- Home
- Entertainment
- ఓ స్టార్ హీరోయిన్ చేయాల్సిన శాకుంతలం.. సమంత చేతికి ఎలా వచ్చింది...? ఎవరా హీరోయిన్..?
ఓ స్టార్ హీరోయిన్ చేయాల్సిన శాకుంతలం.. సమంత చేతికి ఎలా వచ్చింది...? ఎవరా హీరోయిన్..?
ప్రస్తుతం సౌత్ సినిమా ఆడియన్స్ చూపు అంతా శాకుంతలం సినిమాపైనే ఉంది. దానికి రకరకాల కారణాలు ఉండగా.. ఈమూవీపై మరో రూమర్ గట్టిగా చక్కర్లుకొడుతుంది. ఈసినిమా అసలు సమంత చేయాల్సిందికాదా..?

Samantha
ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని అనుకోకుండా జరుగుతుంటాయి. ఒక స్టార్ వదిలేసిన కథతో మరో స్టార్ సినిమా చేసి హిట్ కొట్టడం. లేదా ప్లాప్ ఫేస్ చేయడం లాంటివి జరుగుతుంటాయి. ఈక్రమంలో ప్రస్తుతం సమంత కు కూడా ఇలాంటి పరిస్థితే ఏదురయ్యిందట...?
ఒకరు కథను రిజెక్ట్ చేస్తే.. మరోక స్టార్ ఆ సినిమాను చేయడం రేర్ గా జరుగుతుంది. ఇక ఈపరిస్థితి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కు ఏదురయ్యింది. సమంత నుంచి త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమా శాకుంతలం. డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్టన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. వచ్చే నెల 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది మూవీ.
ఈసినిమాపై సౌత్ వ్యాప్తంగా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. ఎందుకంటే ఈసినిమాల సమంత నటించడం. సమంత పరిస్థితి ఇప్పుడు ఏలా ఉందో అందరికి తెలిసిందే. అనారోగ్యంతో పాటు.. చైతూతో డివోర్స్ అయ్యి.. చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తంది సామ్. ఆత్మవిశ్వాసంతో అన్నింటిని అధిగమిస్తూ.. వస్తోంది. ఈక్రమంలో వస్తున్న సినిమా కావడంతో అందరి దృష్టి శాకుంతలం సినిమాపైనే ఉంది.
ఇక ఈ సినిమాగురించి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఒకటి వైరల్ అవుతోంది. ఈసినిమా కోసం ముందుగా సమంతను అనుకోలేదట గుణశేఖర్. శాంకుతలం కథను అనుకున్నప్పుడు ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ని అప్రోచ్ అయ్యారట గుణశేఖర్. అంతేకాదు కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారతో ఈ కథను చేయాలని బాగా ఆశపడ్డాడట సీనియర్ దర్శకుడు.
అయితే ఆయన కూతురు నీలిమ గుణ మాత్రం ఈ కథను స్టార్ హీరోయిన్ సమంత చేస్తేనే కథకు అర్థం ఉంటుందని ..ఆమె ఈ పాత్రకి సెట్ అయినట్టు మరి ఎవరు సెట్ అవ్వరని సమంతను అప్రోచ్ అయ్యి కధను వివరించారట . సమంత కూడా మరో మాట మాట్లాడకుండా ఈ సినిమాకు సైన్ చేసి తన కాల్ షీట్స్ ని అడ్జస్ట్ చేసిందట.
ఏది ఏమైనా సరే శకుంతల పాత్రలో సమంత సెట్ అయినట్టు నయనతార సెట్ అవ్వదు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . చూడాలి మరి సమంత ఈ సినిమా ద్వార ఎలాంటి హిట్ ని అందుకుంటుందో..?