- Home
- Entertainment
- షాకిస్తున్న నిధి అగర్వాల్ నయా లుక్.. ట్రాన్స్ఫరెంట్ శారీలో పిచ్చెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ..
షాకిస్తున్న నిధి అగర్వాల్ నయా లుక్.. ట్రాన్స్ఫరెంట్ శారీలో పిచ్చెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ..
`ఇస్మార్ట్` బ్యూటీ నిధి అగర్వాల్ గత కొన్ని రోజులుగా సైలెంట్ అయ్యింది. అంతకు ముందు హాట్ హాట్ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లని నిత్యం ఎంగేజ్ చేసింది. అయితే మళ్లీ ఈ మధ్య సందడి స్టార్ట్ చేసింది.

ఇస్మార్ట్ బ్యూటీగా పేరుతెచ్చుకున్న నిధి అగర్వాల్(Nidhhi Agerwal) లేటెస్ట్ గా షాకింగ్ లుక్‌లోకి మారిపోయింది. పిచ్చెక్కించే అందాలతో కుర్రాళ్లకి మైండ్ బ్లాంక్ చేసే ఈ భామ లావుగా కనిపించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరోవైపు ట్రాన్ఫ్సరెంట్ శారీలో కనువిందు చేస్తుంది నిధి అగర్వాల్. తనలోని హాట్‌నెస్ మాత్రం మరింత ఓవర్‌లోడ్ కావడం విశేషం.
ఎప్పుడో ఒప్పుకున్న సినిమాలే చేస్తుంది Nidhhi Agarwal కొత్తగా ఆమెకి ఛాన్స్ లు రాకపోవడం గమనార్హం. `ఇస్మార్ట్ శంకర్` సక్సెస్‌లో ఇక తిరుగుండదని అంతా భావించారు. కానీ ఒకటి రెండు సినిమాలతోనే ఈ అమ్మడు ఔట్ డేటెడ్ కావడం విచారకరం. మరి పవన్‌తో చేస్తున్న సినిమా హిట్ అయితే ఈ అమ్మడి రేంజ్ మారిపోతుందని చెప్పొచ్చు. దీంతో `హరి హర వీరమల్లు` కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంది నిధి అగర్వాల్.
నిధి అగర్వాల్ బొద్దుగా మారింది. బాగా లావెక్కింది. ఓ రకంగా గుర్తు పట్టలేనట్టుగానూ మారిపోయింది. హాట్ అందాల వన్నెమాత్రం ఏమాత్రం తగ్గలేదు. అదే హాట్, అదే నాటు అనేలా ఉంది. స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో వైట్ శారీలో కనువిందు చేస్తుంది. కొత్త ఫోటో షూట్‌తో నెటిజన్లకి మతిపోగొడుతుంది నిధి అగర్వాల్. ప్రస్తుతం ఆమె నయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే తమిళ సినిమా కోసం ఆమె బొద్దుగా మారినట్టు తెలుస్తుంది. Nidhhi Agerwal Hot Photos.
నిధి అగర్వాల్ ప్రస్తుతం తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తుంది. `హరిహర వీరమల్లు` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. చాలా కాలంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. కథ పరంగా మార్పుల నేపథ్యంలో షూటింగ్ ని వాయిదా వేసినట్టు తెలుస్తుంది. అయితే ఆగస్ట్ నుంచి మళ్లీ షూటింగ్‌ని ప్రారంభించబోతున్నారట.
ఈ సినిమా కోసం ఎన్నో ఆశలతో ఉంది నిధి అగర్వాల్. ఇది ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుందనేదానిపై క్లారిటీ లేదు. మరోవైపు తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి ఓ సినిమా చేస్తుంది. `కలగ థైలవన్` పేరుతో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పబోతుందట.ఆమె వాయిస్ బాగుండటంతో మేకర్స్ ఆమెతో డబ్బింగ్ చెప్పించాలని భావిస్తున్నారట. ఫస్ట్ టైమ్ తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకోబోతుంది నిధి.
ఇక చివరగా ఈ హాట్ బ్యూటీ తెలుగులో `హీరో` చిత్రంలో మెరిసింది. మహేష్‌బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా రూపొందిన చిత్రమిది. ఈ చిత్రం మిశ్రమ స్పందన రాబట్టుకుంది. ఈ సినిమా ఈ అమ్మడికి మైనస్సే కానీ ప్లస్ కాలేకపోయింది.