నిహారిక ఓటు ఎక్కడుంది? తన సపోర్ట్ ఎవరికి?... మెగా డాటర్ ఓపెన్ కామెంట్స్
ఏపీలో ఎన్నికల నగారా మోగింది. మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో మెగా డాటర్ నిహారిక పొలిటికల్ కామెంట్స్ చేసింది.

Niharika Konidela
నిహారిక కొణిదెల విడాకులు అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆమె నటిగా, నిర్మాత కొనసాగాలని అనుకుంటున్నారు. ఇటీవల నిహారిక కొన్ని ప్రాజెక్ట్స్ ప్రకటించింది. ఓ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న నిహారికకు పొలిటికల్ క్వచ్చన్స్ ఎదురయ్యాయి. త్వరలో ఏపీలో ఎన్నికలు జనసేనను మీరు ఎలా ప్రమోట్ చేయాలి అనుకుంటున్నారు? అని విలేకరి అడిగారు. ఈ ప్రశ్నకు నిహారిక ఆసక్తికర సమాధానం చెప్పింది.
నిహారిక మాట్లాడుతూ... నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. 2019లో ఎన్నికల్లో కూడా నేను ఏపీలో ప్రచారం చేశాను. గతంలో చెప్పినట్లే బాబాయ్ ఏం చేసినా మా సపోర్ట్ ఉంటుంది. ఈసారి కూడా తప్పకుండా ప్రచారం చేస్తాను... అని అన్నారు.
Niharika Konidela
మీ ఓటు ఎక్కడుందని అడగ్గా.. నా ఓటు ఆంధ్రలోనే ఉందని నిహారిక సమాధానం చెప్పింది. జనసేన ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. జనసేన-టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కాబట్టి మెగా కుటుంబ సభ్యులు ఈ రెండు పార్టీలకు ప్రచారం కల్పించాల్సి ఉంటుంది.
వరుణ్ తేజ్ సైతం ఇదే తరహా ఆన్సర్ చెప్పాడు. జనసేన తరపున ఎన్నికల్లో ప్రచారం చేస్తారా? అంటే దాని గురించి ఇంకా ఆలోచించలేదు. కానీ బాబాయ్ కి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఆదేశం కోసం వెయిటింగ్ అన్నారు. కాబట్టి వరుణ్ తేజ్ కూడా ఈసారి ప్రచార సభల్లో కనిపించే అవకాశం ఉంది.
Nagababu
వరుణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ సైతం పాల్గొంటారంటూ ప్రచారం జరుగుతుంది. పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది. ముఖ్యంగా జనసేన అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో మెగా ఫ్యామిలీ ప్రచారం చేసే అవకాశం కలదు. ఇక నాగబాబు జనసేన తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు సమాచారం..