నిహారిక ఇంటర్వ్యూపై మాజీ భర్త స్ట్రాంగ్ రియాక్షన్.. ఇలాంటివి ఆపేయ్, బాధ రెండు వైపులా ఉంటుంది
నిహారిక తన పర్సనల్ లైఫ్ తో ఇటీవల వార్తల్లో నిలిచింది. ఆమె వివాహ బంధంలో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. చైతన్య జొన్నలగడ్డ , నిహారిక గత ఏడాది విడాకులు తీసుకుని విడిపోయారు.

మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక నటిగా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. పెళ్ళికి ముందు కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. అయితే ఆ చిత్రాలు వర్కౌట్ కాలేదు. దీనితో నిహారిక ప్రస్తుతం వెబ్ సిరీస్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అలాగే సినిమా ఆఫర్స్ కోసం కూడా ట్రై చేస్తోంది.
ఇదిలా ఉండగా నిహారిక తన పర్సనల్ లైఫ్ తో ఇటీవల వార్తల్లో నిలిచింది. ఆమె వివాహ బంధంలో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. చైతన్య జొన్నలగడ్డ , నిహారిక గత ఏడాది విడాకులు తీసుకుని విడిపోయారు. అంతకు ముందు వీరిద్దరి పర్సనల్ లైఫ్ లో విభేదాలు మొదలైనట్లు రూమర్స్ వచ్చాయి ఇప్పుడు ఆ రూమర్స్ నిజమయ్యాయి. నిహారిక విడాకుల గురించి మెగా ఫ్యామిలీ ఎవరూ బయట స్పందించలేదు. దీనితో నిహారిక, చైతన్య విడిపోవడానికి కారణాలు ఏంటి అనేది బయటకి రాలేదు.
అయితే యాంకర్ నిఖిల్ తో జరిగిన ఇంటర్వ్యూలో నిహారిక.. చైతన్య నుంచి విడిపోవడానికి గల కారణాలు చెబుతూ కుండ బద్దలు కొట్టేసింది. అత్తింటి వారు తనపై ఆంక్షలు విధించడమే విడాకులకు కారణం అన్నట్లుగా నిహారిక తేల్చేసింది. పెళ్లి తర్వాత నటించకూడదా ? మీరు రాంగ్ పర్సన్ పై డిపెండ్ కాకూడదు.. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ అమ్మానాన్న కాలేరు. అంత డబ్బు ఖర్చు చేసి పెళ్లి చేసుకుని ఎవ్వరూ ఊరకనే విడిపోరు అని నిహారిక తెలిపింది.
ఛైతన్యతో విడిపోవడం గురించి ఇంకా చాలా వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ ఇంటర్వ్యూపై నిహారిక మాజీ భర్త చైతన్య ఊహించని విధంగా రియాక్ట్ అయ్యారు. నిహారికని ఇంటర్వ్యూ చేసిన నిఖిల్ ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీనిపై చైతన్య రియాక్ట్ అవుతూ.. ఈ ఇంటర్వ్యూ వల్ల చైతన్య బాగా హర్ట్ అయినట్లు ఉన్నాడు.
సెలెబ్రిటీలు విడిపోయిన తర్వాత విడాకుల గురించి డిటైల్డ్ గా స్పందించడం జరగదు. కానీ నిహారికతో ఇంటర్వ్యూలో నిఖిల్ అన్ని విషయాలని రాబట్టే ప్రయత్నం చేశారు. నిఖిల్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ పై కాస్త ఘాటుగానే చైతన్య రియాక్ట్ అయ్యాడు.
చైతన్య పోస్ట్ చేస్తూ.. నిహారికపై ఉన్న నెగిటివిటీ పోగొట్టడానికి మీరు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పది. వ్యక్తిగత సంక్షోభాన్ని ఎదుర్కొనడం అంత సులభమైన విషయం కాదు. అయితే బాధితురాలి ట్యాగ్ లు ఉపయోగిస్తూ మరింత పబ్లిసిటీ పొందేలా, మరింత రీచ్ అయ్యేలా కోరుకోవడం సరైనది కాదు.
ఈ ఇంటర్వ్యూని ఎక్కువ మందికి చేరవేయాలి అని తాపత్రయ పడుతున్నట్లు ఉన్నారు అంటూ చైతన్య కౌంటర్ ఇచ్చారు. వివాహం అనే వ్యవస్థని గౌరవించాలని చైతన్య కోరారు. మానిపోతున్న గాయాన్ని ఈ రకంగా పైకి తీసుకురావడం కరెక్ట్ కాదు. విడాకులు అనే విషయంలో రెండు చివరలు ఉంటాయని గుర్తుంచుకోండి. రెండువైపులా ప్రభావం ఉంటుంది.
ఈ వ్యవహారంలో ఇతరుల జ్యోక్యం ఉండకూడదు. పూర్తిగా విషయాలు తెలియకుండా జడ్జ్ చేయడం ఆపండి అని చైతన్య చురకలంటించారు. దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా అంటూ చైతన్య పోస్ట్ చేశారు. చైతన్య వ్యాఖ్యలు నిహారికతో విడాకుల వ్యవహారంపై మరింత చర్చకు దారితీశాయి.