నిధి అగర్వాల్‌కి గుడి కట్టి పాలాభిషేకం చేసిన ఫ్యాన్స్.. అమ్మడి క్రేజ్‌ మామూలుగా లేదుగా!

First Published Feb 15, 2021, 9:03 PM IST

హాట్‌ అందాల భామ నిధి అగర్వాల్‌కి అరుదైన అభిమానాన్ని పొందింది. ఈ అమ్మడికి ఫిదా అయిన అభిమానులు ఏకంగా గుడి కట్టుకున్నారు. గుండెల్లో నింపుకున్నా సరిపోదని ఏకంగా విగ్రహ ప్రతిష్ట చేశారు. ఆమెకి పాలాభిషేకం చేశారు. పూజలు చేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా తమ ప్రేమని వ్యక్తం చేశారు. ఈ అరుదైన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.