MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • విజయ్ 'గోట్' మూవీలో ఛాన్స్ మిస్ చేసుకున్న క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా ?

విజయ్ 'గోట్' మూవీలో ఛాన్స్ మిస్ చేసుకున్న క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా ?

గోట్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్శకుడు వెంకట్ ప్రభు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, స్నేహా పాత్రకు మొదట ఎంపికైన నటి గురించి వెల్లడించారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 12 2024, 02:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
విజయ్ ,వెంకట్ ప్రభు కాంబో

విజయ్ ,వెంకట్ ప్రభు కాంబో

 తలపతి 68వ చిత్రం కోసం పలువురు దర్శకులు పోటీ పడుతున్న సమయంలో, నిశ్శబ్దంగా తలపతి సినిమా అవకాశాన్ని దక్కించుకున్నారు వెంకట్ ప్రభు. అయితే, మొదట రజినీ - ధనుష్ లను దృష్టిలో పెట్టుకుని ఈ కథను రాసుకున్నారట వెంకట్ ప్రభు. ఐశ్వర్య - ధనుష్ విడాకుల తర్వాత, ఆ ప్రాజెక్ట్ కు అవకాశం లేకపోవడంతో... ఈ డబుల్ యాక్షన్ స్టోరీని తలపతికి వినిపించగా, ఆసక్తిగా విన్న విజయ్ ఎప్పుడు షూటింగ్ కు వెళ్లాలి అని అడగడంతో వెంకట్ ప్రభు ఆనందానికి అవధులు లేకుండా పోయాయట.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Goat సినిమా

Goat సినిమా

తలపతి సినిమా అనగానే, ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాన్ని AGS సంస్థ దక్కించుకుంది. అంతేకాదు, ఈ సినిమా కోసం విజయ్ కు 200 కోట్ల పారితోషికం ఇవ్వడమే కాకుండా, సినిమా నిర్మాణానికి కూడా 200 కోట్లు ఖర్చు చేశారు. సినిమా విడుదలకు ముందే లాభాలను తెచ్చిపెట్టిందని అర్చనా కల్పతి తెలిపారు. విజయ్ - వెంకట్ ప్రభు కాంబినేషన్ లో సెప్టెంబర్ 5న వినాయక చవితి కానుకగా విడుదలైన 'Goat' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది.


 

36
స్నేహా

స్నేహా

ద్విపాత్రాభినయం చేసిన నటుడు విజయ్ కు జోడిగా స్నేహా నటించారు. అంతేకాదు, తలపతి చాలా బోల్డ్ నెగటివ్ షేడ్ లో కూడా నటించారు. ముఖ్యంగా ఈ చిత్ర క్లైమాక్స్ ఊహించని విధంగా ఉండటం అతిపెద్ద ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు. ఈ చిత్రం యొక్క స్క్రీన్ ప్లే ను వెంకట్ ప్రభు తీర్చిదిద్దిన విధానమే ఈ చిత్రం విజయానికి దారితీసింది. 
 

46
Goat సినిమా కలెక్షన్లు

Goat సినిమా కలెక్షన్లు

గత 6 రోజుల్లో దాదాపు 350 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రంలో, విజయ్ తో పాటు ప్రశాంత్, ప్రభుదేవా, లైలా, అజ్మల్, ప్రేమ్ జీ, విటివి గణేష్ వంటి భారీ తారాగణం నటించింది. తమిళంలోనే దాదాపు 100 కోట్ల వసూళ్లను సాధించిన 'Goat' చిత్రం, 500 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని తలపతి అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 


 

56
Goat లో మొదటిగా నయనతార

Goat లో మొదటిగా నయనతార

ఈ చిత్ర హీరోయిన్ గురించి డైరెక్టర్ వెంకట్ ప్రభు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే, స్నేహా కంటే ముందు తలపతి భార్య పాత్రలో నటింపజేయడానికి నయనతారను సంప్రదించారట వెంకట్ ప్రభు. ఆమెకు కథ చెప్పి, అంగీకారం కూడా తీసుకున్న తర్వాత కొన్ని కారణాల వల్ల నయనతార 'Goat' చిత్రంలో నటించలేకపోయింది. దీంతో స్నేహాను తీసుకున్నట్లు తెలిపారు.

66
నయనతార నుండి స్నేహాకు అభినందనలు

నయనతార నుండి స్నేహాకు అభినందనలు

అంతేకాదు, 'Goat' సినిమా చూసిన తర్వాత, నటి నయనతార తనకు ఫోన్ చేశారని... మీరు నన్ను సంప్రదించిన పాత్రకు స్నేహా సరిగ్గా సరిపోయింది, ఆమె నటన చాలా బాగుంది.. ఆమెకు నా శుభాకాంక్షలు చెప్పండి అని అన్నారట. నయనతార గుణం చాలా గొప్పదని తన ఇంటర్వ్యూలో వెంకట్ ప్రభు పేర్కొన్నారు.


 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Recommended image2
Jr NTR: గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్, డ్రాగన్ షూటింగ్‌పై కీలక అప్‌డేట్, సెట్స్‌పైకి ఎప్పుడంటే?
Recommended image3
OTT: ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఇవే.. థ్రిల్లర్స్, రొమాంటిక్ మూవీస్ రెడీ.. ఒక్కటి కూడా మిస్ అవ్వొద్దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved