- Home
- Entertainment
- Nabha Natesh: విచిత్రంగా నభా నటేష్ పరిస్థితి, నో ఆఫర్స్.. నిర్మాతలకి చుక్కలు చూపిస్తే అంతే..?
Nabha Natesh: విచిత్రంగా నభా నటేష్ పరిస్థితి, నో ఆఫర్స్.. నిర్మాతలకి చుక్కలు చూపిస్తే అంతే..?
టాలీవుడ్ యువతకి క్రష్ గా మారుతున్న యంగ్ బ్యూటీలలో నభా నటేష్ ఒకరు. చూపు తిప్పుకోలేని తన హాట్ ఫిగర్ తో నభా నటేష్ కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తోంది. గత ఏడాది వరకు నభా నటేష్ కెరీర్ టాలీవుడ్ లో బాగానే సాగింది.

టాలీవుడ్ యువతకి క్రష్ గా మారుతున్న యంగ్ బ్యూటీలలో నభా నటేష్ ఒకరు. చూపు తిప్పుకోలేని తన హాట్ ఫిగర్ తో నభా నటేష్ కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తోంది. గత ఏడాది వరకు నభా నటేష్ కెరీర్ టాలీవుడ్ లో బాగానే సాగింది. కానీ ప్రస్తుతం ఆమె కెరీర్ అయోమయంలో పడింది. ఈ ఏడాది ఆరు నెలలు గడుస్తున్నా ఆమె చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేదు.
ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో Nabha Natesh పెర్ఫామెన్స్ కు, గ్లామర్ కు యువత ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ యువతలో మరింతగా తన క్రేజ్ పెంచుకుంటోంది నభా. నభా నటేష్ చివరగా నితిన్ 'Maestro' మూవీలో మెరిసింది. ఆంధధూన్ చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ మూవీ ఓటిటిలో విడుదలై ఆకట్టుకుంది.
ఇస్మార్ట్ మూవీలో నభా నటేష్ జోరు చూశాక తప్పకుండా ఈ యంగ్ బ్యూటీ టాప్ లీగ్ కి వెళుతుందని భావించారు. మతి పోగొట్టే ఒంపు సొంపులతో కుర్రాళ్లని నభా విపరీతంగా ఆకర్షించింది. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా తాన్ రెమ్యునరేషన్ పెంచుతూ వచ్చింది. ఆ సక్సెస్ జోరులో కొన్ని చిత్రాలకు నభా అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చారు నిర్మాతలు.
కానీ అల్లుడు అదుర్స్, డిస్కో రాజా లాంటి ప్లాపులు పడ్డ తర్వాత కూడా నభా రెమ్యునరేషన్ పెంచేసిందట. ప్రస్తుతం ఈ యంగ్ బ్యూటీ ఏకంగా కోటి డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కోటి నుంచి ఒక్క రూపాయి కూడా తగ్గడం లేదట. దీనితో నిర్మాతలు ఆమెని సంప్రదించడం లేదని వార్తలు వస్తున్నాయి.
ఈ ఏడాది నభా ఒక్క ఆఫర్ కూడా అందుకోకపోవడానికి కారణం ఇదే అని అంటున్నారు. ఆమె 50 నుంచి 70 లక్షల వరకు డిమాండ్ చేస్తే రీజనబుల్ గా ఉంటుందని ప్రొడ్యూసర్స్ భావిస్తున్నారు.
రెమ్యునరేషన్ విషయంలో నభా మొండి పట్టు ఆమెకి శాపంగా మారుతోంది. కొత్తగా వచ్చిన కృతి శెట్టి, శ్రీలీల లాంటి హీరోయిన్లు మంచి ఆఫర్స్ ఎగరేసుకుపోతున్నారు. ముందుగా నభా నటేష్ ఈ విషయాన్ని గ్రహించకుంటే ఆమె కెరీర్ ప్రమాదంలో పడినట్లే.