New Movie Updates: శ్రీరామ నవమి సందర్భంగా కొత్త సినిమాలు, కొత్త పోస్టర్ల హంగామా.
పండగొస్తే చాలు కొత్త సినిమాలకు మంచి ఛాన్స్ దొరికినట్టే.. సరికొత్త అప్ డేట్స్ తో ఆ రోజంతా సందడి చేస్తుంటాయి అప్ కమింగ్ మూవీస్. ఇక ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ అయిన్ పోస్టర్లు.. అప్ డేట్స్ గురించి ఓ లుక్కేద్దాం..

శ్రీరామ నవమి సందర్భంగా స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకూ వరుసగా అప్ డేట్స్ ఇస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా మాస్ మహారాజ్ రవితేజ రామారావ్ ఆన్ డ్యూటీ నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు. శరత్ మండవ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈసినిమాలో దిశ్యాంష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది.
శ్రీరామ నవమి శుభాకాంక్షలతో కొత్త పోస్టర్ రిలీజ్ చేశాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. అల్లు అరవింద్ సమర్పణలో,బన్నీ వాసు నిర్మిస్తున్న వినరో భాగ్యము విష్ణుకథ నుంచి డిఫరెంట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్. నవమి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పోస్టర్ లో.. కిరణ్ పల్లెటూరి పండగవాతావరణం లుక్ లో కనిపించాడు. మురళి కిషోర్ అబ్బురూ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.
ఇక కమెడీ హీరో.. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా మిస్టర్ బెగ్గర్. కార్తిక్ మూవీ మేకర్స్ పతాకంపై బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, అద్వితి శెట్టి హీరో హీరోయిన్లుగా వడ్ల జనార్థన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా మిస్టర్ బెగ్గర్. ఈ మూవీ నుంచి శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్.
ఘంటా సతీష్ బాబు దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో వస్తున్న సిమిమా బటర్ ఫ్లై. జెన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్‌పై రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్‌గా వస్తున్న ఈ సినిమాకు అర్విజ్, గిడియన్ కట్టా సంగీతం అందిస్తున్నారు ఈ మూవీ నుంచి శ్రీ రామ నవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ ను రిలీజ్ చేవారు టీమ్.
రణ్ భీర్ కపూర్, ఆలియా భట్ జంటగా.. అమితాబ్, నాగార్జున లాంటి సీనియర్లు నటిస్తున్న బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్రా. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈమూవీ ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ 9న రిలీజ్ చేయబోతున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఈమూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు టీమ్.