- Home
- Entertainment
- పులికి ప్రభాస్ పేరు, సక్సెస్,ఫెయిల్యూర్ తో సంబంధం లేదు, ఏమాత్రం తగ్గని ప్రభాస్ క్రేజ్
పులికి ప్రభాస్ పేరు, సక్సెస్,ఫెయిల్యూర్ తో సంబంధం లేదు, ఏమాత్రం తగ్గని ప్రభాస్ క్రేజ్
సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేదు.. పులి ఎప్పుడైనా పులే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా వరుస ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్నా.. పులిలా.. ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. రీసెంట్ గా ఈ విషయం మరోసారి ప్రూ అయ్యింది.

ఒకప్పుడు టాలీవుడ్ కు మాత్రమే పరిమితం అయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గా మారిపోయాడు. దాంతో ఆయన మీద బాధ్యత, బరువు కూడా పెరింది. అయితే బాహుబలి తరువాత వచ్చి రెండు పాన్ ఇండియా సినిమాలు ఆయన్ను నిరాశ పరిచాయి.
పాన్ ఇండియా రేంజ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ప్రభాస్. వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. సలార్. ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ తో పాటు మారుతీతో కూడా ఓసినిమా చేయబోతున్నాడు యంగ్ రెబల్ స్టార్.
బాహుబలి ప్రాంఛైజీ సినిమాల తర్వాత ఇంటర్నేషనల్ స్టార్ డమ్ సంపాదించాడు ప్రభాస్ . అయితే ఆ తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలు బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టినా..ప్రభాస్‌కు క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. రీసెంట్ గా ఈ విషయం మరోసారి నిరూపితం అయ్యింది. ఏకంగా పులికే ప్రభాస్ పేరు పెట్టారు ఓ జూ అధికారులు. అది కూడా రాయల్ బెంగాల్ టైగర్ కు.
హైదరాబాద్‌లోని నెహ్రూ జువాలాజికల్ పార్కులోని రాయల్ బెంగాల్ టైగర్ కు జూ అధికారులు ప్రభాస్ అనే పేరు పెట్టినట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్. రాజసం ఉట్టిపడేలా కనిపించే రాయల్ బెంగాల్ టైగర్ కు పేరు పెట్టి..ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చాటి చెప్పారు. ఈ క్రేజీ విషయం తెలిసిన ప్రభాస్ అభిమానులు ఫుల్ దిల్ ఖుషీ అవుతున్నారు.
ప్రభాస్ అభిమానులు. ప్రస్తుతం ప్రభాస్ మోకాలి సర్జరీ కారణంగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. కొన్ని రోజుల రెస్ట్ తరువాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో చేస్తున్న సలార్ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. హైదరాబాద్‌లో సలార్ షెడ్యూల్ జరుగుతుంది. ప్రభాస్ ఖాతాలో బ్యాక్ టు సినిమాలున్నాయి.