- Home
- Entertainment
- మెగా డాటర్ నిహారిక ఫస్ట్ రెమ్యూనరేషన్ డిటెయిల్స్.. నాన్న నాగబాబుకి, అమ్మకి ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఏంటో తెలుసా?
మెగా డాటర్ నిహారిక ఫస్ట్ రెమ్యూనరేషన్ డిటెయిల్స్.. నాన్న నాగబాబుకి, అమ్మకి ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఏంటో తెలుసా?
మెగా డాటర్ నిహారిక.. టీవీ షోతో కెరీర్‌ని ప్రారంభించింది. అయితే ఆ షోకి ఆమె ఎంత పారితోషికం తీసుకుంది. ఆ డబ్బుని ఏం చేసిందనే ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది.

నిహారిక.. స్టడీస్ పూర్తయ్యాక టీవీ రంగంలోకి అడుగు పెట్టింది. చిన్నప్పట్నుంచి సినిమా ప్రపంచంలో పెరగడంతో ఆటోమెటిక్‌గా తనకు సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. అందుకే ఆ రంగంలోకే అడుగుపెట్టింది. ఆమె మొదట టీవీ షో చేసింది. `ఢీ జూనియర్` షోకి యాంకర్‌గా వర్క్ చేసింది. దీనికి నాగబాబు జడ్జ్ గా ఉన్నారు. తండ్రి సపోర్ట్ గా ఆమె యాంకర్‌గా మెప్పించే ప్రయత్నం చేసింది.
సుమారు ఏడాదికిపైగానే యాంకర్‌గా పని చేసింది నిహారిక. అయితే ఈ షో చేయడానికి ఆమె అందుకున్న మొదటి పారితోషికం వివరాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడిచింది. `ఢీజూనియర్` షోకి తాను అందుకున్న మొదటి పారితోషికం 20వేలు అని తెలిపింది. ఎపిసోడ్‌కి 20కే ఇచ్చేవారని తెలిపింది. అప్పట్లో తాను పెద్దగా డిమాండ్ చేయలేదని, ఇచ్చినంత తీసుకున్నట్టు తెలిపింది. తనకు ఇచ్చింది తక్కువేం కాదని వేరే చెప్పక్కర్లేదు.
నిహారిక 2015లో `ఢీ జూనియర్` షో చేసింది. ఆ సమయంలో ఎపిసోడ్‌కి 20వేలు అంటూ తక్కువేం కాదు. మంచిగానే దక్కిందని చెప్పొచ్చు. వెనకాల ఫాదర్ నాగబాబు ఉండటంతో ఆమెకి బాగానే వర్కౌట్ అయ్యిందట. అయితే వచ్చిన డబ్బుని జల్సాలకు ఖర్చు చేయలేదట. వాటి నాన్న నాగబాబుకి ఇచ్చిందట. ఆయన తన పేరుతో సేవ్ చేశాడని వెల్లడించింది.
ఇక ఈ షో ద్వారా వచ్చిన మొత్తంతో నిహారికా ప్రొడక్షన్ బ్యానర్‌ని ప్రారంభించింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో ప్రొడక్షన్ ప్రారంభించి `ముద్దపప్పు ఆవకాయ్` అనే వెబ్ సిరీస్‌ని నిర్మించింది. ఇందులో యాక్ట్ చేసింది కూడా. ఆ వెబ్ సిరీస్ బాగా ఆదరణ పొందింది. తెలుగులో మంచి ప్రశంసలు అందుకుంది. దీంతో వరుసగా `నాన్న కూచి`, `మ్యాడ్ హౌజ్`, `ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ`, `హలో వరల్డ్`, `డెడ్ పిక్సెల్స్` వంటి వెబ్ సిరీస్ నిర్మించింది నిహారిక.
అయితే నిహారిక తనకు వచ్చిన పారితోషికంతో అమ్మా నాన్నలకు గిఫ్ట్ లు ఇచ్చిందట. నాన్ననాగబాబుకి వెంటనే ఒక హెడ్ ఫోన్ కోనిచ్చిందట. తమకి ఇంట్లో ఒక్కటే టీవీ ఉండేదట. నాన్న ఎప్పుడూ అందులోనే పాటలు పెట్టుకుని వింటుండేవాడు, తమకి టీవీ చూసే అవకాశం వచ్చేది కాదు. దీంతో హెడ్ ఫోన్ కోనిస్తే ఫోన్ లో పాటలు వింటూ రిలాక్స్ అయ్యేవాడని, అమ్మ నేను ఎంచక్క టీవీ చూసుకునేవాళ్లమని తెలిపింది నిహారిక. తనకి ముక్కు పుడక అంటే చాలా ఇష్టం. అందుకే అమ్మకి గోల్డ్ ముక్కుపుడక గిఫ్ట్ గా ఇచ్చినట్టు తెలిపింది.
Niharika Konidela
నిహారికకి హీరోయిన్‌గా నిరూపించుకోవాలనే కోరిక ఉంది. దీంతో ఆమె `ఒక మనసు` చిత్రంతో హీరోయిన్‌గా మారింది. నాగశౌర్యతో కలిసి నటించింది. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ `ఓరు నల్ల నాల్ పాథు సోల్రెన్` చిత్రంలో నటించింది. అది సక్సెస్ ఇవ్వలేదు. ఇలా `హ్యాపీ వెడ్డింగ్`, `సూర్యకాంతం` చిత్రాలు చేసినా ప్రయోజనం లేదు. ఇక చివరగా పెదనాన్న చిరంజీవి హీరోగా రూపొందిన `సైరా`లో చిన్న పాత్రలో మెరిసింది. ఇలా ఏదీ సక్సెస్ ఇవ్వలేదు. దీంతో పెళ్లిచేసుకుంది.
నిహారిక.. చైతన్య జొన్నలగడ్డని 2020 డిసెంబర్9న రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ కోటలో చాలా గ్రాండ్‌గా వివాహం చేసుకుంది. కానీ ఈ ఇద్దరు రెండేళ్లకే విడాకులు తీసుకున్నారు. 2023 జులైలో తమ విడాకులను ప్రకటించారు.
Niharika Konidela
విడాకుల తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుంది నిహారిక. ఇటీవలే ఆమె తన ప్రొడక్షన్‌ని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీగా మార్చి, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ ప్రొడక్షన్ పతాకంపై తాజాగా కొత్త సినిమాని స్టార్ట్ చేసింది. దీన్ని ఆమె ప్రొడ్యూస్ చేస్తుంది. మరోవైపు `సాగు` అనే చిన్న సినిమాని నిర్మించింది. నటిగానూ రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుందీ మెగా డాటర్.