ట్రోల్స్ పై నేహా శెట్టి క్రేజీ ఆన్సర్.. వాన పాట అంటే శ్రీదేవినే గుర్తొస్తుందట..
`డీజే టిల్లు`లో రాధికగా మెప్పించి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన నేహా శెట్టి.. ఆ మధ్య ట్రోల్‌కి గురైంది. ఈ నేపథ్యంలో దానిపై స్పందిస్తూ క్రేజీ ఆన్సర్ ఇచ్చింది.

నేహాశెట్టి.. సైలెంట్ యంగ్ సెన్సేషన్. `డీజే టిల్లు` మూవీ ఈ బ్యూటీ లైఫ్‌నే మార్చేసింది. ఇందులో రాధికగా రచ్చ చేసింది. గ్లామర్‌తోపాటు కాస్త నెగటివ్ షేడ్ ఉన్న రోల్ చేసి మెప్పించింది. ఈసినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. దీంతో పాపులర్ అయిన ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల `బెదురులంక`లో మెరిసిన ఈ భామ ఇప్పుడు `రూల్స్ రంజన్` చిత్రంతో రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ బ్యూటీ ట్రోల్స్ పై స్పందించింది.
ఆ మధ్య విశ్వక్ సేన్‌తో కలిసి `గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి` సినిమాకి సంబంధించిన పాటలో కాలేజ్ ఈవెంట్‌లో డాన్సు చేసింది. ఇది బాగా వైరల్‌తోపాటు ట్రోల్స్ కి కూడా గురైంది. ఈ నేపథ్యంలో తాజాగా దానిపై స్పందించింది నేహా శెట్టి. క్రేజీ ఆన్సర్ ఇచ్చింది. అసలు తాను ట్రోల్స్ చూడనని, సోషల్ మీడియాని పెద్దగా పట్టించుకోనని తెలిపింది. దీంతో అక్కడ ఏంజరిగిందో తనకు తెలియదని చెప్పింది. అయితే అలాంటి ఏం చేసినా దానిపై ఒక్కొక్కరికి ఒక్కో ఒపీనియన్ ఉంటుందని, అందరి అభిప్రాయాలను తాను రెస్పెక్ట్ చేస్తానని తెలిపింది. వారు ట్రోల్స్ చేసినా, ప్రశంసించినా తాను స్వీకరిస్తానని పేర్కొంది. అయితే ఆ ట్రోల్స్ తానుచూడని, అందుకే అవి తనపై ప్రభావాన్ని చూపవని పేర్కొంది.
ప్రస్తుతం కిరణ్ అబ్బవరంతో కలిసి ఈ బ్యూటీ `రూల్స్ రంజన్` చిత్రంలో నటిస్తుంది. రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించారు. ఈ నెల 6న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించింది.
మరోవైపు వాన పాటలపై స్పందించింది. తాను ఈ చిత్రంలో `సమ్మోహనుడా` అనే పాటలో నర్తించిన నేపథ్యంలో ఆమె రియాక్ట్ అవుతూ, తనకు వానపాటలంటే శ్రీదేవినే గుర్తొస్తుందని, ఆమెకి తాను పెద్ద అభిమానిని అని పేర్కొంది నేహా శెట్టి. `చాలా చిన్న వయస్సులో తన సినీ జీవితాన్ని ప్రారంభించిన ఆమె, ఎలాంటి హద్దులు లేకుండా ఉన్నత స్థాయికి చేరారు. ఆమెలా తానుకూడా పేరు తెచ్చుకోవాలి అనుకుంటున్నాను. నా మొదటి పాటలో రెయిన్ సీక్వెన్స్ ఉండడం, ఆ పాటకి ఈ స్థాయి స్పందన లభిస్తుండటం చాలా ఆనందంగా ఉందని చెప్పింది.
`డీజే టిల్లు`తో నేహా శెట్టి కెరీర్ బిగ్ టర్న్ తీసుకుంది. దీనిపై రియాక్ట్ అవుతూ, నా మొదటి సినిమా `మెహబూబా` విజయం సాధించలేదు. ఆ తర్వాత నేను యాక్టింగ్ కోర్స్ కోసం న్యూయార్క్ వెళ్లాను. నేను ఎన్నో ఆశలతో మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చాను. కానీ కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా మరికొంత కాలం వేచి ఉండాల్సి వచ్చింది. అప్పుడే నాకు `డీజే టిల్లు`లో రాధిక క్యారెక్టర్ ఆఫర్ వచ్చింది. సినిమా థియేటర్లలో విడుదలయ్యాక, ప్రేక్షకులు వెంటనే ఆ పాత్రతో కనెక్ట్ అయ్యారు. ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అది తన కెరీర్‌ని పెద్ద మలుపు తిప్పిస్తుంది. ఆ తర్వాత వరుసగా హిట్లు వచ్చాయి అని చెప్పింది. ఇప్పుడు `రూల్స్ రంజన్`తో హ్యాట్రిక్ హింట్ కొట్టాలనుంది. ఏం జరుగుతుందో చూడాలి, కానీ కాస్త నర్వస్‌గా అనిపిస్తుందని చెప్పింది నేహా శెట్టి.
`రూల్స్ రంజన్` సినిమా గురించి చెబుతూ, కథ భిన్నంగా ఉంటుంది. అందులో సంఘర్షణ ఉంది. కామెడీ ఉంది. ఇది రొటీన్ అబ్బాయి-అమ్మాయిల కథ కాదు. ఇది ఆకర్షణీయమైన లవ్ థీమ్‌ను కలిగి ఉంది. దానిని విభిన్నంగా మలిచారు. నేను ఇందులో సన పాత్ర పోషించాను. `డీజే టిల్లు`లో రాధికలాగా సనాది స్వార్థపూరిత పాత్ర కాదు. ఆమె తిరుపతికి చెందిన సంతోషకరమైన అమ్మాయి. ఆమె సాహసోపేతమైనది మరియు ప్రపంచాన్ని అన్వేషించాలని కోరుకుంటుంది. పాత్ర పరంగా సన గ్లామర్‌గా ఉంటుంది. అందమైన, బబ్లీ, పక్కింటి అమ్మాయి తరహా పాత్ర.
`సమ్మోహనుడా` పాటకి డ్యాన్స్ చేయడమే అత్యంత ఛాలెంజింగ్ టాస్క్. మీరు పాటను గమనిస్తే, నేను నిప్పులో, నీటిలో, పువ్వుల మధ్య, కొలను పక్కన నృత్యం చేయాల్సి వచ్చింది. చిత్రీకరణ చాలా కఠినంగా ఉంది. విలువైనవి ఛాలెంజింగ్ గా ఉంటాయి. కానీ చివరికి శ్రమకి దానికి తగ్గ ఫలితం లభిస్తుంది. నటుడిగా కిరణ్ చాలా కూల్. అతను సెట్స్‌లో వినయంగా, కామ్ గా ఉంటాడు. నేను మాత్రం పూర్తి వ్యతిరేకం (నవ్వుతూ). కెమెరా ముందు ఫ్రీగా ఉండాలని సెట్స్ లో సరదాగా మాట్లాడిస్తాను.