- Home
- Entertainment
- Niharika: భర్త చైతన్య బర్త్ డే పార్టీలో రెడ్ ఫ్రాక్ ధరించి సూపర్ స్టైలిష్ గా నిహారిక... ఫోటోలు వైరల్
Niharika: భర్త చైతన్య బర్త్ డే పార్టీలో రెడ్ ఫ్రాక్ ధరించి సూపర్ స్టైలిష్ గా నిహారిక... ఫోటోలు వైరల్
మెగా డాటర్ కొణిదెల నిహారిక భర్త బర్త్ డే వేడుకల్లో ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఫ్రెండ్స్ తో కలిసి ఆమె చిల్ అవుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Niharika Konidela
నిహారిక-వెంకట చైతన్య(Venkata Chaitanya) వివాహం జరిగి ఏడాదిన్నర అవుతుంది. 2020 డిసెంబర్ 9న వీరి వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ వేదికగా ఘనంగా జరిగింది. మెగా హీరోలందరూ పాల్గొన్న ఈ వివాహ వేడుక నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. ఐదు రోజుల పాటు వెంకట చైతన్య, నిహారిక వివాహం జరిగింది.
Niharika Konidela
ఇక వివాహమయ్యాక భర్త రెండో బర్త్ డేను నిహారిక(Niharika Konidela) ఘనంగా నిర్వహించారు. జులై 26 వెంకట చైతన్య బర్త్ డే కాగా... నిహారిక దగ్గరుండి జరిగిపించారు. ఈ పార్టీకి పరిశ్రమలోని తమ మిత్రులు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. ఆర్టిస్ట్ నిఖిల్ చైతన్య పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు. నిఖిల్ మిత్రులు వెంకట చైతన్య, నిహారికతో దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.
Niharika Konidela
ఈ పార్టీలో నిహారిక రెడ్ ఫ్రాక్ ధరించి సూపర్ స్టైలిష్ గా తయారయ్యారు. తన ప్రియమైన భర్త పుట్టిన రోజు వేడుకలో ఆమె బాగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తుంది. పెద్దలు కుదిర్చిన వివాహం అయినప్పటికీ నిహారిక, చైతూ చాలా అన్యోన్యంగా ఉంటారు. ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవిస్తూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుభవిస్తున్నారు.
Niharika Konidela
నిహారిక బర్త్ డే సైతం చైతూ చాలా ప్రత్యేకంగా జరుపుతారు. మంచి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేస్తారు. అలాగే నిహారిక ఇష్టాలకు గౌరవమిచ్చి ఆమె నటిగా కొనసాగేందుకు సహకారం ఇస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా నిహారిక ఒకటి రెండు సిరీస్లు ప్రకటించారు. నటించడానికి అత్తింటి వారి నుండి తనకు అనుమతి ఉన్నట్లు నిహారిక తెలియజేశారు.
Niharika Konidela
అయితే ఈ మధ్య ఆమె కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. లేట్ నైట్ పార్టీలో పాల్గొన్న నిహారిక అధికారుల దాడిలో పట్టుబడ్డారు. ఆమెను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి విచారించడం జరిగింది. ఈ విషయంలో నిహారిక అనేక విమర్శలు ఎదుర్కొంది. నిహారిక కారణంగా నాగబాబు, పవన్ సోషల్ మీడియా ట్రోల్స్ కి గురయ్యారు.
అలాగే కొన్నాళ్ళు నిహారిక ఇంస్టాగ్రామ్ కి దూరమయ్యారు. ఆమె తన అకౌంట్ ని డీయాక్టివేట్ చేశారు. అత్తింటివారు చివాట్లు పెట్టడం వలనే నిహారిక ఇంస్టాగ్రామ్ కి దూరమయ్యారన్న వాదన వినిపించింది. కొన్ని రోజుల తర్వాత నిహారిక అకౌంట్ ని యాక్టీవ్ చేసి, వెలుగులోకి వచ్చారు. కాగా ఆమె తరచుగా సోషల్ మీడియా ట్రోల్స్ కి గురవుతున్నారు.
Niharika Konidela
ఈ మధ్య ఆమె ప్రెగ్నెంట్ అయ్యారంటూ కథనాలు వెలువడ్డాయి. నిహారిక అధికారికంగా ప్రకటించకున్నప్పటికీ... ఆమె సన్నిహితులకు ఈ విషయం తెలియజేసినట్లు తెలుస్తుంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం నిహారిక నటిగా, నిర్మాతగా కొనసాగుతున్నారు.