Neha Shetty : వోణి గాలికొదిలేసిన టిల్లుగాడి లవర్.. ట్రెడిషనల్ లుక్ లో రాధిక మెరుపులు!
యంగ్ బ్యూటీ నేహాశెట్టి (Neha Shetty) లేటెస్ట్ లుక్ తో ఆకట్టుకుంటోంది. పద్దతిగా ట్రెడిషనల్ వేర్ లో మెరిసినా ఈ ముద్దుగుమ్మ మెరుపులకు మాత్రం ఫ్యాన్స్, నెటిజన్లు మంత్రముగ్ధులు అవుతున్నారు.
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ యంగ్ హీరోయిన్ నేహా శెట్టిని టాలీవుడ్ కు పరిచయం చేశారు. ‘మెహబూబా’ చిత్రంతో ఈ ముద్దుగుమ్మ తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది. అప్పటి నుంచి ఇక్కడే వరుస చిత్రాలు చేస్తోంది.
‘గల్లీ రౌడీ’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘డీజే టిల్లు’, ‘బెదురులంక 2012’ వంటి చిత్రాలతో అలరించింది. కానీ ఈ బ్యూటీకి గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా మాత్రం DJ Tillu. సిద్ధూ జొన్నలడ్డ సరసన నటించి మెప్పించింది.
రాధిక పాత్రలో డీజే టిల్లు లవర్ గా ఆకట్టుకుంది. తన నటనతో ఆడియెన్స్ ను కట్టిపడేసింది. ఈ చిత్రం తర్వాత నేహాకు టాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుతూ వచ్చాయి. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది.
ఓవైపు సినిమాలతో అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. తన బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ ఫ్యాషన్ ను పరిచయం చేస్తూనే మరోవైపు గ్లామర్ విందు చేస్తోంది.
నేహా శెట్టి ఎక్కువగా ట్రెడిషనల్ లుక్ లోనే మెరిసేందుకే ప్రాధాన్యత ఇస్తుంటుంది. తాజాగా కూడా లెహంగా, వోణీలో దర్శనమిచ్చింది. గ్రీన్ కలర్ లెహంగా, మ్యాచింగ్ బ్లౌజ్ లో ఆకట్టుకుంది. మరోవైపు వోణీ తీసేసి మరీ ఫొటోలకు ఫోజులిచ్చి కట్టిపడేసింది.
సంప్రదాయా దుస్తుల్లో మెరుస్తూనే నేహా శెట్టి తన అందంతో ఆకట్టుకుంటోంది. మరిన్ని ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న ఈ ముద్దుగుమ్మ దర్శకనిర్మాతల కంట్లో పడేందుకు ఇలా ప్రయత్నిస్తోంది. నెక్ట్స్ విశ్వక్ సేన్ తో కలిసి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రంతో అలరించనుంది.