Nidhi Agarwal: అందుకే నిధి అగర్వాల్ ఎక్కువ సినిమాలు చేయడంలేదట, ఎందుకో తెలుసా...?
టాలీవుడ్ స్టార్ బ్యూటీస్ లో నిధి అగర్వాల్ ది స్పెషల్ ఇమేజ్. ఇస్మార్ట్ బ్యూటీగా తన ప్లేస్ ను టాలీవుడ్ లో పదిలం చేసుకుంది నిధి. అయితే తాను సూపర్ ఫాస్ట్ గాసినిమాలు చేయకపోవడానికి కారణం చెపుతుంది కన్నడ కస్తూరి.
టాలీవుడ్ లోని గ్లామరస్ హీరోయిన్స్ లో నిధి అగర్వాల్ ఒకరు. నాగచైతన్య జోడీగా సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కన్నడ సుందరి తెలుగు తెరకి పరిచయమైంది కాని మొదట్లో సక్సెస్ లు మాత్రం అందుకోలేకపోయింది. చైతూ సరసన ఆమె చేసిన సవ్యసాచి సినిమా ప్లాప్ అయ్యింది.
ఆ వెంటనే చైతూ తమ్ముడు అఖిల్ జోడీగా మిస్టర్ మజ్ను సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అయితే ఆ సినిమా కూడా ఆమెకి నిరాశనే మిగిల్చింది. అయితే టాలీవుడ్ లో నిధి అగర్వాల్ కెరీర్ ను టర్న్ చేసిన సినిమా ఇస్మార్ట్ శంకర్. రామ్ జోడీగా ఇస్మార్ట్ శంకర్ లో నిధి యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి.
ఈ సినిమాతో నిధి టాలీవుడ్ లో ఇస్మార్ట్ బ్యూటీ అయిపోయింది. అటు తమిళ్ లో కూడా వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. అయితే ఈ మధ్య హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిధి అగర్వాల్ చేతిలో ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమా ఉంది. అయితే చాలా మంది మీరోయిన్లు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్నారు. నాన్ స్టాప్ గా సినిమాలు చేసుకుంటూ చేతినిండా
సంపాదించుకుంటున్నారు.
అయితే కావలసినంత గ్లామర్ పెట్టుకుని కాలయాపన చేయడానికి కారణమేమిటనే ప్రశ్న నిధి అగర్వాల్ కు ఎదురైంది. అందుకు ఆమె స్పందిస్తూ .. డిఫరెంట్ సమాధానం ఇచ్చింది. వరుస అవకాశాలు వస్తున్నాయి కానీ నేనే ఒప్పుకోవడం లేదు. దూకుడుగా వచ్చిన సినిమానల్లా చేసుకుంటూ పోతే ఎంత త్వరగా క్రేజ్ వస్తుందో అంతే త్వరగా పోతుందని క్లియర్ గా చెప్పేస్తుంది.
అందువలన నిదానమే ప్రధానమన్నట్టుగా ఒక్కో సినిమాను చేసుకుంటూ వెళదామనే అనుకున్నాను. అలా అయితేనే నిలబడతామని నా నమ్మకం అంటోంది నిధి. ఇక్కడ సక్సెస్ కావాలంటే సహనం ఉండాలి .. మంచి పాత్రల కోసం ఎదురుచూడాలనేది నా అభిప్రాయం అని చెప్పుకొచ్చింది.
స్టార్ జోడీగా అని చూడకుండా మంచి కథను ఎంచుకుని తనకు మంచి క్యారెక్టరైజేషన్ ఉన్న సినిమాను చేస్తే కెరీర్ బాగుంటుందని నమ్ముతుంది నిథి. అందుకే ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా మంచి సినిమాలు ఎంచుకుని మరీ చేస్తోంది బ్యూటీ.