Nithya Menen: స్టార్ హీరోతో త్వరలో నిత్యా మీనన్ వివాహం.. చాలా కాలంగా లవ్ అఫైర్ ?
నటన పరంగా నిత్యా మీనన్ టాప్ హీరోయిన్ అనే చెప్పాలి. కళ్ళతోనే హావభావాలు పలికించే నటీమణులు చాలా అరుదు. ఆ అద్భుతమైన ప్రతిభ నిత్యామీనన్ సొంతం.

నటన పరంగా నిత్యా మీనన్ టాప్ హీరోయిన్ అనే చెప్పాలి. కళ్ళతోనే హావభావాలు పలికించే నటీమణులు చాలా అరుదు. ఆ అద్భుతమైన ప్రతిభ నిత్యామీనన్ సొంతం. నిత్యామీనన్ నుంచి దర్శకులు ఎలాంటి ఎమోషన్ అయినా రాబట్టుకోవచ్చు. నిత్యా మీనన్ ఏ చిత్రంలో నటించినా అందులో ఆమె మార్క్ కనిపిస్తుంది.
వివాదాలకు, రూమర్స్ కి నిత్యా మీనన్ దూరంగా ఉంటుంది. కానీ తాజాగా నిత్యా మీనన్ గురించి ఓ షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది. త్వరలోనే నిత్యామీనన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ఈ వార్త మలయాళీ చిత్ర పరిశ్రమలో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం నిత్యామీనన్ వయసు 34 ఏళ్ళు. తాను వివాహం చేసుకునేందుకు ఇదే సరైన సమయం అని ఈ బ్యూటీ బావిస్తోంది అట.
ఇందులో ఓ షాకింగ్ ట్విస్ట్ ఉంది. నిత్యామీనన్ పెళ్లి చేసుకోబోయేది మలయాళీ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ స్టార్ హీరోని అంటూ ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందే ఆ హీరోతో నిత్యామీనన్ కి పరిచయం ఉందట. ఇక వీళ్ళిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. నిత్యామీనన్ పెళ్లి వార్త వింటూ ఫ్యాన్స్ థ్రిల్ కి గురవుతున్నారు.
ఆ హీరో ఎవరనేది ఇంకా బయటకి రాలేదు. ఏది ఏమైనా నిత్యామీనన్ లవ్ లైఫ్ కి ఎండ్ చెప్పి మ్యారేజ్ లైఫ్ కి స్వాగతం పలకాలని భావిస్తోంది అట. నిత్యామీనన్ తో ప్రేమలో ఉన్న ఆ స్టార్ హీరో ఎవరు ? ఆమె ఏడడుగులు వేయబోయేది ఎవరితో అనే చర్చ సర్వత్రా జరుగుతోంది.
రూమర్స్ కి దూరంగా ఉండే నిత్యా మీనన్ పై కూడా గతంలో ప్రేమ వ్యవహారాల గురించి పుకార్లు వినిపించాయి. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తో నిత్యా మీనన్ అఫైర్ నడిపినట్లు గతంలో పుకార్లు వినిపించాయి. ఈ వార్తలని నిత్యామీనన్ అప్పట్లో ఖండించింది.
ఇదిలా ఉండగా తెలుగులో నిత్యా మీనన్ చివరగా పవన్ కళ్యాణ్ సరసన భీమ్లా నాయక్ చిత్రంలో నటించింది. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. అలా మొదలయింది, ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్ చిత్రాల్లో నటించింది.