‘చిరుత’ హీరోయిన్ చెల్లిని చూశారా! అక్కను మించి అందాలు ఆరబోస్తోందిగా.. ఆమె ఏం చేస్తుందంటే?
చిరుత హీరోయిన్ నేహా శర్మ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తుంటుంది. తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ అదరగొడుతోంది. తాజాగా చెల్లితో కలిసి మెరిసింది. ట్రెండీ వేర్స్ లో అక్కాచెల్లెళ్ల స్టిల్స్ చూస్తే అంతే..
హాట్ హీరోయిన్ నేహా శర్మ (Neha Sharma) సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా సందడి చేస్తుంటుంది. తన గురించిన అప్డేట్స్ ను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ఇప్పటికే నేహా శర్మ నెట్టింట ఎంతలా రచ్చరంభోలా చేస్తుందో తెలిసిందే. ఈ బ్యూటీ దర్శనమిస్తే అందాల దూమరమనేలా చేస్తోంది. బికినీల్లో, మినీ వేర్స్ లో ఫొటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతోంది. స్కిన్ షోతో రచ్చచేస్తోంది.
తాజాగా ఆమె సొంత చెల్లెల్లు ఆయిషా శర్మ (Aisha Sharma)తో కలిసి ఓ రిసార్ట్ కు వెళ్లింది. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ గ్లామర్ ఫొటోలను నేహా అభిమానులతో పంచుకుంది.
నేహా పంచుకున్న ఫొటోల్లో చెల్లి ఐషా టూ స్టన్నింగ్ గా కనిపిస్తోంది. బ్లాక్ ట్రెండీ వేర్ లో కిర్రాక్ లుక్ ను సొంతం చేసుకుంది. చాలీచాలని టాప్ లో ఈ ముద్దుగుమ్మ టాప్ అందాలను ప్రదర్శించింది. దీంతో నెటిజన్లు కామెంట్లతో పిక్స్ ను వైరల్ చేస్తున్నారు.
ఇంతకీ ఆయిషా ఏం చేస్తుందో తెలుసుకుందాం.. ఆమె కూడా నటినే. హిందీలో 2018లో హిందీలో విడుదలైన ‘సత్యమేవ జయతే’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె చేసిన మొదటి, చివరి చిత్రమిదే. తర్వాత ఓ వెబ్ సిరీస్, పలు మ్యూజిక్ వీడియోల్లో నటించింది.
ఆయిషా శర్మకు కూడా ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేవు. నేహా శర్మ వచ్చిన ఆఫర్లను వినియోగించుకుంటోంది. చివరిగా నవాజుద్దీన్ సిద్ధిక్ సరసన ‘జోగిరా సారా రారా’ చిత్రంతో అలరించింది. ఇక అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఇలా నెట్టింట సందడి చేస్తూనే ఉంటారు.