సిగ్గులేదా... ఇలా చేస్తావా...? సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పై దారుణంగా ట్రోల్స్..? అంత తప్పేం చేసింది..?
సీతారామం సినిమాతో హిట్ కొట్టింది కాని మృణాల్ ఠాకూర్ నెటిజన్లతో తింట్లు కూడా తింటుంది. ఈ సినిమాలో క్లాసిక్ లుక్ తో అద్భుతంగా కనిపించిన మృణాల్ ను సొషల్ మీడియా జనాలు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు..?
Mrunal Thakur
సీతారామం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్.. అంతే కాదు మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ సాధించింది. అంతే కాదు అవ్వడానికి మరాఠీ అమ్మాయే అయినా.. ఈసినిమాతో తెలుగు అమ్మాయి అనిపించుకుంది మృణాల్. అంతే కాదు అంతే రేంజ్ లో ఫ్యాన్స్ ను కూడా సాధించుకుంది బ్యూటీ. వరుస ఆఫర్లు కూడా ఆమె గుమ్మం ముందు వాలుతున్నాయి.
మృణాల్ ఠాకూర్ అంటే సీత పాత్రలో క్లాసికల్ లుక్ లోనే మన ఆడియన్స్ కు తెలుసు కాని.. మృణాల్ మాత్రం సోషల్ మీడియాలో రెచ్చిపోయి స్కిన్ షో చేస్తుందని చాలా మంది ఊహించలేదు. సీతారామం సినిమాలో ఆమె క్యారెక్టర్ జనాలకు ఎక్కేసింది.దాంతో..ఆమెను చూస్తే సీతగానే అనుకుంటున్నారు.. సడెన్ గా ఆమెలో హాట్ యాంగిల్ చూసేసరికి.. ఎక్కిది కాస్త దిగిపోతుంది జనాలకు.
Image: Mrunal Thakur/Instagram
మృణాల్ ఠాకూర్ తన హద్దులు దాటి మరి ఫోటోషూట్ చేయడం ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా ఆమె చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సీతారామంలో రామ్ ప్రేయసిగా సీతామహాలక్ష్మి క్యూట్ గా చిలిపిగా కనిపించిన మృణాల్.. ఇలా చెత్త ఫోటోషూట్స్ చేస్తూ హాట్ ఎక్స్ పోజింగ్ చేయడం జనాలకు నచ్చడంలేదు. అందుకే ఆమెపై ఫైర్ అవుతున్నారు.
మృణాల్ చేసిన హాట్ పోటో షూట్స్ కు నెటిజన్స్ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు సీతామహాలక్ష్మి గా ఉంటేనే బాగుంటుంది మృణాల్ ఠాకూర్.. ఇలా చెత్త ఫోటోషూట్స్ చేయకు.. దయచేసి నీకు వచ్చే ఆఫర్లు కూడా పోతాయి అంటూ.. ఆమెకు సలహాలు ఇస్తున్నారు. కొంత మంది మాత్రం వల్గర్ కామెంట్స్ చేస్తూ... బూతులు తిడుతున్నారు .
ఇంత అందంగా పద్దతిగా కనిపించిన మృణాల్.. స్కిన్ షోలో రెచ్చిపోయి.. వేరే లెవల్ చూపిస్తుండటంతో.. ఆమె ఫ్యాన్స్ తట్టుకోలేక పోతున్నారు. ఇక మరాఠీ సీరియర్ నటిగా లైఫ్ స్టార్ట్ చేసిన మృణాల్.. హిందీలో రెండు మూడు సినిమాలు చేసింది...ఇక టాలీవుడ్ లో ఛాన్స్ రావడం.. హిట్ కొట్టడం కూడా అయిపోయింది. ఇక టాలీవుడ్ లో ఓమూడు సినిమాలు ఆమె లిస్ట్ లో చేరినట్టు తెలుస్తోంది.