నయనతార లేటెస్ట్ లుక్ వైరల్.. పున్నమినాటి జాబిలిలా మైమరపిస్తున్న లేడీ సూపర్ స్టార్
నయనతార ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నయన్ నటిస్తోంది.

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఏడాది తన ప్రియుడు విగ్నేష్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నయనతార.. సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయింది.
నయనతార ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నయన్ నటిస్తోంది. ఈ చిత్రంలో నయన్ బికినీ సన్నివేశాల్లో కూడా నటించబోతుందనేది హాట్ న్యూస్. అదే స్థాయిలో రెమ్యునరేషన్ కూడా అందుకుంటోందట.
వివాహం తర్వాత కూడా నయన్ జోరు తగ్గడం లేదు. ఇదిలా ఉండగా నయనతార ఏదైనా చిత్రానికి కమిటైతే కేవలం షూటింగ్ కి మాత్రమే హాజరవుతుంది. ప్రచార కార్యక్రమాలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ , ఇంటర్వ్యూలకు నయన్ ఆమడ దూరంలో ఉంటుంది.
ముందు నుంచే నయన్ ఈ తరహా నిబంధనల్ని నిర్మాతలకు చెబుతుంది. కానీ ఆమె క్రేజ్ చూసి చేసేది లేక నిర్మాతలు అంగీకరిస్తారు. అయితే ఇటీవల తన పంథా మార్చుకున్నట్లు తెలుస్తోంది. సినిమా ఈవెంట్స్ కి హాజరవుతోంది.
గత ఏడాది విడుదలైన తన కనెక్ట్ చిత్రం కోసం నయన్ తెలుగులో కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. తాజాగా నయనతార కోలీవుడ్ లో జరిగిన ఓ అవార్డుల వేడుకకు హాజరైంది. వైట్ శారీలో పున్నమినాటి జాబిలా నయనతార మెరుపులు మెరిపించింది.
ఎంతో అందంగా ఉన్న ఆమె లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. నయనతార చివరగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో నటించింది. ఈ మూవీలో నయన్ చిరు చెల్లి పాత్రలో నటించడం విశేషం.
నయనతార, విగ్నేష్ శివన్ దంపతులు సరోగసి విధానం ద్వారా పిల్లలని పొందారు. ఈ సంఘటన వివాదంగా మారిన సంగతి తెలిసిందే. నాలుగు నెలల క్రితం నయనతార, విగ్నేష్ శివన్ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
పెళ్ళైన నాలుగు నెలలకే వీరిద్దరూ తల్లిదండ్రులు కావడం, అది కూడా సరోగసి విధానం ఎంచుకోవడంతో హాట్ టాపిక్ గా మారింది. అంటే వీరిద్దరూ పెళ్ళికి ముందే సరోగసి ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నయనతార సరోగసి ద్వారా పిల్లలని పొందడం వివాదంగా మారింది.