. సమ్మర్ టైం అంటూ నోరా చేసిన ఈ డ్యాన్స్ నెట్టింటా చక్కర్లు కొట్టింది. అద్భుతంగా ఉందంటూ నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంది.
ఇక ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తన కుటుంబాన్ని పోషించేందుకు 16వ సంవత్సరంలోనే పనిలో చేరారని వెల్లడించింది బాలీవుడ్ భామ నోరా ఫతేహి. ఆ మధ్య ఓ కార్యక్రమంలో పాల్గొన్న నోరా తన జీవితం గురించి తెలియని పలు విషయాల్ని పంచుకుంది. అవి వైరల్ అయ్యాయి
‘ఒకప్పుడు మా కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అది చూసి చేతనైన సాయం చేయాలనిపించి నేను మా పాఠశాలకు దగ్గరగా ఉన్న ఓ మాల్‌లో రిటైల్ సేల్స్ అసోసియేటివ్‌గా చేరాను. ఆ తర్వాత పలు రెస్టారంట్లు, బార్లలో వెయిటర్‌గా పని చేశాను. ఓ వస్త్ర దుకాణంలోనూ కొన్ని రోజులు పని చేశాను. అంతేకాదు లాటరీ టికెట్లూ అమ్మాను’ అని గుర్తు చేసుకుంది.
డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చకున్న ఈ కెనడా భామ టెంపర్ చిత్రంలోని ప్రత్యేక గీతంతో టాలీవుడ్‌కి పరిచయమైంది. ప్రస్తుతం భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రంలో నటించింది. ‘నా పనికోసం నేను సిద్ధంగా ఉన్నా’ అంటుంది ఈ బాలీవుడ్ భామ.
नोरा फतेही (Nora Fatehi)
ఇప్పటికే సిద్ధమైన చిత్రాలన్నీ ఓటీటీ బాటపడుతున్నాయి. విదేశాల్లో షూటింగ్ పూర్తిచేసుకున్న ‘బెల్ బాటమ్’ సినిమాను మాత్రం థియేటర్లలోనే విడుదల చేసారు. అక్షయ్‌కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ ఐటెమ్ సాంగ్ ఉంది. ఈ పాటలో బాలీవుడ్ యువ అందాల తార నోరా ఫాతెహి నర్తించింది.
‘అక్షయ్‌తో కలిసి డ్యాన్స్ చేయడం కన్నా ఆనందం ఏముంటుంది?’ అని నోరా ఉప్పొంగిపోతోంది. లక్‌నవూ సెంట్రల్ చిత్రంతో పేరుతెచ్చుకున్న రంజిత్ తివారి ‘బెల్ బాటమ్’ను తెరకెక్కించారు. ఇప్పుడు పుష్ప సినిమాతోనూ ఆమెకు మంచి గుర్తింపు వస్తుందని భావిస్తోంది.