- Home
- Entertainment
- నిహారిక మాజీ భర్త చైతన్య బర్త్ డే పోస్ట్.. నెటిజన్ల రియాక్షన్ కి నోరెళ్ల బెట్టాల్సిందే!
నిహారిక మాజీ భర్త చైతన్య బర్త్ డే పోస్ట్.. నెటిజన్ల రియాక్షన్ కి నోరెళ్ల బెట్టాల్సిందే!
మెగా డాటర్ నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ నేను పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆయన పెట్టిన పోస్ట్ పై నెటిజన్లు రియాక్ట్ అవుతున్న తీరు ఆశ్చర్యపరుస్తుంది.

నిహారిక, చైతన్య జొన్నలగడ్డ వివాహం 2020 డిసెంబర్ 9న రాజస్థాన్ ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో చాలా గ్రాండ్‌గా జరిగింది. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వివాహ వేడుకకి హాజరయ్యారు. చాలా లావిష్‌గా అత్యంత గ్రాండియర్ వేలో ఈ మ్యారేజ్ జరగడం విశేషం. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. చైతన్య.. ఐజీ జే ప్రభాకర్ రావు కుమారుడు అనే విషయం తెలిసిందే.
పెళ్లికి ముందు నుంచే చైతన్య, నిహారిక మంచి స్నేహితులు. స్నేహం ప్రేమ వైపు మరిలే సమయంలోనే మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా ఈ ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. దాదాపు రెండేళ్లు బాగానే ఉనారు. కానీ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. కారణాలు తెలియనప్పటికీ ఇద్దరికి సెట్ కావడం లేదని, ఇద్దరు భిన్న నేపథ్యాలకు చెందిన వారు కావడంతో పరిస్థితులు అర్థం కావడానికి, అర్థం చేసుకోవడంలో ఇబ్బంది తలెత్తిన నేపథ్యంలో గ్యాప్ పెరిగిందని, దీంతో విడాకుల వైపు అడుగులు వేసినట్టు తెలుస్తుంది.
ఈ నెలలోనే తమ విడాకులను ప్రకటించిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరు దూరంగా ఉంటున్నారనే వార్తలొచ్చాయి. ఆ తర్వాత చైతన్య.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోలుడిలీట్ చేశాడు. తర్వాత నిహారిక కూడా పెళ్లి ఫోటోలు, చైతన్యతో ఉన్న ఫోటోలను డిలీట్ చేసింది. ఈ నెల 5న అటు చైతన్య, ఇటు నిహారిక పరస్పరం తమ అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్టు తెలిపారు. తమకు పైవసీ ఇవ్వాలని వేడుకున్నారు.
ఇదిలా ఉంటే విడాకులు తీసుకున్నాక చైతన్య మొదటిసారి తన బర్త్ డే జరుపుకుంటున్నారు. నేడు ఆయన 33వ బర్త్ డే చేసుకున్నారు. వెకేషన్‌లో ఉన్న ఫోటోని పంచుకుంటూ తన బర్త్ డే విషయాన్ని తన ఫాలోవర్స్ తో పంచుకున్నాడు చైతన్య జొన్నలగడ్డ. అన్నీ మూళ్లు స్టయిల్‌గా తీసుకువస్తున్నట్టు తెలిపారు. ఆయన పోస్ట్ వైరల్ అవుతుంది. అభిమానులను ఆకట్టుకుంటుంది. మరోవైపు వెకేషన్‌లో స్టయిల్ గా కూర్చొన్న తీరు కూడా ఆకట్టుకుంటుంది.
అయితే చైతన్య జొన్నలగడ్డ పోస్ట్ పై నెటిజన్ల రియాక్షన్ షాకింగ్‌గా అలా ఉంది. విడిపోయి మంచి పనిచేశావని, ఇప్పుడు ఫ్రీ అయ్యావని, ఇప్పుడు ఎంజాయ్ చేయమంటున్నారు.నువ్వు ఎంతో లక్కీ పర్సన్ అని, డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చిన మీ ఇద్దరికి సెట్ కాదని, నీ జీవితం బాగుపడినట్టే అని అంటున్నారు. ఆయనకు మద్దతుగా పోస్ట్ లు పెడుతున్నారు. ఇండైరెక్ట్ గా నిహారికకి డైవర్స్ ఇచ్చి మంచి పనే చేశావని కామెంట్లు చేయడం విశేషం.
Niharika konidela
విడాకుల తర్వాత నిహారిక ఫ్రీ బర్డ్ లా ఎంజాయ్ చేస్తుంది. ఆమె దుస్తులు, గ్లామర్ షో అంతా ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. మరోవైపు వెబ్ సిరీస్‌లు నిర్మిస్తుంది. నటిగానూ రెడీ అవుతుంది. మొత్తంగా తనలోని కొత్త వెర్షన్ చూపిస్తుంది నిహారిక.