MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Niharika: ఆయన ఆ మాట అన్నారంటే నిజంగానే తోపే.. చిరంజీవి, నాగబాబుకి సాధ్యం కానిది చేసి చూపించిన నిహారిక

Niharika: ఆయన ఆ మాట అన్నారంటే నిజంగానే తోపే.. చిరంజీవి, నాగబాబుకి సాధ్యం కానిది చేసి చూపించిన నిహారిక

నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు చిత్రం అద్భుతం చేసింది. 2 జాతీయ అవార్డులు గెలుచుకుంది. ఈ సందర్భంగా నిహారిక చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 20 2026, 05:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Niharika Konidela
Image Credit : Asianet News

Niharika Konidela

నిహారిక కొణిదెల ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు చిత్రం 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో 2 అవార్డులు గెలుచుకుంది. రెండు విభాగాల్లో కమిటీ కుర్రోళ్ళు చిత్రానికి జాతీయ అవార్డులు దక్కాయి. ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా ఒక అవార్డు, ఉత్తమ మేకప్ విభాగంలో మరో అవార్డు ఈ చిత్రానికి దక్కాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అప్పట్లో రుద్రవీణ సంచలనం
Image Credit : Asianet News

అప్పట్లో రుద్రవీణ సంచలనం

ఈ చిత్రంలో కొత్త కుర్రాళ్ళు నటించారు. వినోదం, సందేశం, రూటెడ్ ఎమోషన్స్ ఉండే ఈ చిత్రం ప్రేక్షకులని ఫిదా చేసింది. నేషనల్ అవార్డులు గెలుచుకోవడంలో నిహారిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నట్లు ఉంది. దాదాపు 38 ఏళ్ళ క్రితం నిహారిక తండ్రి నాగబాబు నిర్మించిన రుద్రవీణ చిత్రం ఏకంగా మూడు విభాగాల్లో జాతీయ అవార్డులు గెలుచుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిలిం నేషనల్ ఇంటిగ్రిటీ, బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఇలా మూడు విభాగాల్లో రుద్రవీణ చిత్రం జాతీయ అవార్డులు కొల్లగొట్టింది.

Related Articles

Related image1
OTT: ఓటీటీలోకి టొవినో థామస్ థ్రిల్లర్, మిడిల్ ఏడ్జ్ జంట రొమాంటిక్ సిరీస్ కూడా.. ఈ వారం సూపర్ ఫన్ పక్కా
Related image2
Pawan Kalyan: కన్నప్పగా పవన్ కళ్యాణ్, అది విని రాత్రంతా నిద్రలేదు.. సంచలన చిత్రం ఎందుకు ఆగిపోయిందో తెలుసా ?
35
నాగబాబు తర్వాత నిహారిక
Image Credit : our own

నాగబాబు తర్వాత నిహారిక

రుద్రవీణ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించారు. ఇప్పుడు నాగబాబు కుమార్తె నిహారిక నిర్మాతగా మారి కమిటీ కుర్రోళ్ళు చిత్రంతో జాతీయ అవార్డు గెలుచుకుంది. అయితే నాగబాబుకు, నిహారికకి ఓ తేడా ఉంది.రుద్రవీణ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. కమిటీ కుర్రోళ్ళు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. యదువంశీ ఈ చిత్రానికి దర్శకుడు.

45
నాగబాబు తర్వాత నిహారిక
Image Credit : our own

నాగబాబు తర్వాత నిహారిక

జాతీయ అవార్డు గెలుచుకున్న తర్వాత నిహారిక మీడియాతో మాట్లాడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ మూవీకి నేషనల్ అవార్డు వచ్చింది అని తెలియగానే చిరంజీవి, సురేఖ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పుడు రుద్రవీణకి మీ నాన్న నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఇప్పుడు నువ్వు నేషనల్ అవార్డు అందుకోబోతున్నావు. మన ఫ్యామిలీకి నువ్వు సాధించిన ఘనత గర్వకారణం అని చిరంజీవి గారు అన్నారు.

55
ఆయనే అన్నారంటే నేను తోపునే
Image Credit : Asianet News

ఆయనే అన్నారంటే నేను తోపునే

చిరంజీవి గారు ఇండస్ట్రీకి తోపు లాంటి వ్యక్తి. ఆయన నన్ను తోపు అంటుంటే నేను నిజంగానే తోపు అని ఫీల్ అవుతున్నట్లు నిహారిక పేర్కొంది. నిహారిక గతంలో నటిగా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ ఇప్పుడు నిర్మాతగా సరికొత్త ప్రయత్నాలు చేస్తోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Anupama Parameswaran: హోటల్‌లో పెద్ద గొడవ? ధ్రువ్ విక్రమ్‌తో బ్రేకప్?.. అనుపమా పోస్ట్‌తో దుమారం
Recommended image2
Ram Charan: చిరంజీవికి ఉపాసన క్లోజ్‌ ఫ్రెండ్.. అది చాలా డేంజర్‌ అంటూ రామ్‌ చరణ్‌ షాకింగ్‌ కామెంట్‌
Recommended image3
The Odyssey 3 Days Collections: ఇండియాలో దుమ్ములేపుతున్న ఒడిస్సీ.. 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఎంత రాబట్టిందంటే?
Related Stories
Recommended image1
OTT: ఓటీటీలోకి టొవినో థామస్ థ్రిల్లర్, మిడిల్ ఏడ్జ్ జంట రొమాంటిక్ సిరీస్ కూడా.. ఈ వారం సూపర్ ఫన్ పక్కా
Recommended image2
Pawan Kalyan: కన్నప్పగా పవన్ కళ్యాణ్, అది విని రాత్రంతా నిద్రలేదు.. సంచలన చిత్రం ఎందుకు ఆగిపోయిందో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved