MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నేను లొంగటం లేదనే ఆఫర్స్ లేకుండా చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, స్టార్ లపై డైరక్ట్ గా ఎటాక్

నేను లొంగటం లేదనే ఆఫర్స్ లేకుండా చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, స్టార్ లపై డైరక్ట్ గా ఎటాక్

 ‘ఆమె ఎందుకు వచ్చింది. ఆమెను ఇందులోకి ఎందుకు తీసుకుంటున్నారు’ అని గోల చేస్తారు. నాకు అవకాశాలు రావడం వాళ్లకు నచ్చదు. బెదిరిస్తుంటారు.

4 Min read
Surya Prakash
Published : Apr 12 2024, 09:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

నోరా ఫతేహి అనగానే బాహుబలి సినిమాలో మనోహరి పాట గుర్తు వస్తుంది. అప్పటిదాకా ఎన్ని సినిమాలు చేసినా ఆ పాటతో మన సాత్ లోనూ పాపులారిటీ తెచ్చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్‌ తో పాటు సౌత్‌ లో కూడా మంచి ఫాలోయింగ్‌ దక్కించుకున్న  నోరా ఫతేహి స్ట్రైయిట్ గా మాట్లాడతూ ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూంటుంది.  సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలతో అలరిస్తూ కుర్రాళ్లకు కిక్ ఇచ్చే ఆమె ఈ సారి బాలీవుడ్ పై తన దైన బాణాలు ఎక్కుపెట్టింది.

212

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్ననోరా ఫతేహి సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తుచేసుకుని ఎమోషన్ కు  లోనయ్యారు. 16 ఏళ్ల వయసు నుంచే సంపాదించడం మొదలుపెట్టినట్లు చెప్పారు. దీంతో యవ్వనాన్ని పూర్తిగా ఆస్వాదించ లేకపోయినట్లు తెలిపారు. ఆ విషయాలను మాట్లాడుతున్న ఆమె ఇండస్ట్రీ తనను ఎలా ఎక్సప్లాయిట్ చేయాలని చూసిందో చెప్పుకొచ్చింది. 

312

నోరా ఫతేహి మాట్లాడుతూ....‘‘కొందరు నటులు అవకాశాలు ఇప్పిస్తామని నాతో చెప్పి దగ్గరవ్వాలని చూస్తుంటారు. నేను అలాంటివాటికి లొంగిపోయే అమ్మాయిని కాదు. పని కోసం ఏదైనా చేసే రకం కాదని వాళ్లకు మొహం మీదే చెబుతాను. ఇలా ముక్కుసూటిగా ఉండడం వల్లే నాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కొంతమంది దాన్ని అర్థం చేసుకోగలరు. మరికొందరు మాత్రం కోపం పెంచుకుంటారు. ’’ అని చెప్పారు.

412

అలాగే నా మీద కోపం పెంచుకున్న వాళ్ల సినిమాల్లో నేను ఉన్నానని తెలియగానే.. ‘ఆమె ఎందుకు వచ్చింది. ఆమెను ఇందులోకి ఎందుకు తీసుకుంటున్నారు’ అని గోల చేస్తారు. నాకు అవకాశాలు రావడం వాళ్లకు నచ్చదు. బెదిరిస్తుంటారు. కించపరిచేలా మాట్లాడుతుంటారు. బాలీవుడ్‌లో ఆ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి’’ అని చెప్పుకొచ్చారు.

512

ఇక   'కెరీర్ ప్రారంభంలో నన్ను కూడా పదేపదే కాంప్రమైజ్ అవ్వమని చాలా మంది సలహాలు ఇచ్చారు. కొందరు వ్యక్తులతో డేటింగ్ చేయమని బలవంతం చేసేవారు. కానీ నేను ఆరోజు వాటిని తలొగ్గలేదు. నాకున్న దారిలోనే నేను వెళ్లాను. సక్సెస్  అయ్యాను. ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే దానికి మరో వ్యక్తితో తిరగడం, ఫలానా హీరోతో రాసుకుపూసుకు తిరగడం అయితే కారణం కాదు' అని నటి నోరా ఫతేహి చెప్పుకొచ్చింది. 

612

నేను ఎవరికీ లొంగనప్పుడు నా వెనకాల నోటికి వచ్చినట్లు మాట్లాడటం మొదలెట్టారు ఇండస్ట్రీలో కొందరు. నా మీద చెత్త ప్రచారాలు మొదలెట్టారు. ఇండస్ట్రీలో చాలా మంది పెద్దవాళ్లు అని చెప్పుకునేవాళ్లు ఆడవాళ్లు చెప్పినట్లు వినాలని, నమ్రతగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారి అధికారానికి నేను లోబడను. అలాంటి సిట్యువేషన్ లో నన్ను చూపిస్తే ఆమెకు ఏమీ రాదు..ఏమి టాలెంట్ లేదు..అసలు ఆమె ఏమీ కాదు. క్రేజ్ లేదు. అలాంటి ఆమెను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారంటూ విరుచుకుపడతారు. 

712

 నోరా ఫతేహి.. అదే ఇంటర్వూలో  కీర్తి, అధికారం లేదా డబ్బు కోసం ఇతరులను ఉపయోగించుకునే క్లౌట్ ప్రిడేటర్స్ గురించి మాట్లాడారు. రణవీర్ అల్లాబాడియాతో పాడ్ కాస్ట్ లో నోరా ప్రేమలో ఉన్నట్లు నటించే ప్రముఖ జంటల గురించి చెప్పుకొచ్చింది. కేవలం సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పాపులారిటీ కోస‌మే కలిసి ఉన్నారని అన్నారు. అలాంటి  ప్రముఖులు `కాలిక్యులేటివ్` అని విమ‌ర్శించింది. ఇక్క‌డ జంట‌లు వారి కెరీర్ ని, పర్శనల్ లైఫ్ ని మిళితం చేస్తారు. అందువల్ల డిప్రెషన్   ఆత్మహత్య వంటివి  చేసుకునే పరిస్దితి వస్తాయంటూ  సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.
 

812

 సినీపరిశ్రమలో పలుకుబడి కోసం పెళ్లి చేసుకుంటారు. ప్రజలు ఈ భార్యలను లేదా భర్తలను నెట్‌వర్కింగ్ కోసం సర్కిల్‌ల కోసం, డబ్బు కోసం కోసం కూడా ఉపయోగించుకుంటారు. నేను ఫలానా రకంగా ఎదగాలి కాబట్టి ఆ  వ్యక్తిని పెళ్లి చేసుకుని  నేను మూడేళ్లపాటు రిలేషన్ లో  ఉండగలను! అని వారు అనుకుంటారు. ఎందుకంటే ఆమె లేదా అతని  కొన్ని సినిమాలు   బాక్సాఫీస్ సూపర్ హిట్ అవుతున్నాయి .. కాబట్టి అటు వైపు అడుగులు వెయ్యాలి అనుకుంటారు! అని నోరా వ్యాఖ్యానించింది.

912

మన ఇండస్ట్రీలో చాలా మంది ఇక్కడ అలాంటి పనికిమాలిన పనులే  చేస్తున్నారు. వారు సరైన  సర్కిల్‌లలో ఉండాలని కోరుకుంటున్నందున... వారు అక్కడి వారితో అనుబంధం క‌లిగి ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే వారి కెరీర్ ఎక్కడికి వెళుతుందో వారికి తెలియదు. కాబట్టే వారికి కొంత బ్యాకప్ ప్లాన్ కావాలి. ప్లాన్ A, ప్లాన్ B, ప్లాన్ C... పని పని.. ఇలాగే సాగుతుంది. ఎలాంటి పరిస్దితులు లేదా కెరీర్ కోసమైనా మన వ్యక్తిగత జీవితాన్ని, మానసిక ఆరోగ్యాన్ని - ఆనందాన్ని త్యాగం చేయడం నాకు అర్థం కాలేదు.  అని జీవిత స‌త్యాల‌పై ఘాటైన వ్యాఖ్య‌లు చేసింది. 

1012

ఇక గతంలో స్కిన్‌ షో తో మెప్పించిన నోరా ఈసారి అంతకు మించి అన్నట్లుగా స్కిన్‌ షో చేయకున్నా కూడా అందంగా కనిపిస్తోందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే అందంతో పాటు మంచి డాన్సర్‌ అయిన ఈ అమ్మడు గతంలో ఎన్నో సినిమాల్లో ప్రత్యేక పాటల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు హిందీ సినిమాలతో పాటు ఒక తెలుగు సినిమాలో కూడా నటిస్తూ బిజీగా ఉంది. వెబ్‌ సిరీస్ లకు కూడా మోస్ట్ వాంటెడ్‌ గా హీరోయిన్‌ గా నోరా ఫతేహీ నిలుస్తోంది. 

1112

 2014లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నోరా.. ఆ తర్వాత ఏడాది ఎన్టీఆర్ 'టెంపర్'లో స్పెషల్ సాంగ్ చేసి ఎంటర్‌టైన్ చేసింది. కిక్ 2, షేర్, లోఫర్, ఊపిరి తదితర చిత్రాల్లో తన డ్యాన్సులతో ఆకట్టుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు వరుణ్ తేజ్ 'మట్కా'లో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ప్రత్యేక గీతంతో పాటు ఈమె పాత్రకు ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాలని పక్కనబెడితే ఈమెకు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ప్రత్యేకించి ఈమె ఫొటోలు, వీడియో పోస్ట్ చేస్తే చాలు కుర్రాళ్లు వెర్రెక‍్కిపోతుంటారు. 

1212

బాలీవుడ్‌ చిత్రం రోర్‌: టైగర్స్‌ ఆఫ్‌ ది సుందర్‌బన్స్‌ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు నోరా ఫతేహి. ఆ తర్వాత తెలుగులోనూ ‘టెంపర్‌’, ‘బాహుబలి’, ‘కిక్‌2’ తదితర సినిమాల్లో ఐటెమ్‌ సాంగ్‌లతో అలరించారు. అలాగే ‘బిగ్‌ బాస్‌’, ‘జలక్‌ దిఖల్‌జా సీజన్‌ 9’ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ప్రస్తుతం పలు డ్యాన్స్ షోలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved