- Home
- Entertainment
- Viral News: కాంగ్రెస్ ఎమ్మెల్యే కూతురి బోల్డ్ ఫోటోలు, నెటిజన్ల ట్రోలింగ్ మాములుగా లేదుగా.
Viral News: కాంగ్రెస్ ఎమ్మెల్యే కూతురి బోల్డ్ ఫోటోలు, నెటిజన్ల ట్రోలింగ్ మాములుగా లేదుగా.
నేహా శర్మ.. ఈ పేరు చాలా మందికి తెలియకపోయినప్పటికీ చిరుత సినిమా హీరోయిన్ అంటే ఠక్కున గుర్తు పడుతారు. సినిమాల్లో ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోతున్న ఈ చిన్నది సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ గ్లామర్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ శ్రీలంక వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను షేర్ చేయగా. నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..

నటి నేహా శర్మ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో ఆమె ఎర్ర డ్రెస్సులో సముద్ర తీరంలో కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఓవైపు కొందరు ఈ బ్యూటీ అందాన్ని పొగుడుతూ కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ట్రోల్ చేస్తున్నారు.
37 ఏళ్ల నేహా శర్మ ఇప్పుడు శ్రీలంకలో టూర్ ఎంజాయ్ చేస్తోంది. సముద్ర తీరంలో సరాదాగా గడుపుతోన్న ఫొటోలను అభిమానులతో షేర్ చేసింది. అయితే ఈ ఫొటోల్లో నేహా కాస్త బోల్డ్ గా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ ఫొటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేసిన బ్యూటీ.. 'సముద్రానికి దాని స్వంత స్వభావం ఉంటుంది. అయితే నేను మాత్రం ఇక్కడికి సరదాగా గడపడానికి వచ్చాను. గాలిలో ఉప్పు వాసన, కాలి కింద ఇసుక, ప్రతీ నీటి బొట్టులో ఆనందం' అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ రాసుకొచ్చింది.
కాగా ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఫైర్, రెడ్ హార్ట్ ఎమోజీలు షేర్ చేస్తూ పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటే. మరికొందరు మాత్రం ట్రోల్ చేస్తున్నారు.
ఓ నెటిజన్ నేహాపై సీరియస్ అవుతూ.. శర్మాజీ పరువు కాపాడు అంటూ కామెంట్ చేయగా. మరో యూజర్ స్పందిస్తూ.. ఇలాంటి ఫొటోలు పోస్ట్ చేసేకంటే నటనపై దృష్టి సారిస్తే బాగుంటుంది అంటూ రాసుకొచ్చాడు. ఇక ఒక యూజర్ స్పందిస్తూ.. నేహా అందమైన రెడ్ డ్రస్ లో సముద్ర తీరంలో వేడిని పెంచిందంటూ రాసుకొచ్చారు. ఇదే సమయంలో నెగిటివ్ కామెంట్స్ కూడా ఎక్కువగానే వచ్చాయి.
ఇదిలా ఉంటే చిరుత సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్ ను పలకరించిన ఈ అందాల తార బీహార్‌లోని భాగల్‌పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అజయ్ శర్మ కూతురు. వృత్తిలో నటి, మోడల్. ప్రస్తుతం నేహా ముంబైలో తన సోదరి ఆయేషా శర్మతో కలిసి ఉంటోంది. నేహా కెరీర్ విషయానికొస్తే 2007లో వచ్చిన చిరుత సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత 2010లో వచ్చిన క్రూక్ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత నేహా క్యా సూపర్‌కూల్ హైం హమ్, యమ్లా పగ్లా దీవానా 2, యంగ్‌స్తాన్, ముబారకన్, తానాజీ లాంటి సినిమాల్లో కనిపించింది.