- Home
- Entertainment
- నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్న `ఇస్మార్ట్` భామ నిధి అగర్వాల్.. కారణం తెలిస్తే ఫిదా అవుతారు?
నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్న `ఇస్మార్ట్` భామ నిధి అగర్వాల్.. కారణం తెలిస్తే ఫిదా అవుతారు?
నేషనల్ క్రష్‌గా ఇప్పటి వరకు రష్మిక మందన్నాని పిలుస్తుంటారు. ఆమె అభిమానులు ముద్దుగా సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ అంటుంటారు. కానీ ఆమెకి పోటీనిస్తుంది `ఇస్మార్ట్` భామ నిధి అగర్వాల్. ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది.

నేషనల్ క్రష్ నిధి అగర్వాల్ అంటూ నిన్న(మంగళవారం) మొత్తం సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అందుకు కారణంగా నిన్న నిధి బర్త్ డే.
`nationalcrushnidhhi` అనే ట్యాగ్ ట్విట్టర్‌లో దాదాపు ఎనిమిది గంటలపాటు ట్రెండ్ అవడం విశేషం. దీంతో నిధి ఫాలోయింగ్‌కి నెటిజన్ల మైండ్ బ్లాక్ అయిపోతుంది. సినీ స్టార్స్ సైతం అవాక్కవుతున్నారు.
ఇంతగా ట్రెండ్ కావడానికి మరో కారణం కూడా ఉంది. ఆమె తన బర్త్ డే వేడుకులను వృద్దులతో కలిసి జరుపుకోవడం. నిధి అగర్వాల్ తన బర్త్ డేని ఓల్డేజ్ హోమ్ జరుపుకుంది. దీంతో అందరి హృదయాలను గెలుచుకుంది.
అందుకే ఆమె అభిమానులు సోషల్ మీడియాలో నిధిని ట్రెండ్ చేస్తున్నారు. ఆమె వృద్ధులతో షేక్ హ్యాండ్ ఇస్తూ దిగిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. అందరి మనసులను గెలుచుకుంది.
నిధి అగర్వాల్ అంటే అందాలే గుర్తొస్తాయి. కానీ తనలోని మరో యాంగిల్ ఉందని సమయం చిక్కినప్పుడల్లా నిరూపిస్తుంది. సెకండ్ వేవ్ టైమ్‌లో కరోనా రోగులకు తనవంతు సాయాన్ని అందించింది. పేదలకు నిత్యావసర సరుకులు అందజేసింది.
మరోవైపు నిధి అభిమానులు తమిళనాడులో ఏకంగా విగ్రహామే కట్టారు. ఆ విగ్రహానికి పాలాభిషేకం చేయడం ఆ మధ్య హాట్ టాపిక్‌గా మారింది. నిధి క్రేజ్‌కిది నిదర్శనంగా నిలుస్తుంది.
`ఇస్మార్ట్ శంకర్` చిత్రంతో పాపులర్ అయిన నిధి అగర్వాల్ ఆ పాపులారిటీని కరెక్ట్ గా వాడుకుంటోంది నిధి. ఆ సినిమా వరుసగా భారీ ఆఫర్స్ ని సొంతం చేసుకుంటుంది. టాలీవుడ్, కోలీవుడ్‌లో దూసుకుపోతుంది.
ప్రస్తుతం నిధి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో `హరిహరవీరమల్లు`లో నటిస్తుంది. అలాగే `హీరో` చిత్రంతో గల్లా అశోక్ తో నటిస్తుంది. దీంతోపాటు తమిళంలో ఓ సినిమా చేస్తుంది. ఇదే కాదు సోనూసూద్‌తో ఓ స్పెషల్ వీడియో సాంగ్‌ని చేసింది నిధి. `సాత్ కియా నిభోగే` పాటలో తనదైన స్టెప్పులతో మెస్మరైజ్ చేస్తుంది. ఇది ఇటీవల విడుదలై యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.