గోల్డ్ కలర్ శారీలో నయనతార హోయలు.. లేడీ సూపర్‌స్టార్ రేంజ్ మామూలుగా లేదుగా!
లేడీ సూపర్ స్టార్‌గా రాణిస్తుంది నయనతార. గ్లామర్ ఫోటోలు పంచుకోవడం చాలా అరుదు. కానీ ఇటీవల రూట్ మార్చింది. ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంది.

నయనతార స్టార్ హీరోల స్థాయి ఇమేజ్‌తో రాణిస్తుంది. అదే సమయంలో అలాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో అలరిస్తుంది. ఆమె సినిమాలు సైతం బాక్సాఫీసు వద్ద అదే రేంజ్‌లో సత్తా చాటుతుండటం విశేషం.
ఈ నయనతార కమర్షియల్‌రోల్స్ చేసే సమయంలో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. మధ్యలో ఆమె తగ్గించింది. చాలా అరుదుగా కనిపించింది. కానీ ఇటీవల పెళ్లై, పిల్లలు ఆయ్యాక మాత్రం తన రేంజ్‌ని చూపిస్తుంది. ఇప్పుడు గోల్డ్ కలర్ శారీలో మెరిసింది. అందరి చూపు తనవైపు తిప్పుకుంది.
తాజాగా నయనతార ముంబయిలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వేడుకలో పాల్గొంది. ఇందులో ఆమె స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. గోల్డ్ కలర్ శారీలో మెరిసి అందరిని తనవైపు ఆకర్షించింది. చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది.
లేడీ సూపర్ స్టార్ ఈ రేంజ్ హాట్‌నెస్ ని గ్లామర్‌ని ప్రదర్శించడం చాలా అరుదు. కానీ తాజాగా చూపించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోలను భర్త విఘ్నేష్ శివన్ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకోవడం విశేషం.
నయనతార తెలుగులో చివరగా `గాడ్ ఫాదర్`లో నటించింది. అంతకు ముందు చిరుతో `సైరా`లో జోడీగా చేసిన విషయం తెలిసిందే. `గాడ్ ఫాదర్`లో సిస్టర్‌గా మెప్పించింది.
గతేడాది `జవాన్`లో నటించి సంచలన విజయాన్ని అందుకుంది. దీంతోపాటు తమిళంలో `ఇరైవన్`, `అన్నపూర్ణిః ది గాడ్డెస్ ఆఫ్ ఫుడ్` చిత్రాలు చేసింది. `అన్నపూర్ణి` వివాదాలకు కేరాఫ్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆమె చేతిలో తమిళంలో `టెస్ట్` అనే మూవీ ఉంది. దీంతోపాటు `మన్నంగట్టి సిన్స్ 1960` చిత్రంలో బిజీగా ఉంది. మరోసారి ఆమె తెలుగులో సినిమా చేయబోతుందనే వార్తలు వచ్చాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.