- Home
- Entertainment
- పుట్టిన రోజున ‘కత్రినా కైఫ్’పై కొత్త రూమర్.. నిజమేనా? బాలీవుడ్ స్టార్స్ బెస్ట్ విషెస్..
పుట్టిన రోజున ‘కత్రినా కైఫ్’పై కొత్త రూమర్.. నిజమేనా? బాలీవుడ్ స్టార్స్ బెస్ట్ విషెస్..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif) పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్ స్టార్స్ తమ బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. అయితే బర్త్ డే రోజున తనపై కొత్త రూమర్ ఇంటర్నెట్ లో పుట్టుకొచ్చింది.

బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ తాజాగా 39 ఏటా అడుగుపెట్టింది. తన భర్తతో మాల్దీవ్స్ లో బర్త్ డే సెలబ్రేషన్స్ ను ఈ రోజు గ్రాండ్ గా జరుపుకుంది. కత్రినా కైఫ్ హంకాంగ్ లో జూలై 16 1983లో జన్మించింది. బ్రిటిష్ పౌరసత్వం కలిగిన నటి కావడం విశేషం. తనకు మొత్తం ఏడుగురు తోబుట్టువులు ఉన్నారు.
కత్రినా కైఫ్ ప్రస్తుతం ముంబయిలోనే నివస్తోంది. బాలీవుడ్ నటుడు విక్కీ కౌషల్ (Vicky Kaushal)ను గతేడాది డిసెంబర్ లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్తి తర్వాత ఈ బ్యూటీ కాస్తా సోషల్ మీడియా, సినిమాల జోరును తగ్గించింది. భర్తతో కలిసి వేకేషన్స్ కు వెళ్తూ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తోంది.
అయితే తన పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్ స్టార్స్ కరీనా కపూర్, సోనమ్ కపూర్, అనుష్క శర్మ తమ బెస్ట్ విషెస్ ను తెలియజేశారు. ఈ సందర్భంగా కత్రినా బెస్ట్ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బాలీవుడ్ స్టార్ సిద్ధాంత్ చతుర్వేది కత్రినాకు ‘ఫోన్ బూత్’ మూవీ సెట్స్ నుంచి వీడియోను పంచుకుంటూ బర్త్ డే విషెస్ తెలిపారు.
ఇదిలా ఉంటే కత్రినాపై కొత్త రూమర్ పుట్టుకొచ్చింది. పెళ్లి అయినా కేరీర్ కు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్న కత్రినా.. ఇటీవల సినిమాల జోరును మాత్రం తగ్గించింది. మరోవైపు సోషల్ మీడియాలలోనూ కనిపించడం లేదు. దీంతో పలువురు ఆమె ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయ్యిందంటూ ప్రచారం చేస్తున్నారు.
అందుకే ఎక్కువగా ఎలాంటి సినీ ఫంక్షన్స్, తన సినిమా ప్రమోషన్స్ లోనూ కనిపించకపోవడంతో ఆమెను అభిమానించే చాలామంది త్వరలో విక్కీ-కత్రినా శుభవార్త చెప్పబోతున్నారంటూ అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు నెట్టింట రూమర్ ను స్ప్రెడ్ చేస్తున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందేనని పలువురు అంటున్నారు.
ప్రస్తుతం కత్రినా కైఫ్ బాలీవుడ్ బాయ్ జాన్ సల్మాన్ ఖాన్ తో కలిసి ‘టైగర్ 3’లో నటిస్తోంది. అలాగే ‘మేరీ క్రిస్టమస్’లోనూ కనిపించనుంది. ఇప్పటికే తను పూర్తి చేసిన ‘ఫోన్ బూత్’ రిలీజ్ కు సిద్ధమైంది. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ మూవీలో సిద్దాంత్ చతుర్వేది కూడా నటిస్తున్నారు.