- Home
- Entertainment
- ఈవారం ఓటీటీలో రిలీజ్ కానున్న చిత్రాలు, సిరీస్ లు ఇవే.. మిస్ కాకుండా చూడాల్సినవి ఏవో తెలుసా
ఈవారం ఓటీటీలో రిలీజ్ కానున్న చిత్రాలు, సిరీస్ లు ఇవే.. మిస్ కాకుండా చూడాల్సినవి ఏవో తెలుసా
వాణి కపూర్, కాజోల్, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి క్రేజీ నటీనటులు నటించిన పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లో ఈ వారం ఓటీటీ వేదికలపై సందడి చేయబోతున్నాయి. వాటి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్, రిలీజ్ డేట్స్ ఇక్కడ తెలుసుకోండి.

OTT Releases
ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై ప్రేక్షకులను అలరించేందుకు పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో లాంటి ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ వీటిని విడుదల చేస్తున్నాయి. థ్రిల్లర్, డ్రామా, యాక్షన్, మిస్టరీ లాంటి విభిన్న జోనర్లకు చెందిన చిత్రాలు, సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్నవి
మండల మర్డర్స్ (Mandala Murders)
వాణీ కపూర్, వైభవ్ రాజ్ గుప్తా, సుర్వీన్ చావ్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ఒక చిన్న పట్టణాన్ని వణికించిన హత్యల మిస్టరీ నేపథ్యంలో రూపొందింది. ఓ డిటెక్టివ్, మాజీ పోలీస్ కలిసి కేసును ఛేదించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశారు అనేది ఈ సిరీస్ లో చూపించబోతున్నారు.
రిలీజ్ తేదీ: జూలై 25
లెటర్స్ ఫ్రమ్ ది పాస్ట్ ( Letters From The Past)
ఈ మిస్టరీ డ్రామాలో గోక్సే బహదిర్, ఒనూర్ టునా, సెలిన్ యెనించి ప్రధాన పాత్రలు పోషించారు. ఒక యువతి తన గతంలోని రహస్యాలను ఛేదించేందుకు పాత లేఖల ఆధారంగా నిజాలను వెతుకుతుంది.
రిలీజ్ తేదీ: జూలై 23
ది శాండ్ మాన్ సీజన్ 2 పార్ట్ 2 (The Sandman Season 2 Part 2)
టామ్ స్టర్ రిడ్జ్ నటించిన ఈ ఫాంటసీ సిరీస్ రెండవ భాగంలో, డ్రీమ్ తన కోల్పోయిన డ్రీమింగ్ సామ్రాజ్యాన్ని తిరిగి నిర్మించడానికి చేసిన ప్రయత్నాలను చూపిస్తారు.
రిలీజ్ తేదీ: జూలై 24
హ్యాపీ గిల్మోర్ 2 (Happy Gilmore 2)
అడమ్ సాండ్లర్ నటించిన ఈ గోల్ఫ్ కామెడీ చిత్రంలో, ఒక తండ్రి తన కుమారుడి కల నెరవేర్చేందుకు మళ్లీ గోల్ఫ్‌లోకి అడుగుపెడతాడు.
రిలీజ్ తేదీ: జూలై 25
ది విన్నింగ్ ట్రై (The Winning Try)
యూన్ క్యే-సాంగ్, లిమ్ సె-మీ, కిమ్ యో-హాన్ నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో, ఓ రగ్బీ ఆటగాడు కోచ్‌గా మారి తన పాత స్కూల్ టీంని ఎలా విజయాల బాటలో నడిపించాడు అనేది ఈ సిరీస్ లో ఆసక్తికరంగా ఉంటుంది.
రిలీజ్ తేదీ: జూలై 25
జియో హాట్ స్టార్ లో రిలీజ్ కానున్నవి
సర్జమీన్ (Sarzameen)
పృథ్వీరాజ్ సుకుమారన్, కాజోల్, ఇబ్రాహిం అలీ ఖాన్ నటించిన ఈ యాక్షన్ డ్రామాలో, ఓ ఆర్మీ ఆఫీసర్ కశ్మీర్‌లో తీవ్రవాదాన్ని అంతమొందించేందుకు ఎలా పోరాడాడు అనేది ఉత్కంఠ భరితంగా చూపించబోతున్నారు.
రిలీజ్ తేదీ: జూలై 25
రోంత్ (Ronth)
రోషన్ మాథ్యూ, దిలీష్ పోతన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మలయాళ పోలీస్ థ్రిల్లర్‌లో, ఇద్దరు పోలీసుల మధ్య సంబంధాలు, ఒత్తిడులు, మానసిక యుద్ధాల నేపథ్యంలో కథ నడుస్తుంది.
రిలీజ్ తేదీ: జూలై 22
ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానున్నవి
జస్టిస్ ఆన్ ట్రయల్ (Justice On Trial)
జూడీ షెయిన్‌డ్లిన్, గారన్ గ్రిగ్స్‌బీ, మార్కస్ హాన్సన్ నటించిన ఈ డాక్యుమెంటరీ సిరీస్‌లో అమెరికా న్యాయవ్యవస్థలోని ప్రముఖ కేసులను కోర్ట్ ట్రాన్స్క్రిప్ట్ ఆధారంగా పునఃసృష్టించి చూపిస్తారు.
రిలీజ్ తేదీ: జూలై 21
థియేటర్ లో రిలీజ్ కానున్న చిత్రాలు
హరిహర వీరమల్లు
జూలై 24న బాక్సాఫీస్ వద్ద భారీ విస్ఫోటనం ఉండబోతోంది. పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడిక్ చిత్రం హరిహర వీరమల్లు థియేటర్స్ రిలీజ్ కానుంది. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో కల్పిత కథతో డైరెక్టర్ క్రిష్, జ్యోతి కృష్ణ ఈ చిత్రాన్ని రూపొందించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా, బాబీ డియోల్ విలన్ గా ఈ చిత్రంలో నటించారు.
రిలీజ్ తేదీ : జూలై 24