'రాజా సాబ్' పై ఆ వార్తలు ఫేక్, నమ్మి మోసపోకండి, సంస్ద ప్రకటన
మారుతి దర్శకత్వంలో రాబోతోన్న రాజా సాబ్‌లో ప్రభాస్ వింటెజ్ లుక్ తో అదరకొడుతున్నారు. కల్కి తర్వాత ఈ సినిమాకు ఓ రేంజిలో హైప్ క్రియేట్ అవ్వటం ఖాయం.

కల్కి చిత్రం సూపర్ హిట్ అవటంతో ప్రభాస్ అభిమానులు దృష్టి ఆయన తదుపరి రిలీజ్ పై పడింది. ఆ సినిమా మరేదో కాదు రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో రూపొందుతునత్న ఈ చిత్రం అప్డేట్లు లేక అభిమానులు గోలెత్తిపోతున్నారు. కల్కి హోరులో అప్డేట్స్ ఇచ్చినా ఫలితం ఉండదని ఆగారు. ఇప్పుడు మళ్లీ షూట్ మొదలైందని తెలిసింది. అయితే ఈ సినిమాని చూపెట్టి కొంతమంది జనాలను మోసం చేయాలనుకుంటున్నారు. ఆ విషయంలో అప్రమత్తంగా ఉండమని నిర్మాణ సంస్ద పీపుల్స్ మీడియా వారు ప్రకటన రిలీజ్ చేసారు. ఇంతకీ ఏమిటా విషయం..
Prabhas starrer Raja aab
మారుతి దర్శకత్వంలో రాబోతోన్న రాజా సాబ్‌లో ప్రభాస్ వింటెజ్ లుక్ తో అదరకొడుతున్నా. డార్లింగ్ ప్రభాస్ వింటేజ్ లుక్ చూసాక, కామెడీ టైమింగ్ మారుతి సరిగ్గా ప్రజెంట్ చేస్తాడనే నమ్మకం అభిమానుల్లో కలిగింది. ఈ మూవీ మీద మొదలైనప్పుడు ఉన్నంత నెగెటివిటీ అయితే కనిపించడం లేదు. రాజా సాబ్ టైటిల్, గ్లింప్స్ బాగానే ఆకట్టుకుంది. లుంగీతో ప్రభాస్‌ను చూపించి అభిమానుల్ని ఆకట్టుకుంటున్నారు. అలాగే కల్కిలోనూ ప్రభాస్ కామెడీతో అదరకొట్టారు.
The Raja Saab Movie
రాజా సాబ్ మూవీలో ప్రభాస్ లేని కీలక సన్నివేశాలను చిత్ర టీమ్ ప్రస్తుతం తెరకెక్కిస్తుంది. అయితే కల్కి మూవీ విడుదల అయ్యి ప్రభాస్ ఫ్రీ అవ్వడంతో రాజా సాబ్ షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇది పక్కనబెడితే ఇప్పుడు ఈ మూవీ పేరుచెప్పి కొందరు ఫేక్ ఆడిషన్స్ చేస్తున్నారట. ఇది నిర్మాతలకు తెలిసి అలెర్ట్ చేశారు.
Raja Saab
'రాజాసాబ్ మూవీ ఆడిషన్స్ గురించి కొన్ని వార్తలు సర్క్యూలేట్ అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అయితే అదంతా ఫేక్. ఒకవేళ నిజంగా ఉంటే మేమే ప్రకటిస్తాం' అని నిర్మాతలు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. కాబట్టి రాజా సాబ్ కు ఆడిషన్స్ అంటే నమ్మవద్దు..పరుగెత్తుకు వెళ్లద్దు. అది నిజమా కాదా అనేది చూసుకుని ముందుకు వెళ్లండి.
మొదట ఈ సినిమాను తెలుగులో మాత్రమే విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. కానీ ప్రభాస్ పాన్ వరల్డ్ లెవల్లో ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా టైటిల్‌ను ఛేంజ్ చేశారు. మొదట ‘రాజా డీలక్స్’ అని ఉన్న ఈ టైటిల్‌ను రాజా సాబ్ అని మార్చారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో మెరవనున్నారు.
ఈ మూవీ హారర్ కామెడీ నేపథ్యంలో ఉంటుందన్న రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. మామూలుగా అయితే ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని పీపుల్స్ మీడియా సంస్ద భావించింది. కానీ పరిస్థితుల్ని చూస్తుంటే రాజా సాబ్ వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయ్యేలా ఉంది.
అయితే... ఈ సినిమా అనౌన్స్ చేయడానికి ఎన్నో రోజుల ముందు నుంచి మేకింగ్‌లో ఉంది. ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ సెట్స్ మీదకు వెళ్ళింది. అయితే... ప్రభాస్ చేతిలో 'ఆదిపురుష్', 'సలార్', 'కల్కి 2989 ఏడీ' మూవీస్ కూడా ఉండటంతో అనౌన్స్ చేయలేదు. 'ఆదిపురుష్', 'సలార్' కంప్లీట్ చేశాక 'రాజా సాబ్' సినిమా చిత్రీకరణకు బల్క్ డేట్స్ ఇస్తానని ప్రభాస్ ప్రామిస్ చేశారని అది పూర్తిగా నెరవేరదు. మరో ప్రక్క 'సలార్ 2'కు ఆయన డేట్స్ ఇచ్చారు.
రాజా సాబ్ షూటింగ్, సినిమా కంప్లీట్ చేయడం విషయంలోనే కాదు... రిలీజ్ డేట్ పరంగా కూడా 'సలార్ 2' వల్ల 'రాజా సాబ్' వెనక్కి వెళ్లే పరిస్థితి కనబడుతోందని ట్రేడ్ టాక్. సలార్ 2'ను ఈ ఏడాది క్రిస్మస్ సీజన్ రిలీజ్ చేస్తే... ఆ వెంటనే సంక్రాంతికి 'రాజా సాబ్' రిలీజ్ చేయడం కష్టం. చిరంజీవి హీరోగా ప్రభాస్ కజిన్ ప్రమోద్ కూడా ఓ నిర్మాతగా చేస్తున్న 'విశ్వంభర'ను సంక్రాంతి బరిలో విడుదల చేయడానికి రెడీ చేస్తున్నారు. దాంతో 'రాజా సాబ్' వెనక్కి వెళ్ళినట్టే అని అంటున్నారు.
మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. రాజా సాబ్ లో ఒకప్పటి వింటేజ్ ప్రభాస్ ను చూస్తారని మారుతి ప్రతిసారీ ఊరిస్తున్నాడు. దీంతో మామూలుగానే రాజా సాబ్ మీద అంచనాలేర్పడ్డాయి. ఇప్పుడు కల్కి రిజల్ట్ చూశాక రాజా సాబ్ కు ఉన్న డిమాండ్ ఎక్కువైంది. కల్కి తర్వాత రాజా సాబ్ రైట్స్ రైట్స్ కు ఈ రేంజ్ లో డిమాండ్ ఉంటుందనేది మాత్రం ఎవరూ ఊహించలేదు.