Nayanthara: సినిమాలకు సైన్ చేయాలంటే నయనతార కొత్త కండిషన్స్.. నెమ్మదిగా దూరం..?
కెరీర్ ఆరంభంలో నయనతార ఎంత గ్లామర్ గా నటించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చివరకి శృంగార సన్నివేశాల్లో సైతం నయన్ నటించింది.

నయనతార, విగ్నేష్ శివన్ జంట ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. మహాబలిపురంలో విగ్నేష్, నయనతార వివాహం వైభవంగా జరిగింది. నయన్, విగ్నేష్ వివాహానికి సినీ ప్రముఖులు హాజరై ఆశీర్వదించారు. హీరోయిన్లకు పెళ్లి అయితే సినిమాల విషయంలో అనేక కోణాల్లో ఆలోచిస్తారు.
ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేయాలి కాబట్టి మునుపటిలా నటించలేరు. నయనతార కూడా అందుకు మినహాయింపు కాదు అంటున్నారు. కెరీర్ ఆరంభంలో నయనతార ఎంత గ్లామర్ గా నటించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చివరకి శృంగార సన్నివేశాల్లో సైతం నయన్ నటించింది. అందాలు ఆరబోస్తూ యువతని తనవైపు తిప్పుకుంది.
క్రమంగా నయన్ గ్లామర్ రోల్స్ తగ్గిస్తూ వచ్చింది. ఇటీవల కాలంలో నయన్ అంతగా రొమాంటిక్, గ్లామర్ రోల్స్ చేయలేదు. తాజా సమాచారం మేరకు నయన్ పూర్తిగా గ్లామర్ రోల్స్ కి దూరం కాబోతోందట. పెళ్లి తర్వాత గ్లామర్ రోల్స్, రొమాంటిక్ సీన్స్ లో నటించకూడదు అని నిర్మాతలకు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టబోతోందని టాక్.
ఈమేరకు సినిమాకు సైన్ చేసే ముందే అగ్రిమెంట్ కుదుర్చుకోనుందట. కేవలం నటనకు స్కోప్ ఉన్న రోల్స్ మాత్రమే చేయబోతోందని ప్రచారం జరుగుతోంది. ముందుగా లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తన పాత్రని బట్టి రొమాన్స్ లేకుండా కమర్షియల్ చిత్రాలకు ఒకే చెప్పనుందని అంటున్నారు.
అది కూడా బల్క్ అమౌంట్ లో కాల్షీట్స్ ఇవ్వదట. స్లో అండ్ స్టడీ అన్నట్లుగా ఒక చిత్రం పూర్తయిన తర్వాతే మరో మూవీ విషయంలో నిర్ణయం తీసుకోనుంది. దీనివల్ల ఫ్యామిలీకి కూడా సమయం కేటాయించవచ్చు. నయన్ కి ఇప్పటికిప్పుడు సినిమాలు వదిలేసే ఆలోచన లేదు.
నెమ్మదిగా సినిమాలకు దూరం కానుంది అని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే నయనతార సినిమా ప్రమోషన్స్ కి హాజరు కాదు. దీనికి తోడు ఇప్పుడు కొన్ని కొత్త నిబంధనలు చేరనున్నాయి.